Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీమాన్ సీఎం చంద్రబాబు గారూ… ఓ దిక్కుమాలిన ఆలోచన…

January 16, 2025 by M S R

.

బహుశా… ప్రపంచంలోని ఏ దేశాధినేత కూడా ఈరకం ప్రకటన జారీ చేయలేదు అనుకుంటా… అదీ చంద్రబాబు చేశాడు…

ఇద్దరు పిల్లలకన్నా తక్కువ ఉన్నవాళ్లకు స్థానిక ఎన్నికల్లో అనర్హులుగా చేస్తాడట… అత్యంత దరిద్రమైన నిర్ణయం… గతంలో ఇదే పెద్దమనిషి జనాభా నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయి, ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉంటే అనర్హుడు అన్నాడు…

Ads

సరే, అప్పట్లో ఒకరే బెటర్ అన్నాడు, ఓ దశలో నన్ను చూడండి, నాకొక్కడే లోకేష్ అన్నాడు… అక్కడికి తను ఇంటెన్షనల్‌గా, ప్రపంచ భవిష్యత్తు ఆలోచించి ఒక్కరితో ఆపేసినట్టు… ఇక తరువాత నాలుక కర్చుకున్నాడు, అది వేరే స్టోరీ…

సీన్ కట్ చేస్తే… సారు గారు నలుగురు పిల్లలుంటే 400 ఎకరాల జాయదాద్, అనగా జమీ, అనగా భూస్వామి అన్నమాటే అంటున్నాడు… ఎందుకయ్యా అంటే, వాడెవడో కొరియా వాడు, జపాన్ వాడు మన వాళ్లను రమ్మంటున్నారట…

ఇప్పుడు మన జనం ఇబ్బడిముబ్బడిగా పిల్లల్ని కనేయాలంట… కాదంటే, ఇద్దరు పిల్లలు దాటితే స్థానిక ఎన్నికల్లో పోటీచేయనివ్వడట… హహహ, సారు గారి స్పూర్తి కేంద్ర ఎన్నికల సంఘం, మోడీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని అన్ని ఎన్నికలకూ వర్తింపజేస్తే, ఫస్ట్ అనర్హుడు మోడీ, తరువాత చంద్రబాబు…

అంతేకాదు, చివరకు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ కూడా అనర్హుడే అవుతాడు… పొలిటికల్ మెచ్యూరిటీ కాదు, ఏదైనా ప్రకటనో, వ్యాఖ్యో చేసేటప్పుడు కాస్త కామన్ సెన్స్ వాడాలీ అంటారు పెద్దలు… ఒకే ఒక్క విషయం, చంద్రబాబూ… నువ్వు చెప్పినా సరే, నీ యెల్లో మీడియా చెప్పినా సరే, చివరకు నీ జ్యోతుల నెహ్రూ ఎట్సెట్రా ఘన నేతలు చెప్పినా సరే…

పర్, సపోజ్, ఏవో శారీరక కారణాలతో పిల్లలే లేరనుకుందాం… ఇక వాళ్లు ఎన్నికలకు అనర్హులా..? పోనీ, ఏవో కారణాలతో ఒకరితోనే ఆపేశారనుకుందాం… ఇక వాళ్లకు రాజకీయాలు పనికిరావా..? ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన బాసు గారూ… కష్టపడి, ఏవో మార్గాల్లో ఇద్దరు లేదా అధికుల్ని కనాలా ఇప్పుడు..? ఎవరు పోషిస్తారు..? నువ్వా..? నీ ప్రభుత్వమా..? వాళ్లేమైనా హెరిటేజ్ పిల్లలా..? కావల్సినంత డబ్బుతో పుట్టడానికి..?!

జపాన్, రష్యా, కొరియా, చైనా ఎట్సెట్రా ఏ దేశమైనా సరే…. పెళ్లిళ్లు చేసుకోవడం లేదు, పిల్లల్ని కనడం లేదు… ఎందుకు..? పెంచడం, పోషించడం, చదువు చెప్పించడం, మంచి కొలువు చూపించడం, పెళ్లి చేయడం… ఇవన్నీ పెద్ద టాస్కులు బాబూ… నీలాంటి నడమంత్రపు కుబేర చక్రవర్తులకు సమస్య కాకపోవచ్చుగాక…

పోనీ, నలుగురేసి కన్నారే అనుకుందాం… మీ సోకాల్డ్ డిప్యూటీ, వియ్యంక చక్రవర్తుల సినిమా కల్చర్ వాళ్లను చదువుకూ కొరగాక, ఓ పద్దతిలో పెంపకానికీ కొరగాక… సంఘ విద్రోహులుగా ఎదిగితే..? తల్లిదండ్రుల నెత్తి మీదకొచ్చే సమస్యలను ఫేస్ చేయలేక…. అప్పుడు చంద్రబాబు రాడు, పవన్ కల్యాణ్ రాడు…

వాళ్లదేం పోయింది..? ఖజానా నుంచి ముష్టి విసిరేస్తారు… సో, తెలుగు పేరెంట్స్, తొక్కలో స్థానిక ఎన్నికలు, ఎవడూ కానడు ఆ పోస్టుల్ని… చంద్రబాబు చాదస్తపు వృద్యాప్యపు కూతల్ని పట్టించుకోకండి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions