నారా లోకేష్ రెడ్ బుక్ తరహాలో ఎనుముల రేవంత్‌రెడ్డి ఏ కలర్ బుక్ కూడా మెయింటెయిన్ చేసినట్టు లేదు… (ఎక్సెప్ట్ పింక్)… యంత్రాంగంలో ఎవరు మనవాళ్లు, ఎవరు పరాయివాళ్లు అని బుర్రలోనే రాసుకుంటూ పోయినట్టున్నాడు… అఫ్‌కోర్స్, అసలు నేను రెడ్ బుక్ ఇంకా ఓపెనే చేయలేదు, అప్పుడే జగన్ గగ్గోలు అంటున్నాడు లోకేషుడు… అంటే, రెడ్ బుక్ ఓపెనయ్యాక ఉంటుంది అసలు కథ అని బెదిరిస్తున్నాడేమో..,
ఏపీ అసెంబ్లీలో ఓ చర్చ… అంకెల జోలికి వెళ్లడం లేదు గానీ… సాక్షికి అడ్డగోలుగా ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి, ప్రజాధనాన్ని దోచిపెట్టడం మీద చర్చ… ఆంధ్రజ్యోతికి నిల్ యాడ్స్… మిగతా అన్ని పత్రికలకూ కలిపి ఎంత ఇచ్చారో దాదాపు అంత సొమ్ము సాక్షికి ఇచ్చారని ప్రభుత్వ వివరణ… (ఇదీ ఓ శ్వేతపత్రమేమో… లేదా రెడ్ బుక్ ఆల్రెడీ పని ప్రారంభించిందేమో…) ఈనాడుకు పేరుకు యాడ్స్ ఇస్తూ బిల్లులు సక్రమంగా ఇచ్చేవాళ్లు కాదు… దాంతో ఒక దశలో ప్రభుత్వ ప్రకటనల్ని ఈనాడు పబ్లిష్ చేయకుండా ఆపేసింది…
చాలా విషయాల్లోలాగే సాక్షి విషయంలో కూడా జగన్ ప్రభుత్వ విధానం అత్యంత కంగాళీయే… ఆంధ్రప్రభ, టైమ్స్, డెక్కన్ క్రానికల్ సర్క్యులేషన్ ఎంత..? వాటి రీచ్ ఎంత…? అంతగా సొమ్ము ఎందుకు ఇచ్చినట్టు…? ఈ వివరణలో సాక్షి ప్లస్ అస్మదీయ ఇతర టీవీ చానెళ్లకు ఇచ్చిన వందల కోట్లు, సాక్షి జిల్లా పత్రికల యాడ్స్ లెక్కలోకి రాలేదు… ఈ ఖర్చుకు సార్థకత ఏమిటి, జనానికి వచ్చిన ఫాయిదా ఏమిటీ అని ఎవరూ అడగరు, అడగలేదు…
Ads
ఇదేనా వాలంటీర్లకు డబ్బులిచ్చి సాక్షి సర్క్యులేషన్ పెరిగేలా ఓ వ్యూహం… అదీ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది వ్యాజ్యం… ఐతే అల్టిమేట్‌గా జగన్‌కు దక్కిన ఫలమేమిటి…? జీరో… ఐప్యాక్ దిక్కుమాలిన స్ట్రాటజీలు, మీడియా హైపులు కౌంటర్ ప్రొడక్ట్ అవుతాయి తప్ప నయాపైసా ప్రయోజనం ఉండదని జగన్ గ్రహించలేక చివరకు 11 నంబర్‌కు తలదించుకోవాల్సి వచ్చింది…
సేమ్, కేసీయార్… జగన్ సొంత పత్రికకు దోచిపెట్టినట్టే కేసీయార్ తన సొంత పత్రికకు కోట్లకుకోట్లు దోచిపెట్టాడు కదా… ఏపీలో కనీసం సాక్షి సెకండ్ ప్లేస్… మరి తెలంగాణలో నమస్తే ప్లేస్ ఏమిటి..? ప్రభుత్వ ప్రకటనల కోసం రూపొందించబడిన సర్క్యులేషన్ కాపీల సంఖ్యల్లో మతలబులు ఏమిటి..? దానికి ఏబీసీ కూడా లేదు… మరి దేని ఆధారంగా అన్ని కోట్లు ఇవ్వబడ్డాయి..? ఆ పద్ధతిలో శాస్త్రీయత ఎంత..?
చంద్రబాబు శిష్యుడిగా చెప్పబడే రేవంత్‌రెడ్డి సేమ్, అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ వంటిది తెలంగాణ అసెంబ్లీలో తను కూడా ఇవ్వవచ్చు కదా… ఏ పత్రికకు కేసీయార్ ఏం చేశాడో కనీసం జనం తెలుసుకుంటారు కదా… ఎలాగూ దానికి యాడ్స్ ఆపేశారు… అది వేరే సంగతి…
గతంలో అటు జగన్, ఇటు కేసీయార్ ఆంధ్రజ్యోతిని వెలివేశారు… ఐనా నిలబడింది, ప్రతిఘటించింది… ఇప్పుడు అక్కడా ఇక్కడా తనకు అనుకూలమైన ప్రభుత్వాలు… ఇక యాడ్స్‌తో ఏబీఎన్‌కు, ఆంధ్రజ్యోతికి ధనకళ… అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు ఎట్సెట్రా కూడా ఉంటాయి… ఈనాడుకూ అంతే కదా… సాక్షికి ఏపీలో నో యాడ్స్, తెలంగాణలో కూడా రేవంత్ పట్ల అకారణ ద్వేషాన్ని, వ్యతిరేకతను కనబరుస్తోంది… సో, తెలంగాణలోనూ నో యాడ్స్ అనుకోవచ్చా..?
ఇకనైనా తన మీడియా, సోషల్ మీడియా, ఇతర పొలిటికల్ అనుబంధ విభాగాల సమగ్ర సమీక్షకు, ప్రక్షాళనలకు జగన్ సంకల్పిస్తాడా..? కేసీయార్ అదే బాటలో నడుస్తాడా..? నెవ్వర్, నమ్మలేం… సాక్షి సాధన సంపత్తి వేరు, జీతాల పెంపు, ఇంక్రిమెంట్ల మీద కొంత నెగెటివ్ ప్రభావం ఉండవచ్చు… మరి నమస్తే..? చెప్పలేం… నిజానికి ఇప్పుడే కేసీయార్‌కు దాని అవసరం ఉంది..!!
Share this Article