కొద్దిరోజులుగా మనం స్పేస్‌లోకి వెళ్లిన వాళ్ల గురించి చెప్పుకుంటున్నాం కదా… ఈ ఒక్కటీ ఓసారి చదవండి… ‘‘2003లో కొలంబియా స్పేస్ షిప్ ప్రమాదంలో మన కల్పనా చావ్లా సహా మరికొందరు ఆస్ట్రోనాట్స్ మరణించారు… తరువాత నాసా కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయినట్టు అయిపోయింది… కానీ తేరుకుని, 2006లోనే మరో టీం రెడీ చేశారు… అందులో మన సునీతా విలియమ్స్ కూడా ఉంది… ఓ ఉద్రిక్తత… కొలంబియా ప్రమాదం నేపథ్యంలో అందరిలోనూ ఓ భయం… సునీత భయపడలేదు, భయపడేవాళ్లు ఖగోళయాత్రకు పనికిరారు… ఆమె తన వెంట తీసుకుపోయినవి ఏమిటో తెలుసా..? భగవద్గీత, ఓ చిన్న గణేషుడి విగ్రహం, ఓ చిన్న డబ్బాలో సమోసాలు, తనకు తండ్రి హిందీలో రాసిన ఓ లేఖ… ఆమె తండ్రి ఇండియా నుంచి అమెరికా వెళ్లి సెటిలైన ఓ డాక్టర్, ఆమె తల్లిది యుగొస్లేవియా… సునీత భర్త అమెరికన్… ఐనా తను కర్మరీత్యా కూడా హిందూ…
తరువాత ఆమె ఏదో ప్రెస్‌మీట్‌లో ఉన్నప్పుడు ఎవరో అడిగారు ఇది… ‘‘నేనేమిటో, నా జీవనలక్ష్యమేమిటో, నా అడుగులేమిటో ఎప్పటికప్పుడు నాకు తెలియజెప్పేది, ప్రేరణగా నిలిచేది భగవద్గీత’’ అని స్ట్రెయిట్ ఆన్సర్ ఇచ్చింది సునీత… స్పేస్ వాక్ సమయంలో గానీ, ఐఎస్ఎస్‌లో ఇతర పనుల్లో ఉన్నప్పుడు గానీ అది నాకు తోడు అన్నదామె… స్పేస్ వాక్ చాలా క్లిష్టమైన… కాదు, కాదు, చిన్న పొరపాటు జరిగితే ప్రాణాంతకమైన పని… అయిదారు నెలలపాటు ఐఎస్ఎస్‌లోనే బతుకు……. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నామో తెలుసా..? ప్రతిమా రాయ్… ఈమె అమెరికన్ బెంగాలీ… మూన్ టు మార్స్ మిషన్ కోసం నాసా ఎంపిక చేసుకుని శిక్షణ ఇస్తున్న వారిలో ఈమె కూడా ఉంది… మొన్నామధ్య నాసా ఇన్‌టర్న్‌ల ఫోటోలను ట్వీట్ చేసింది, ఈ ప్రతిమా రాయ్ మొహం మీద బొట్టు, గదిలో హిందూ దేవుళ్ల పటాలు, విగ్రహాలున్నయ్… ఇంకేముంది..? కొందరికి చిర్రెక్కింది…
Ads
నీకు సైంటిఫిక్ టెంపర్‌మెంట్ లేదా అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు… ఈరోజుల్లో సహజమే కదా… హిందూ అనే వాసన తగిలితే చాలు చెలరేగిపోతున్నారు… ఆమె సైలెంటుగా ఉంది… తరువాత ఆ ట్రోలింగుకు ఉల్టా ట్రోలింగు స్టార్టయ్యింది… వేల మంది నెటిజన్లు ఆమెకు సపోర్టుగా వచ్చారు… మొన్న ఇన్‌స్టాగ్రాంలో అందరికీ థాంక్స్ చెప్పి, ఎవరో ఏదో అన్నారని నా నేపథ్యాన్ని, నా సంస్కృతిని, నా విశ్వాసాల్ని వదులుకోను అని తేల్చేసి ఫుల్ స్టాప్ పెట్టేసింది… నిజమే కదా… ఇప్పటికీ ఇస్రో చీఫ్ సైంటిస్టులు కూడా రాకెట్ల నమూనాల్ని తిరుమల వెంకన్న పాదాల దగ్గర, ఒకటీరెండు గ్రామదేవతల గుళ్లలోనూ పూజలు చేస్తారు… ముహూర్తమూ గట్రా చూస్తుంటారు… అంటే ఇస్రో సైంటిస్టులు ప్రొఫెషనల్స్ కారా..? సైంటిఫిక్ టెంపర్మెంట్ లేనట్టేనా..? అసలు సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఏమిటి..? అన్నట్టు చెప్పనేలేదు కదూ… ప్రతిమారాయ్ సోదరి ఉంది… పేరు పూజా రాయ్…
ఈమే పూజా రాయ్… సేమ్ సోదరి గదిలాగే హిందూ దేవుళ్ల పటాలు, విగ్రహాలతో నిండిపోయి ఉంది… ఇద్దరూ విశ్వాసులే… నిజానికి ఇప్పుడు కొత్తగా మొదలైన కంట్రవర్సీ ఏమీ కాదు ఇది… ఈ ఇద్దరి ఫోటోల్ని అప్పట్లో (మార్చిలో కావచ్చు) కొన్ని పత్రికలు, సైట్లు వార్తల్ని ఇచ్చాయి… వాళ్ల బొట్లు చూడగానే సహజంగానే కంగనా రనౌత్‌కు ఆవేశం వస్తుంది కదా… నాసా షేర్ చేసుకున్న ఫోటోల్లో మీ నుదుళ్ల మీద బొట్లు భలే ఆకట్టుకున్నాయి అంటూ ఓ ట్వీట్ కొట్టింది… రకరకాల కామెంట్లు వచ్చాయి… సో, ఇప్పుడు కొత్తేమీ కాదు, ఇక్కడే ఆగదు… కానీ వాళ్లకు సునీతా విలియమ్స్ తీసుకుపోయిన భగవద్గీత, గణేషుడి విగ్రహం కథ తెలియదేమో… 2006 కదా, అప్పటికి ఇంతగా సోషల్ పైత్యం లేదు కదా… బతికిపోయింది…!! (స్టోరీ నచ్చితే దిగువన డొనేట్ బటన్ వద్దకు వెళ్లి ముచ్చటకు అండగా నిలవండి)
Share this Article