Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఛలో నాగాలాండ్…! ఫ్యామిలీ మ్యాన్-3 అసలు కథ ఏమిటో తెలుసా..?!

June 9, 2021 by M S R

ఇండియా రక్షణకు అత్యంత కీలక ప్రాంతం డోక్లాం… అసలే అది చికెన్ నెక్‌కు కాస్త ఎగువన, భూటాన్ సరిహద్దుల్లో ఉంటుంది… హఠాత్తుగా చైనా బలగాలు దిగుతాయి… అర్జెంటుగా రోడ్లు వేస్తుంటాడు… సైనికులకు ఇళ్లు కట్టేస్తుంటాడు… ఫైటర్ జెట్స్ ఎగురుతూ ఉంటయ్… నెలల తరబడీ ఇండియా- చైనా నడుమ ఆ ముఖాముఖి, ఆ ఉద్రిక్తత… తరువాత ఇటు లడఖ్ వైపు వస్తాడు… గాల్వన్ వ్యాలీలో ముళ్లబడితెలు పట్టుకుని దాడులు చేస్తాడు… ఇంకోసారి అరుణాచల్ ప్రదేశ్ హద్దుల్లో… నాగా తీవ్రవాదులు సహా భారత వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇస్తుంటాడు… హిందూ మహాసముద్రంలో సబ్‌మెరైన్లు తిరుగుతూ ఉంటయ్… చైనా వైరస్ కథ సరేసరి……. అసలు చైనా ట్రూపుల కదలికల వెనుక వ్యూహాలు ఏమిటి..? వాటిని మన గూఢచార విభాగాలు ఎలా నిర్వీర్యం చేస్తున్నయ్… ఎస్, అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ఫ్యామిలీ మ్యాన్ మూడో సీరీస్ కథ చైనా ట్రూపుల మీదేనట…

familyman3

సెకండ్ సీరీస్ చివరలో ఓ హింట్ ఇచ్చారు కదా దర్శక రచయితలు… రాబోయే సీరీస్ చైనా, నాగాలాండ్ అంటూ హింట్స్ వదిలారు… అందరూ వుహాన్ ల్యాబ్, కరోనా వైరస్ అంటూ ఊహాగానాలు చేశారు కానీ… చైనా దళాల కదలికల మీద ఉంటుందట కథ… ఫస్ట్ సీరీస్ కాశ్మీర్, పాకిస్థాన్, ఐఎస్ఐ గట్రా సబ్జెక్టు… సెకండ్ సీరీస్ శ్రీలంక, టైగర్లు ఎట్సెట్రా సబ్జెక్టు… ఇప్పుడిక చైనా… మొత్తానికి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నారు… వెళ్లడమే కాదు, చైనా దుర్నీతులపై స్టడీ చేయడమే కాదు… ఆ సీరీస్‌ను చైనా వాళ్ల మాండరిన్ భాషలో కూడా అనువదించి, అమెజాన్ ఓటీటీలో పెట్టేయాలి… అదెలాగూ అంతర్జాతీయమే కదా… మంచి డిబేట్ సాగుతుంది… అయితే ఈ కొనసాగింపు సీరీస్‌లో నాగాలాండ్ ఎందుకు వచ్చి చేరింది..? డోక్లాం కాదు, గాల్వన్ కాదు, అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ అంతకన్నా కాదు… మరి నాగాలాండ్ ఆపరేషన్ ఏమిటబ్బా..? బర్మా సరిహద్దుల్లో అనేక భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు చైనా సహకరిస్తూ ఉంటుంది… అందులో వీళ్లు ఎంచుకున్న ఆపరేషన్ ఏమిటి..? అదీ ఇంట్రస్టింగు… గుడ్… ఆ సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తేనే బెటర్…

Ads

familyman(for representaion only)

Guan Yu… ఈ మూడో సీరీస్‌ను ఇలా పిలుస్తున్నారట… ఆ పేరు పాపులరే… రెండో శతాబ్దానికి చెందిన చైనా సైనిక నాయకుడు… చైనీయులు అమితంగా ఆరాధిస్తారు తనను… ఆయనకూ ఈ కథకూ లింకేమిటి అనేదీ సస్పెన్సే… ఫస్ట్ పార్ట్ అంతా ముంబై, ఢిల్లీ, కాశ్మీర్… సెకండ్ పార్ట్ అంతా చెన్నై, ఢిల్లీ, లండన్, ముంబై… ఇప్పుడీ థర్డ్ పార్టేమో ఢిల్లీ- ఈశాన్య రాష్ట్రాల సెంటర్లు… బహుశా గౌహతి బేస్డ్ ఆపరేషన్ ఉంటుందేమో… సేమ్, ఇందులో కూడా అదే ప్రియమణి, అదే మనోజ్ వాజ్‌పేయి… టాస్క్… అంటే Threat Analysis and Surveillance Cell (TASC) వర్క్… సెకండ్ పార్ట్‌లో సమంత అదరగొట్టేసిన పాత్ర వంటిదే థర్డ్ పార్ట్‌లో ఏమైనా ఉంటుందా..? అందులో ఆమే నటిస్తుందా..? వెయిట్ అండ్ వాచ్… అంతే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions