By…… విరించి విరివింటి………….. మొన్న మదనపల్లి సంఘటనతో అందరిలో వచ్చిన ఒక నిశ్చిత అభిప్రాయం ఏమంటే మనమధ్యే చాలామంది పిచ్చివాళ్ళు తిరుగుతూ ఉన్నారని. మన దేశంలో మన కల్చర్ లో మన భాషలో పిచ్చివాళ్ళు అనగానే ఒక లేకి అభిప్రాయం, చిన్నచూపు, అసహ్యమూ కలిగించే పరిస్థితి ఉంది. కానీ పిచ్చివాళ్ళు నేరస్థులు కాదు. వారు కొన్ని నమ్మకాలకు విక్టిమ్స్ అని గుర్తించడమే కాక వారిని సరైన సమయంలో గుర్తించి వారికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే మనందరిలో పిచ్చితనం ఎంతో కొంత ఉంటుంది. కొంతమందిలో Sub Threshold Mental Disorders ఉంటాయి. ఒక స్టడీ ప్రకారం దాదాపు 17% మందిలో ఇవి ఉంటాయి. అలాగే కొంత మందిలో Mental Disorders ఉన్నప్పటికీ లక్షణాలు తక్కువ స్థాయిలో (Sub Threshold symptoms) ఉంటాయి. దాదాపు 30 శాతం మందిలో ఇవి ఉంటాయి. అంటే దాదాపు 47% మందిలో లక్షణాలు బయటకు కనిపించకుండా un noticed గా ఉంటాయి. వీళ్ళంతా మాములు వ్యక్తుల్లాగే మనమధ్యే తిరుగుతూ ఉంటారు. కానీ కొన్ని స్పెసిఫిక్ సమయాల్లో వాళ్ళ ప్రవర్తనల్లో మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తూ వారిలోని వ్యాధి లక్షణాలను బయటపెడుతుంటాయి.
ఇపుడిపుడే సోషల్ మీడియాలో వాడబడుతున్న భాష ఆధారంగా వ్యక్తి బాధపడే మెంటల్ డిసార్డర్ లను గుర్తించగలిగే కొన్ని స్టడీస్ వస్తున్నాయి. కొందరు వ్యక్తులు profile లో anonymous గా క్రియేట్ చేసి వారి ఐడెంటిటీని గోప్యంగా ఉంచుతుంటారు. ఒకే వ్యక్తికి పది దాక anonymous social media ids ఉండటమూ సర్వసాధారణమే. వీరిలో unreality అనేది perceived anonimity రూపంలో ఉంటుంది. వీళ్ళ జీవితాల్లో తీసుకునే నిర్ణయాలూ అలాగే ఉంటాయి. దాక్కుని దాక్కుని ఏదో సాధించేయగలమనే భ్రమలో ఉంటారు. Anonimity తో బలముంటుందని వాళ్ళు నమ్మడం, అన్నీ గోప్యంగా చేయడం, తద్వారా వాడే భాషలో అడ్డూ అదుపూ లేకపోవడమూ, బూతులు తరచుగా వాడడమూ కనిపిస్తూ ఉంటుంది. పోస్ట్ లు vs కామెంట్స్ నిష్పత్తి చూసుకుంటే.. కొందరు పోస్ట్స్ రాసేకంటే కామెంట్స్ పెట్టడం కోసమే ఐడీ క్రియేట్ చేసుకుంటారు. ఒక నిశ్చితాభిప్రాయం కానీ దానిని ఎక్స్ప్రెస్ చేసే శక్తి గానీ వారి చదువు వారికి అందించలేకపోవడం మన విద్యావ్యవస్థలోని లోపాన్ని తెలియజేస్తుంది. మన ఊహలను ఆలోచనలను సహజ రీతిలో అవసరమైన అంగీకరమైన భాషలో హుందాగా వ్యక్తం చేయించలేని విద్య మనిషిని మనిషిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడదు. Expression అనేది విద్యావంతుడి ప్రథమ లక్షణం అనుకుంటే Expression కి సరైన టూల్స్ లేని వారు పడే కష్టాలు ఇవి. ఇందుకు తగ్గ జీవితసమస్యలనూ వీళ్ళు కలిగి ఉంటారు. జీవితంలో ఎన్నో కష్టాలు lack of proper expression వలన కొని తెచ్చుకున్నవే. వాటి ప్రతిఫలనం వారి షోషల్ మీడియా బిహేవియర్ లో కనిపిస్తూ ఉంటుంది.
Ads
వాడుతున్న భాష, గేలి చేసే తత్వం, వాక్య నిర్మాణంలో క్లిష్టత, ఐడెంటిటీ సమస్యలు, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ చేసే యాడ్ హోమినం, ఇత్యాదివన్నీ వాళ్ళు రాత ద్వారా పొందే సంతృప్తిని తెలియజేస్తాయి. కొంతమందిని ఆలోచింపజేయడం కోసం రాయడానికి కొంతమందిని తిట్టడం కోసమో లేదా వాళ్ళని హర్ట్ చేయడం కోసమో రాసే రాతలలో వాడబడే భాష వేరుగా ఉంటుంది. కొందరిలో ఏలియనేషన్ కనిపిస్తుంటుంది. అన్నింటికీ మరెవరో కారణమనే అన్ రియలిస్టిక్ యాటిట్యూడ్ ఉంటుంది. రాత ప్రతిఫలించే ఉద్వేగాన్ని బట్టి భాష మారుతుంటుంది. ఇతరులను “అందరినీ” తక్కువ చేసి మాట్లాడే నార్సిస్సిజం, చేస్తున్న ప్రొఫెషన్ కీ వాడుతున్న భాషకూ సంబంధంలేనితనం lack of self – respect రూపంలో కనబడుతూంటుంది. రియల్ పర్సన్ కి సోషల్ మీడియా లో కనిపించే ఫిక్షనల్ పర్సోనాకి వీలైనంత అగాధాన్ని సృష్టించుకుని స్వీయతృప్తిని పొందే వారూ ఉంటారు. ఇవన్ని రూపాలు ఎందుకు అంటే sub threshold symptoms మనకు చూచాయగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని గుర్తించి వారిని సరైన దిశలో మోటివేట్ చేయడమూ అవసరం. వారి వారి పోస్టుల ఆధారంగా వారి జీవితాలూ, జీవిత నిర్ణయాలూ నిర్దేశింపబడుతుంటాయని గుర్తించడం అవసరం. మనందరిలో కనిపించే, మన మధ్య ఉన్న వాళ్ళలో కనిపించే ఈ సబ్ థ్రెషోల్డ్ లక్షణాలను సరి చేసుకోగలగడం కూడా చాలా అవసరం. పిచ్చితనం అంటే చిరిగిన దుస్తువులు చింపిరి నెత్తి కాదు. ఒక్కోసారి అద్దంలో నీటుగా టిక్ టాక్ గా కనిపించే మనమే. అద్దంలో చెదిరిన క్రాఫును సరిచేసుకున్నట్టు మన లోపలికి మనం చూసుకుని సరిచేసుకునే లోఅద్దాలు కావాలి………… విరించి విరివింటి
Share this Article