Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో నో… ఇందిర భర్తను గాంధీ దత్తత తీసుకోలేదు… ఆ ఇంటిపేరు ఓ వింత కథ…

October 2, 2023 by M S R

Nancharaiah Merugumala……..  ఇందిర, రాజీవ్‌ లకు ‘గాంధీ’ ఇంటిపేరుగా మారడంతో అసలు గాంధీకే చెడ్డపేరొచ్చింది! ఇంటిపేరు మార్పించిన ‘పాపం’ పండిత నెహ్రూదే!

……………………………………………..

జర్నలిస్టు–మేధావి, ‘స్వతంత్ర’ కాంగ్రెస్‌ నేత నేత ఫిరోజ్‌ గాంధీతో కూతురు ఇందిరా ప్రియదర్శిని (అప్పటికి 24 ఏళ్లు) పెళ్లి సమయంలో (1942, మార్చి 26న) పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ చేసిన ఒక ‘పాపం’ భారతదేశంలో ‘గాంధీ’ అనే గుజరాతీ వైశ్య ఇంటి పేరుకు చెడు లేదా దుష్ట స్వభావాన్ని ఆపాదించేసింది.

Ads

గుజరాతీ జొరాష్ట్రియన్‌ (ఫార్సీ లేదా పార్శీ) కుటుంబంలో పుట్టిన ఫిరోజ్‌ జహంగీర్‌ (రెండో మాట ఆయన తండ్రి పేరు) ఘాండీ (Ghandy) ఇంటిపేరు ‘ఘాండీ’ నెహ్రూజీకి ఎందుకో ‘ఇబ్బందికరంగా’ కనిపించింది. అత్యంత ఆధునికుడిగా ముద్రపడిన నెహ్రూకి ఫిరోజ్‌ ఏ కారణంగానో నచ్చలేదు. అల్లుడు రాసే, మాట్లాడే ఇంగ్లిష్‌ అంటే కూడా ఆయనకు చిరాకేనట.

కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా గానీ చిన్నప్పుడు అలహాబాద్‌ లో తండ్రి మోతీలాల్‌ ప్రభావం, ఇంగ్లండ్‌ స్కూలు, కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో చదువుల వల్ల తనకు ఇష్టం లేని అల్లుడి ఇంటి పేరు వింతగా కనిపించింది నెహ్రూ గారికి. అందుకే, ‘కనీసం నీ ఇంటి పేరు ఘాండీ ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ Ghandy ని శాశ్వతంగా Gandhi అని మార్చుకో,’ అని ఆయన పట్టుబట్టారు లేదా సూచించారు మన తొలి ప్రధాని.

అంటే తాను తండ్రిగా ప్రేమించే, పూజించే మోహన్‌ దాస్‌ కే గాంధీ ఇంటి పేరులా అల్లుడి కుటుంబనామం మారితే ఎవరికీ వింతగా ఉండదని నెహ్రూ అనుకున్నట్టున్నారు. కాదు, తన అల్లుడు ఫిరోజ్‌ మహాత్మా గాంధీ బంధువు అని జనం భ్రమపడతారనే ఆశ కూడా జవహర్‌ లాల్‌ కు అప్పట్లో ఉండేదనేది కొందరు నెహ్రూ వ్యతిరేకుల అభిప్రాయం.

May be a black-and-white image of 2 people

ఏదైతేనేమి– అల్లుడు ఫిరోజ్‌ తో తన కూతురు ఇందూ పెళ్లి నెహ్రూకి నచ్చకపోవడంతో ఈ ఫార్సీ యువకుడిని మహాత్మా గాంధీ దత్తత తీసుకున్నారనే ప్రచారం లేదా అభిప్రాయం ఇప్పటికీ చదువుకున్న కోట్లాది మంది భారతీయుల్లో ఉంది. వాస్తవానికి అత్యున్నత వ్యక్తిత్వం, నెహ్రూ కుటుంబ సభ్యులకు లేని నిజాయితీ, విలువలు ఉన్న ఫిరోజ్‌ ను గాంధీ దత్తత తీసుకున్న మాట పూర్తిగా అబద్ధం. ఇది కేవలం కట్టుకథ మాత్రమే.

ఈ విషయాన్ని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర రాసిన (లండన్‌ కింగ్స్‌ కాలేజీ ఇండియా ఇనిస్టిట్యూట్‌ లో డైరెక్టర్‌ హోదాలో పాఠాలు చెప్పిన అధ్యాపకుడు ఆయన) సింధీ మేధావి ప్రొఫెసర్‌ సునీల్‌ ఖిల్నాణీ ఒక ఇంటర్వ్యూలో కూడా ధ్రువీకరించారు. ఇప్పుడు దిల్లీ సమీపంలోని అశోకా యూనివర్సిటీలో ఖిల్నాణీ రాజనీతిశాస్త్రం, చరిత్ర బోధిస్తున్నారు.

ఏదేమైనా– ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ పరిపాలనలో అవకతవకలు, అవినీతి కారణంగా వారు పెట్టుకున్న ‘గాంధీ’ అనే ఇంటి పేరు ఉన్నవారికే గాకుండా, మహాత్మా గాంధీకి కూడా ‘చెడ్డ పేరు’ వచ్చిందనే అభిప్రాయం కొన్ని వర్గాల ప్రజల్లో విస్తృతంగా వ్యాపించింది… అర్థమైంది కదా… ఫిరోజ్‌ను గాంధీ దత్తత తీసుకోవడం అబద్ధం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions