By….. Jagannadh Goud……………………. ఈజిప్ట్ రాణి…: క్లియోపాత్ర ది గ్రేట్ …… ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర మహా అందగత్తెగానే ప్రపంచానికి పరిచయం. కానీ క్లియోపాత్ర అంటే ఒక ధైర్యం, క్లియోపాత్ర అంటే ఒక సాహసం, అన్నింటికి మించి క్లియోపాత్ర అంటే ఒక ఆత్మ విశ్వాసం. నాకు తెలిసి ఏ చరిత్రకారుడూ ఆమె గురించి నెగటివ్ గా రాయలేదు. కాని కొంతమంది మూర్ఖులు, అజ్ఞానులు ఆమె గురించి నెగటివ్ గా మాట్లాడటం నేను విన్నాను, అబద్ధాలు చాలా ప్రాచూర్యంలో ఉన్నై… నిజానికి ఆమె ఆ రోజుల్లోనే 2 పుస్తకాలు కూడా రాసింది. 1. బాడీ కేర్ గురించి 2. మెడిసినల్ ప్లాంట్స్ & ట్రేడింగ్ గురించి… యూట్యూబ్ లో వ్యూస్ కోసం, TV ల్లో రేటింగ్స్ కోసం ఎందరో పిచ్చోళ్లు రకరకాలుగా మాట్లాడిన వీడియోస్ చూశాను, అదంతా పరమ చెత్త…
ప్రాచీన ఈజిప్షియన్స్ ప్రకృతిని ఆరాధించేవారు. క్లియోపాత్ర “అమానా” అనే సూర్య దేవాలయాలని కట్టించింది. తెలివి, ధైర్యం, సాహసం, నేర్పు, Self Confidence అన్నీ కలగలిపితే ఆమే క్లియోపాత్ర… ఈ భూమి మీద క్లియోపాత్ర పుట్టి ఉండకపోతే ప్రపంచ గమనం వేరే లాగా ఉండేది అని చరిత్రకారులు అంటారు. 100 పేజీల ప్రపంచ చరిత్ర రాస్తే కనీసం ఒక్క పేజీ అయినా క్లియోపాత్ర గురించి ఉండాలి, ఉంటుంది. ఆడవాళ్ళు అంటే అబల అని కొందరు, సబల అని మరికొందరు అంటారు. ఇలాంటి చీడ భావజాలానికి నేను వ్యతిరేకం. వ్యక్తులని నేను రెండు రకాలుగా చూస్తాను. 1. ఆత్మ విశ్వాసం ఉన్నవారు 2. ఆత్మవిశ్వాసం లేనివారు. నా వరకు ఆడవాళ్ళలో అందం అంటే అది వాళ్ళలో ఉండే ఆత్మ విశ్వాసం. ఎందరో మహానుభావులు, అందరిలో క్లియోపాత్ర ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ………
Share this Article
Ads