5.21, 5.17, 5.12… ఏమిటివి..? కేరాఫ్ అనసూయ అనే ఓ తెలుగు టీవీ సీరియల్ రేటింగ్స్… ఇవి హైదరాబాద్ కేటగిరీ రేటింగ్స్, బార్క్ టోటల్ రేటింగ్స్ చూస్తే 7, 8 నడుమ ఉంటయ్… సో, ఆఫ్టరాల్ ఓ తెలుగు సీరియల్, ఇది ఓ పెద్ద విశేషమా అనకండి… ప్రైమ్ టైమ్‌లో వచ్చే సీరియళ్లను సహజంగానే కాస్త ఆదరణ ఎక్కువ ఉంటుంది, ప్రేక్షకులు అధికంగా చూస్తారు… కానీ ఇది మధ్యాహ్నం రెండు గంటలకు వస్తుంది… లంచవర్… నాన్-ప్రైమ్… ఐనా సరే, హిట్ సీరియళ్లకు దీటుగా రేటింగ్స్ సాధిస్తోంది… మాటీవీ మార్కెటింగ్ వాడు ఎందుకో దీన్ని తొక్కేస్తున్నాడు గానీ, దీన్ని గనుక ప్రైమ్ టైంలో అకామిడేట్ చేస్తే దీని రేంజ్ ఇంకా ఎక్కడికో పోతుంది… సరే, ఇందులో ఏమేం రాజకీయాలున్నాయో ఏమో గానీ… నానా పిచ్చి సీరియళ్లతో పోలిస్తే ఇది హిట్… అఫ్ కోర్స్, అన్ని టీవీ సీరియళ్లూ చెత్తే… కానీ ఇది కాస్త మెరుగైన చెత్త… దీనికి కారణం ఎవరో తెలుసా..?
ఈమే… పేరు అర్చన అనంత్… మన తెలుగు టీవీ సీరియళ్లు అంటేనే కన్నడ నటులు కదా… ఈమెది కూడా కర్నాటకే… కేరాఫ్ అనసూయలో ఈమెదే ప్రధాన పాత్ర… దంచేస్తోంది… కాస్త అహం, అభిమానం, రోషం ఉన్న పాత్ర… ఆ టెంపర్‌మెంట్ భలే చూపిస్తోంది… ఎస్, మీరు అనుకుంటున్నది కరెక్టే… తెలుగు టీవీల్లో ఆల్ టైమ్ హిట్ సీరియల్ కార్తీకదీపంలో సౌందర్య పాత్ర చేసేది ఈమే… అంటే ప్రేమీ విశ్వనాథ్ అత్త పాత్ర… కోడలికి అండగా నిలబడి, కొడుకు మూర్ఖత్వానికి బాధపడే పాత్ర… దీని కన్నడ వెర్షన్ ముద్దులక్ష్మిలో కూడా ఈమే ఆ పాత్ర పోషిస్తోంది… నిజానికి ఇది కాదు చెప్పుకోవాల్సింది… బోలెడు మంది తారలున్నారు, ఈమె స్పెషాలిటీ ఏముంది అంటారా..?
Ads
తండ్రి అనంత్ కన్నడ నటుడు… తల్లి ఉద్యోగి… వాళ్లు కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మాట్లాడగలరు… ఈమె స్వతహాగా బ్యూటిషియన్, మోడలింగ్ మీద ఆసక్తి… కానీ దేహం మీద అదుపు లేదు, తొందరగానే పెళ్లయింది… సంతానం… బరువు పెరిగిపోయింది… పైన ఫోటో చూశారుగా, తండ్రితో దిగిన ఫోటో… వయస్సు మళ్లిన పాత్రలు పోషిస్తోంది గానీ ఆమె అసలు వయస్సు 33 ఏళ్లు మాత్రమే, పదేళ్ల కొడుకు… పేరుకు ఫ్యాషన్ డిజైనర్, మోడల్… కానీ పెరిగిన బరువుతో నటన మీద తన ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించలేదు…
ఇక ఓ మంచిరోజున మన పాపులర్ మూవీ సింగర్ కల్పనలాగే బరువు తగ్గాలని నిర్ణయం తీసుకుంది… లిపోసెక్షన్లు, కృత్రిమ పద్ధతులు కాదు, తను బ్యూటిషియనే కదా, తనకు తెలిసిన పద్ధతుల్లో కష్టపడటం ప్రారంభించింది… ఫలించింది… 55 కిలోలకు తగ్గిపోయింది… టీవీ సీరియళ్లలో అవకాశాలు వచ్చాయి, ప్రూవ్ చేసుకుంది… అవకాశాలు వచ్చి వరించవు, కష్టపడనిదే ఫలితం రాదు అని చెప్పడానికి… మనకేం కావాలో మనకు తెలిసి ఉండి, మన మైనస్ పాయింట్లు ఏమిటో మనమే రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయాలనేది ఈ కథలో నీతి… లైపోలు కాదు, సహజమైన పద్ధతులున్నాయీ అని చెప్పడానికి ఈమె రోజూ మనకు కనిపించే ఓ ఉదాహరణ… అదీ సంగతి…!!
Share this Article