Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఒక్కటీ తక్కువైంది షెకావత్తూ… అదే ఎమోషనల్ థ్రిల్! వెరసి ట్రబుల్!!

October 2, 2026 by M S R

.

ఇది రాజమౌళి సినిమాయా..? పాపం! జూనియర్, మహేశ్, బాలయ్య ప్రమోషన్లు చేసిన సినిమాయా ఇది..? పాపం! భిన్న పాత్రలతో అలరించే ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగాస్ట్రెయిట్ తొలి తెలుగు సినిమాయా ఇది..? పాపం! ఇందులో ఏముందని అంత గొప్పలు చెప్పారు మహాశయులారా..? సారీ, షెకావత్తు… కోల్పోయావు నీ ధరావత్తు..!!

ఎస్, భీకరమైన నెత్తుటికాండ మాత్రమే హీరోయిజంగా భ్రమించి, థియేటర్లలో రక్తపుటేర్లు పారిస్తున్న పిచ్చియుగంలో ఓ అమ్మాయి, కాస్త ఫాంటసీ, ఇంకాస్త హ్యూమర్ రంగరించి, ఓ భిన్నమైన కథను ప్రజెంట్ చేయాలని అనుకోవడం వరకూ సూపర్… కానీ పాపం, దర్శకుడు యేలేటి శశాంక్ దాన్ని అంతే వైవిధ్యంగా, ఆకట్టుకునేలా ప్రజెంట్ చేయడంలో ఫెయిలై… షెకావత్తుకు ఓ చేదు ఫలితాన్ని సమర్పించాడు…

Ads

అవునూ, డబ్బు పెట్టేముందు కనీసం ఆ స్క్రిప్టు చదివావా రాజమౌళీ..? ప్రివ్యూ చూశావా..? ప్రతి దాంట్లో పర్‌ఫెక్షన్ కోరుకునేవాడివి అంత అడ్డదిడ్డంగా డబ్బులెలా పెట్టావు..? తీసేవాడికి చూసేవాడు లోకువ అనే నమ్మకమేనా..? అంతేకదా… నువ్వు సమర్పిస్తున్నావు కాబట్టి జూనియర్ వస్తాడు, మహేశ్ ప్రమోషన్ చేస్తాడు, వెరసి ప్రేక్షకుల చెవుల్లో పెద్ద పెద్ద రఫ్లీషియా పూలు…

ఈ సినిమాలో చెప్పుకోదగింది దివ్య పాత్ర పోషించిన ఆ అమ్మాయి సారా పాలేకర్ నటన… ముద్దుగా బాగా చేసింది… అఫ్‌కోర్స్, ఫహాద్ ఫాజిల్ గురించి కొత్తగా చెప్పడానికేముంది..? కాకపోతే డైలాగ్ డెలివరీ పలుచోట్ల ఇబ్బందికరంగా వినిపించింది… మిగతావాళ్లు సో సో… రాజమౌళి సినిమా అన్నాక సంగీత దర్శకుడు కీరవాణి, లేకపోతే కొడుకు కాల భైరవే కదా పనిచేసేది… కానీ కాల భైరవుడు అంతగా రంజింపచేయలేదు…

dont trouble the trouble

ఓ అంబులెన్స్ డ్రైవర్ హీరో… మామూలు ఎంట్రీయే… ఏవేవో మోసాలతో నెట్టుకొస్తుంటాడు… ఎవరినో ఇలాగే మోసం చేసి దొరికిపోతాడు… వాళ్లు 25 లక్షలు కట్టాలని ఒత్తిడి పెడతారు… దాంతో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు… ఓ మేజిక్ గరల్‌గా ఆ అమ్మాయే వస్తుంది… తరువాత ఏం జరిగింది..?

ఓ చిన్న పిల్లను మేజిక్ గరల్‌గా పరిచయం చేశాక, ఇక అదే కోణంలో కథాకథనాలు ఆసక్తికరంగా సాగాలి… ప్చ్, అదేమీ లేదు… పేలవంగా, బోరింగుగా సాగిపోతూ ఉంటుంది సినిమా…

ఈ నేపధ్యం అంతా మొదటి నుంచే చాలా రొటీన్‌గా, సాధారణంగా అనిపిస్తుంది… కిడ్నాప్ ట్రాక్, సుబ్బరాజు పాత్ర చుట్టూ తిరిగే పోలీస్ ట్రాక్, ఆ డబ్బుల సంచితో ఫహద్ ఫాజిల్ తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా పాతకాలం నాటివి… చివరకు ఆ అమ్మాయి నిజస్వరూపం ఇదీ అని రివీలయ్యే కీలక సీన్ కూడా పెద్ద ఉత్కంఠను, ఆసక్తిని రేపలేకపోయింది…

నిజానికి ఫహాద్ వంటి నటుడు దొరికినప్పుడు తన నుంచి నటనను పిండుకునే కథ, సీన్లు రాసుకుని ఉండాల్సింది… అలాంటిదేమీ కనిపించదు సినిమాలో… ఫాంటసీ సినిమాగా ఏ ఒక్క బ్లాక్ కూడా వర్కౌట్ కాలేదు, అలాగే ఎమోషనల్ కనెక్షన్ కూడా కుదరలేదు… దర్శకుడు సినిమా ముగింపులో కొన్ని భావోద్వేగాలను పండించడానికి ప్రయత్నించినప్పటికీ, అదీ ఓ సాధారణ తంతులాగే ముగిసిపోతుంది…

ఇలాంటి సినిమాను చూడండని చెప్పిన జూనియర్, మహేశ్, సమర్పించిన రాజమౌళిలను థియేటర్‌లో కూర్చోబెట్టి, బయటికి వెళ్లకుండా మొత్తం సినిమా చూపించడమే సరైన శిక్ష..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ ఒక్కటీ తక్కువైంది షెకావత్తూ… అదే ఎమోషనల్ థ్రిల్! వెరసి ట్రబుల్!!
  • అనుకోని అనుకూలతలు – లేకపోతే మధ్యప్రాచ్యం మండిపోయేది!
  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions