.
Narendra Guptha …… Just facts : తమిళ నటుడు విజయ్ జోసెఫ్ TVK పార్టీ స్థాపించింది 2024లో.. ఆనాటినుంచి అతను తన ఫ్యాన్ క్లబ్ లని పొలిటికల్ పనులకు వాడుకోవడంలో సఫలమయ్యారు.
వాస్తవానికి తమిళనాడులో విజయ్ జోసెఫ్ కి ఉన్న 85 వేల ఫ్యాన్ క్లబ్ లు.. అతను రజినీకాంత్ మీద పంతంతో చేయించుకున్నవి అని చెప్తుంటారు. పది పన్నెండేళ్ళ క్రితం అనుకుంటా.. విజయ్, రజినీకాంత్ పేరు మీద అధికారికంగా నమోదైన “రజినీకాంత్ అభిమానుల సంఘాల” జాబితాను తెప్పించి చూసారు.
Ads
అవి దాదాపు 65వేలకు పైనే ఉన్నాయి అని తెలిసింది. అది అప్పట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఉన్నట్టు వినికిడి. అది తెలుసుకున్నాక.. తనకు అంతకు మించిన సంఘాలు ఉండాలి అనే పట్టుదలతో.. విజయ్.. 65 వేల పైచిలుకు సంఘాలను రిజిస్టర్ చేయించుకున్నాడు విజయ్.
దానికి సంబంధించిన డబ్బులు అంతా విజయ్ జోసెఫ్ ఏ ఖర్చుపెట్టుకున్నాడు. ఇవాళ్టికీ అవి మొత్తం 85 వేల సంఘాలు అయ్యాయి. ఒక్కో సంఘంలో 25 మంది సభ్యులు ఉన్నారు. వల్లనే విజయ్ బూత్ లెవెల్ కార్యక్రమాలకు వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళతోనే ఓటర్ నమోదు కార్యక్రమాలు, పలు ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాడు.
భారత దేశపు రాజకీయాల్లో సినిమా స్టార్లు రాజకీయ నేతలుగా గెలవడం సులువైన మార్గంగా ఎంచుకుని అటువైపు అడుగులు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. విజయ్ కూడా ఆ కోవకే చెందినవాడు. తమిళ నటులు ఎందరో రాజకీయాలలో ఎదిగారు.. అలాగే తెలుగు హీరో పవన్ కళ్యాణ్ వంటి పరపతి తనకు కూడా ఉంది అని భావిస్తున్న విజయ్.. తను కూడా ఆ స్థాయికి చేరలేక పోతానా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే 2024లో TVK పార్టీ స్థాపించి అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాడు.
విజయ్, సెక్యులర్, ద్రవిడియన్ సిద్ధాంతాలను ప్రోజెక్ట్ చేసుకుంటూ పోతున్నాడు. కానీ అతను గమనించాల్సిన అంశం.. అతని కేడర్. సినిమాలంటే బట్టలు చింపుకునే పిల్లలతో ఓట్ల కోసం కాళ్ళు మొక్కించే ప్రక్రియ అసంభవ చర్య.
ప్రస్తుతం విజయ్ పార్టీకి ఫండింగ్ దండిగా వస్తోంది కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది. కానీ ఎన్నికల సమయంలో తమిళోళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. డబ్బులతో పాటు గౌరవ మర్యాదలు కూడా. విజయ్ ఫ్యాన్స్ ఇంచుమించు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాగా చాలా రాడికల్ ఉంటారు. భాషా ప్రయోగం చాలా ముఖ్యం. ఆ విషయంలో ఏం జరుగుతుందో భవిష్యత్ చెప్తుంది.
రాజకీయంలో పవన్ కళ్యాణ్ ను ఫాలో అంటున్న విజయ్ జోసెఫ్, తన సొంత ఫ్యాన్ క్లబ్ కేడర్ ని నమ్ముకుని వెళ్తే బొక్కబోర్లా పడతాడు. పవన్ లాగా అధికారం, ఎన్నికలు అనుభవం ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే అతను అనుకుంటున్న టార్గెట్ రీచ్ కాగలగుతాడు. లేదంటే.. హైప్ ను చూసి గెలుపు అనుకుంటే దెబ్బతింటాడు. పైగా యాంటీ డీఎంకే వోటు, ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలిపోయి అంతిమంగా స్టాలిన్ కే ఫాయిదా.
బీజేపీ నేత అన్నామలై పొలిటికల్ జర్నీని విజయ్ ఉదాహరణగా తీసుకోవాలి. విజయ్ తో పొత్తు కోసం అటు ప్రతిపక్షం, అధికార పక్షాలు రెండు పాజిటివ్ గానే ఉన్నాయి అనేది ఇన్సైడ్ టాక్. తను ఎలా నిలబెట్టుకుంటాడో అనేది తన తెలివి మీద ఆధార పడి ఉంటుంది.
దక్షిణ భారత దేశంలో ఎంతో మంది సినిమా స్టార్లు పొలిటికల్ గా వెళ్ళి దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. వాటిని పరిశీలించుకుని వెళ్తే విజయ్ పాలిటిక్స్ లో నిలదొక్కుకోగలుతాడు.. Political Laboratory
Share this Article