Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇజ్రాయిల్ అంటే అంతే..! నో కాంప్రమైజ్..! ఈ థ్రిల్లర్ ఓసారి చదవండి..!

March 6, 2025 by M S R

.

ముందుగా వాట్సప్ గ్రూపుల్లో బాగా సంచరిస్తున్న ఒక పోస్టులోని ఒక భాగాన్ని తీసుకుందాం… అది ఇజ్రాయిల్‌కు అనుకూలంగా బీజేపీ సోషల్ బ్యాచ్ పుష్ చేస్తున్న పోస్ట్… బాగానే వైరల్ అవుతోంది… అయితే ఆ మొత్తం పోస్టు గాకుండా… అందులో ఒక స్టోరీని తీసుకుందాం…

ఇజ్రాయిల్ ధోరణి స్థూలంగా ఎలా ఉంటుందో ఈ కథ మనకు చెబుతుంది… ఈ కథ పేరు ‘ఆపరేషన్ థండర్ బోల్ట్’… అయితే ఈ వైరల్ కథలో లేని కొన్ని ఫినిషింగ్ టచెస్ ఏమిటో కూడా చదువుకోవాల్సి ఉంది… ఎందుకంటే..? ఒక ఆపరేషన్ ప్రభావం దానికి ఏ సంబంధమూ లేని వాళ్లపై కొన్నిసార్లు ఎలా పడుతుందో… కాలం ఆయా దేశాల సంబంధాలను ఎలా మారుస్తుందో… రాజకీయాలు ఎలా మారిపోతాయో తెలియాలంటే ఈ ట్విస్టులూ చదవాలి…

Ads

సరే, ముందుగా ఈ కథను చదవండి… వాట్సప్ గ్రూపుల్లో వస్తున్నదే… వికీపీడియాలో ఉన్నదే… పలు డ్రామాలు, పుస్తకాలు, సినిమాలు కూడా వచ్చినయ్ ఈ ఆపరేషన్ మీద… స్పై శిక్షణ క్లాసుల్లో ప్రధానంగా చెప్పబడే పాఠాల్లో ఇదీ ఒకటి… ఆ కథ ఏమిటనగా…

Ari france

అది 1967 జూన్ 27… ఇజ్రాయెల్ విమానాన్ని HIJACK చేసిన పాలస్తీనా తీవ్రవాదులు మొదట్లో లిబియా విమానాశ్రయంలో దాచిపెట్టారు … చుట్టూ అన్నిదేశాల సహకారంతోనే చేసినప్పటికీ విళ్ళకు ధైర్యం చాల్లేదు… ఇజ్రాయెల్ ఎట్లైనా వచ్చి విడిపించుకొని పోతుందనే భయంతో మళ్ళీ 4000 km. దూరంలోని Remote ఆఫ్రికన్ ISLAMIC దేశమైన ఉగాండాకు Shift చేసారు …

ఉగాండా సైన్యాధ్యక్షుడు ఈతీ అమీన్ రాక్షసుడిలా నియంత, ఛండశాసనుడు… ఇజ్రాయెల్ అంటే ఎంతో కోపం. తీవ్రవాదులకు పూర్తి మద్దతు ప్రకటించి తన సైన్యాన్ని కూడా Hijackers కు మద్దతుగా నిలిపి, మారిషస్ లో ప్రపంచదేశాల సమావేశాలకని బయల్దేరి వెళ్ళాడు …

విమానంలోని 54 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులను మాత్రమే బంధించి మిగతా దేశాల ప్రయాణికుల్ని విడుదల చేసి, రెండు కిలోమీటర్ల దూరంలోని హోటల్ కి తరలించారు తీవ్రవాదులు … విమాన ప్రయాణికులను విడుదల చేయాలంటే …, జైలులో ఉన్న మా పాలస్తీనా తీవ్రవాదులందరినీ విడుదల చేయాల్సిందేనని, 5 Million Dollars డబ్బు ముట్టచెప్పాల్సిందేనని … July 3rd వరకే గడువు … ఒక్క రోజు ఆలస్యమైనా ప్రయాణికులందర్నీ ముక్కలుముక్కలుగా నరికేస్తామని హెచ్చరికలు జారీ చేశారు…

ISRAEL Cabinet అత్యవసరంగా సమావేశమై Intelligence Wing MOSSAD తో చర్చించి వాళ్ళ Secret Plan ను ఏమాత్రం బయటపెట్టకుండా … మీ డిమాండ్లకు సానుకూలంగా ఉన్నాము. మాకు కొంత గడువివ్వండి అంటూ అధికారిక ప్రకటన చేసారు” … ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గదనుకున్న ఇజ్రాయెల్ ఇంత తొందరగా దిగివచ్చినందుకు తీవ్రవాదులు ఎగిరి గంతేశారు …

OPERATION THUNDER BOLT Started …

అది July, 3rd అర్ధరాత్రి…!
చుట్టూ శత్రుదేశాలు..
ఎవరూ కనీసం విమానాల్లో ఇంధనం నింపుకోవడానికి కూడా అనుమతివ్వరు…
సుదూరంలో 4 వేల కి.మీ దూరము….

వెళ్ళడానికి ఏదోవిధంగా ఇంధనం సరిపోతుందనుకున్నా తిరిగిరావడం కష్టం …
పైగా ఏ శత్రుదేశానికి తెల్సినా ప్రమాదమే …
అన్నీ ఆలోచించి మొత్తం 5 యుద్ధ విమానాల్లో మూడింటిలో Black Cat Commandos, ఒక దాంట్లో Communication System తో పాటూ Medical Equipment, ఒకటి ఖాళీగా,…

(ప్రయాణికులను విడిపించుకొని తేవడానికి… అర్ధరాత్రి ఒంటిగంటకు ఎర్రసముద్ర మార్గంగుండా … శత్రు RADARS కు అందకుండా కేవలం 100 మీటర్ల ఎత్తులోనే ఎగురుతూ వెళ్ళి UGANDA విమానాశ్రయానికి వెళ్ళగానే వాళ్ళ అధ్యక్షుడే మారిషస్ నుండి తిరిగి వచ్చాడేమోనని భ్రమించారు…

పైగా నిద్రమబ్బు సమయం కదా …
ఇంకో కలిసొచ్చిన విషయమేమిటంటే…
ఆ Airport Contractor కూడా ఒక ఇజ్రాయిలీయే కాబట్టి మొత్తం Airport Sketch వీరిదగ్గరున్నట్లే …
ముందు జాగ్రత్తగానే (తిరుగు ప్రయాణానికవసరమైన ఇంధనం కూడా Just UGANDA చేరుకుంటామనగానే నింపుకున్నారు) …

uganda airport old

ఇక ఇజ్రాయెల్ బంధీలను దాచిపెట్టిన Hotel Address కూడా విడుదలైన ఇతర దేశాల బంధీల Statements ద్వారా తెల్సుకున్నారు…

విచిత్రమేమంటే … వీళ్ళు నిజంగానే Uganda అధ్యక్షుడు వాడుతున్న Colour & Desinged Plane లోనే వెళ్ళారు … పైగా తనలాగే నల్లగా కుంభాసురుడిలాగా ఉన్నవాడికే తన వేషం వేసి) ముందు నిలిపారు… ఇక వాళ్ళకు అనుమానమే లేకుండా పోయింది… ఒకే ఒక్క Security Gaurd వీళ్ళపై Doubt పడి Fire చేద్దామనుకునేలోపే వీళ్ళ Silenced Guns దెబ్బకు Silent గా కుప్పకూలిపోయాడు …

15 నిమిషాల్లోనే మొత్తం సైనికులందరినీ మట్టుబెట్టి 2 కి.మీ దూరంలో ప్రయాణికులను బంధించిన హోటల్లో కెళ్ళి “హిబ్రూ భాషలో మేము ఇజ్రాయెల్ సైనికులం.మిమ్మల్ని తీసుకెళ్ళడానికొచ్చాము.దయచేసి అందరూ బయపడకుండా పడుకోండి. మీకేమీకాదు” అని అరిచేసరికి ప్రయాణికులంతా పడుకోవడంతో వాళ్ళకు ఏ ప్రమాదమూ జరుగకుండా 15 నిమిషాల్లోనే తీవ్రవాదులందరినీ వారికి మద్దతుగా ఉన్న ఉగాండా సైనికులందరినీ మట్టుబెట్టి …, ప్రయాణికులందర్నీ తీసుకొని Airport కు చేరుకొని … అంతటితోనే ఆగకుండా ఉగాండా Airport చుట్టుపక్కల గల Defence Force నంతటినీ ధ్వంసం చేసి, అందరూ Safe గా Flight లోకి చేరుకున్నాకే నేను Flight ఎక్కుతానని అందర్నీ క్షేమంగా ఎక్కించిన OPERATION THUNDER Team Leader యనాతన్ నేతాన్యాహు మాత్రం Bullet దెబ్బలు తగిలి అక్కడే నేలకూలడం ఎంతో విషాదకరం …
అతని ప్రేరణతో దేశసేవకై ప్రాణాలర్పించడానికి ముందుకొచ్చినవాడే…!,
నేడు ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఉన్న అతని తమ్ముడు బెంజమిన్ నేతాన్యాహు

Operation Successfully Completed …
World Mesmerized..
Even,… Russia, America Shocked…

అందరికంటే పెద్ద బక్రా అయింది మాత్రం ఉగాండా అధ్యక్షుడు ఈదీ అమీనే …
OPERATION THUNDER BOLT అంతా అయిపోయిన రెండు రోజులకు గానీ విషయం తెల్వనేలేదు …
చెప్పేంత సాహసం వాళ్ళ Assistants చేస్తే గదా …!
అయితే, Hospital లో ఉన్నవిషయం తెలియక వదిలివెళ్ళిన ఇజ్రాయిలీ మహిళను అత్యంత కౄరాతి కౄరంగా హింసించి చంపేసారు ఆ రాక్షసులు …

అత్తమీది కోపం దుత్తమీద తీసినట్లు….. నాలుగు వేల కి.మీ దూరంనుండి దేశంగాని దేశం వచ్చి చిందరవందర చేసి భీభత్సం సృష్టించిన ఇజ్రాయెల్ సైనికులపై పోరాడే దమ్ములేదు గానీ… అనారోగ్యంతో బాధపడుతున్న అమాయక మహిళపై తమ ప్రతాపం చూపించారు వెదవలు ….

కొసమెరుపేమంటే … HIJACK కుట్రకు మూలకారకుడైన Terrorist Ldr ముప్పైరోజుల్లోనే విషప్రయోగంతో చావడం … ఇజ్రాయిలీ గూఢచార సంస్థ వేటాడి వేటాడి ఖతం చేశాయ్…



thunder bolt

ఇంకొన్ని విషయాలు చెప్పుకోవాలి కదా మరి….

  • ఈదీ అమీన్ వాడే కారులాంటిదే ఓ కారును విమానాల్లో వేసుకొచ్చారు ఇజ్రాయిలీ కమెండోలు… కానీ అంతకుముందే అమీన్ కారు రంగు మారిపోయిన విషయం విమానాశ్రయం సెక్యూరిటీ వాళ్లకు తెలుసు, అందుకే ఆ కారును అటకాయించారు… సైలెన్సర్ ఉన్న తుపాకులతో వాళ్లను కాల్చారు కమెండోలు…
  • ఈ హైజాకింగుకు పాల్పడింది పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా – ఎక్స్‌టర్నల్ ఆపరేషన్స్ (PFLP-EO)…

 

  • ఈ ఆపరేషన్‌ను ఆపరేషన్ ఎంటెబీ అని కూడా అంటారు… మొదట ప్లాన్ ప్రకారం నేవీ కమెండోలు విక్టోరియా సరస్సులో దిగి, రబ్బరు పడవల్లో ఆ సరస్సు ఒడ్డునే ఉన్న విమానాశ్రయాన్ని చేరాలనీ, ఆ సమీపంలోని హోటల్‌లోనే బందీలను దాచినందున, అక్కడికి చేరి, హైజాకర్లను కాల్చేసి వెళ్లిపోవాలని అనుకున్నారు… కానీ చివరలో మార్చేశారు…
  • తిరిగి వెళ్లేందుకు ఇంధనం ఎలా అనేదే సమస్య… ఈ విషయంలో కెన్యా వ్యవసాయ మంత్రి మెకెంజీ సాయపడ్డాడు… నైరోబీ ఎయిర్‌పోర్టులో దిగడానికి, ఫ్యుయల్ నింపుకోవడానికి ఆ సాయం ఉపయగోపడింది… మిగతా దేశాలు అమీన్ కోపానికి గురికావల్సి ఉంటుందని భయపడ్డాయ్…

 

  • ఇలా సాయపడినందుకు మెకంజీ విమానంలో బాంబు పేల్చి చంపారు ఉగాండా ఏజెంట్లు… అంతేకాదు, ఉగాండాలో నివసిస్తున్న వందల మంది కెన్యా దేశస్తులను ఊచకోత కోయించాడు అమీన్… తమకేమీ సంబంధం లేకపోయినా కడతేరిపోయారు వాళ్లు… 
  • బందీలను విడిపించుకుని వెళ్తున్న ఇజ్రాయిలీ కమెండోలపై ఉగాండా రక్షణదళాలు కాల్పులు జరిపాయి… ఆ కాల్పుల్లోనే నెతన్యాహూ మరణించాడు… ఈ ఆపరేషన్‌ను లీడ్ చేసింది ఆయనే…
  • ఉగాండా కదలికల్ని గమనిస్తూ ఒక అమెరికన్ యుద్ధనౌకను హిందూమహాసముద్రంలో సర్వసన్నద్ధంగా నిలిపారు… ఆపరేషన్ తరువాత…

సీన్ కట్ చేస్తే….. 2012 ఆగస్టు… అదే ఉగాండా, అదే ఇజ్రాయిల్… అదే ఎంటెబీ విమానాశ్రయం… ఆ నెతన్యాహు మరణించినచోట ఓ అధికారిక సంతాప సభ జరిగింది… రెండు దేశాలూ ఉమ్మడిగా దీన్ని నిర్వహించాయి… ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో సహకరించుకోవాలని రెండు దేశాలు పునరుద్ఘాటించాయి.

రెండు దేశాల జెండాలను పక్కపక్కనే ఎగురవేశారు… అంటే… దాడి జరిగిన 40 ఏళ్ళ తరువాత..! ఆ నెతన్యాహూ తమ్ముడు, ప్రస్తుత ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయిల్ బృందంతోసహా ఉగాండా సందర్శించి, రెండు దేశాల దౌత్య సంబంధాలను మరింత బలపరచేందుకు పునాది వేశాడు… అవును… కాలం ఎప్పుడూ ఒకేరీతిలో ఉండదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions