Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్… సూపర్‌స్టార్ 40 ఏళ్ల కిందే ‘పట్టేశాడు తెలుసా…

May 26, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… 40 ఏళ్ళ కిందే తెలుగు సినిమాలో రోబోలు , మాట్లాడి పోట్లాడే కారు , వగైరా మసాలాలతో వండి వార్చబడిన సూపర్ డూపర్ హిట్ సినిమా 1984 డిసెంబరులో వచ్చిన ఈ దొంగలు బాబోయ్ దొంగలు .

కృష్ణ ద్విపాత్రాభినయం . కవల సోదరులు . బహుశా ఈ సినిమాకు ముందు ఇలాంటి సేమ్ ఫీలింగ్స్ కవలల కాన్సెప్ట్ ఒక్క అగ్గిపిడుగు సినిమాలోనే ఉందనుకుంటా . కవలల్లో ఒకరికి ఎలాంటి ఎమోషన్స్ కలుగుతాయో అవే మరొకరికి కలగడం ఆసక్తికరంగా ఉంటుంది . ఈ సినిమాలో కూడా ఈ అంశాన్ని బాగా ఉపయోగించుకున్నారు . ఇలాంటి అంశంతోనే నాగార్జున నటించిన హలో బ్రదర్ కూడా ఉంటుంది .

Ads

కృష్ణ తన ద్విపాత్రాభినయంతో చెలరేగిపోతాడు ఈ సినిమాలో . ఒక పాత్ర రాముడు . మంచి బాలుడిగా చదువుకొని గొప్ప ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయి రోబోలను కనిపెడతాడు . ఈ మరమనుషులు మనకు యన్టీఆర్ నటించిన లక్షాధికారిలో కూడా కనిపిస్తాయి . ఇంక. విఠలాచార్య సినిమాలో అయితే హాలీవుడ్ వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిందే .

మరో పాత్ర కృష్ణుడు . చిక్కడు దొరకడు , అసాధ్యుడు . తాగుబోతు తండ్రి పోషణలో తాగుబోతు , జులాయి , దొంగ అవుతాడు . ఈ ఇద్దరి జోడీగా త్రివేండ్రం సిస్టర్స్ అంబిక , రాధలు నటించారు . గ్లామర్ స్పేసుని బ్రహ్మాండంగా ఫిల్ చేసారు . ముఖ్యంగా రాధ పాటల్లో అదరగొట్టేస్తుంది .

ఈ సినిమా సూపర్ సక్సెసుకు కారణాలలో ఒకటి డూండీ నేసిన కధ , స్క్రీన్ ప్లే . అందుకు తగ్గట్టుగానే సినిమాను పరుగెత్తిస్తాడు దర్శకుడు K.S.R.దాస్ . కృష్ణ- K S R దాస్ కాంబినేషన్ గురించి చెప్పేదేముంది ! ఆ తర్వాత సత్యానంద్ డైలాగులను మెచ్చుకోవాలి .

సినిమా ఓ ట్రెజర్ హంట్ కధ . రొటీనుగా కాకుండా ఈ హంటుకి ఎలక్ట్రానిక్సుని జత కలిపారు . ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , పద్మనాభం , అన్నపూర్ణ , అంజలీదేవి , ప్రభాకరరెడ్డి , మమత , చలపతిరావు , హేమసుందర్ , కాకినాడ శ్యామల , కె విజయ , రావి కొండలరావు , మాడా , ప్రభృతులు నటించారు . కృష్ణ సినిమా అంటే తారాగణం భారీగా ఉండాల్సిందే .

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే . చిత్రీకరణ చాలా రొమాంటిగ్గా ఉంటుంది . పాటల్ని కొసరాజు , ఆరుద్ర , సి నారాయణరెడ్డి , గోపిలు వ్రాసారు . ఓయ్ మగడా కాబోయే మొగుడా , ఓసోసి కుర్రదానా , నీలోన నాలోన , నేనంటే ఏమో అన్నావు , తాగిన మైకంలో పాటలు హుషారుగా ఉంటాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , ఆనందులు శ్రావ్యంగా పాడారు .

ఇప్పుడు ప్రపంచమంతా Artificial Intelligence (AI) గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు . రజనీకాంత్ రోబో రెండు సినిమాలు బాగా హిట్టయ్యాయి . ఇవన్నీ మన తెలుగు సినిమాల్లో విఠలాచార్య , KSR దాసులు ఎప్పుడో పెట్టేసారు . Of course . సైంటిఫిక్ వివరణ ఉండి ఉండకపోవచ్చు . అయితే ఈ సినిమాలో సైంటిఫిక్ వివరణ కాస్త ఉంటుంది . కృష్ణ అభిమానులే కాదు , అందరూ చూడతగ్గ 100% entertaining , action movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions