రాబోయే అయిదు తెలుగు సినిమాలు ఇండియన్ సినిమా దశను, దిశను తిప్పేస్తాయ్ సార్… అవి దేవర, పుష్ప-2, కల్కి అని ఓ జాబితాను చదివాడు ఓ మిత్రుడు… వంగా సందీప్, ప్రశాంత్ నీల్, రాజమౌళి, సుకుమార్, మణిరత్నం వంటి మన దర్శకులు బాలీవుడ్ దర్శకులకు కొత్త పాఠాలు నేర్పిస్తున్నారు అని తేల్చిపడేశాడు… ఆ సినిమాలే కాదు…
నిజానికి రాంచరణ్-శంకర్ సినిమా… భారతీయుడు-2.., మహేశ్- రాజమౌళి, ఎన్టీయార్- ప్రశాంత్ నీల్ సినిమాలతోపాటు కాంతార-2 వంటి సినిమాలు కూడా పాన్ ఇండియా మార్కెట్‌పై కన్నేశాయి… పవన్ కల్యాణ్ ఓజి వంటి సినిమాలు కూడా రావల్సి ఉంది… సో, నార్త్‌పై సౌత్ దండయాత్ర ఇంకా భీకరంగానే ఉండబోతోంది… అయితే అన్నింటికీ అరిష్టాలు వెన్నాడుతూనే ఉన్నయ్… డిలే షూటింగ్స్, హీరో అనారోగ్యం వంటివి… ఏమో, అనుకోకుండా కార్తికేయ-2 వంటివీ అండర్ డాగ్స్‌గా వచ్చి జెండా ఎగరేయవచ్చు…
సరే, మన దర్శకులు బాలీవుడ్ దర్శకులకు కొత్త పాఠాలు నేర్పిస్తున్నారు అనేది ఓ అతిశయం… ఒకటీరెండు ఉదాహరణలు చూద్దాం… కాంతార ఫస్టాఫ్, సెకండాఫ్ మొదట్లో ఓ మామూలు సినిమా… సగటు యావరేజీ కన్నడ, తెలుగు సినిమా టైపు… చివరి అరగంటలో కథలో ట్విస్టులు, వాటిని డీల్ చేసిన తీరు మెప్పిస్తుంది… రిషబ్ శెట్టి అదే మ్యాజిక్ మళ్లీ మళ్లీ చేయాలనేమీ లేదు…
Ads
పుష్ప వోకే… బన్నీ ఓ రఫ్ కేరక్టర్ చేసి మెప్పించాడు… రొటీన్ ఇమేజీ బిల్డప్ పాత్రలా గాకుండా ఓ రస్టిక్ లుక్… పాటలు సూపర్ హిట్టయి, కొత్త కథ కూడా కలిసొచ్చి సూపర్ హిట్… హీరోయిన్‌తో వెగటు చేష్టలు వంటివి ఇందులోనూ పంటి కింద రాళ్లు… ఇక వంగా సందీప్ అర్జున్‌రెడ్డి బాపతు ప్రజెంటేషన్ వదిలిపెట్టడం లేదు… వెగటు సీన్లు, దరిద్రపు సంభాషణలు, బీభత్సమైన హీరోయిజం వంటివి చాలామందికి నచ్చవు… సేమ్, కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ కూడా… కేజీఎఫ్ గానీ, ప్రస్తుత సలార్ గానీ… అంతా క్రూడ్ ప్రజెంటేషన్, నెత్తురు, హింస, అరాచకం…
ఆ ఇద్దరు దర్శకులకూ ఆరోగ్యకరమైన కామెడీ, సున్నితమైన రొమాన్స్ సీన్లు తీయడం చేతకాలేదు… ఇలాంటి డార్క్ సినిమాలే ఎప్పుడూ నడుస్తాయనీ అనుకోవడం ఓ భ్రమ… (ప్రశాంత్ తెలుగువాడే అయినా తన మాతృ ఇండస్ట్రీ కన్నడ… నిజానికి తన జన్మస్థలి నీలకంఠాపురం ఏరియా మొత్తం కర్నాటక కల్చరే, ఆ రాష్ట్రంలోకి చొచ్చుకుని పోయినట్టు ఉంటుంది… వాళ్ల సంబంధ బాంధవ్యాలన్నీ బెంగుళూరే…) మణిరత్నం తమిళియన్… తనకు తమిళ కల్చర్ వాసన తప్ప మరేమీ పట్టదు… తన పొన్నియన్ సెల్వన్ తమిళులకు తప్ప ఇంకెవరికీ పట్టలేదు, నచ్చలేదు…
కాకపోతే మణిరత్నం రొమాంటిక్ సీన్లను క్రియేటివ్‌గా, హత్తుకునేలా చిత్రీకరించగలడు… సుకుమార్‌ను, శంకర్‌ను కాసేపు వదిలేస్తే… రాజమౌళి కూడా ఆకట్టుకునేలా సీన్లను చిత్రీకరించడం తెలిసినవాడు… యాక్షన్ సీన్లే కాదు, కాస్త కామెడీ, ఒకింత రొమాన్స్ పండించగలడు, రక్తికట్టించ గలడు… బాహుబలిలో తమన్నా బట్టల్ని ప్రభాస్ చేత నిర్బంధంగా విప్పిస్తూ దాదాపు అత్యాచారం వంటి సీనే అయినా మెప్పించగలిగాడు… నాగ్ అశ్విన్ పాన్ ఇండియా బాపతు సినిమాలేమీ చేయలేదు… కల్కి – ప్రభాస్ అనారోగ్యం సంగతి తేలితే తప్ప ఆ షూటింగ్ స్టార్ట్ కాదు…
సో, మన నిర్మాతలు, మన హీరోలు, మన దర్శకులే తోపులు అని మురిసిపోనక్కర్లేదు… బాలీవుడ్‌కు మాఫియా మకిలి ఉన్నా సరే, అది ఇన్నేళ్లూ ఇండియన్ సినిమాకు చోదకశక్తిగా నిలిచింది… క్రియేటివిటీకి, భారీతనానికి ఢోకా ఏమీ లేదు… హిందీ ప్రాంతాల్లో ఆ సినిమాల రీచే ఎక్కువ… ఇప్పుడు కమర్షియల్ ప్రొటెన్షియల్ మార్కెట్లుగా సౌత్ ఇండియా మార్కెట్లు కనిపిస్తున్నాయి కాబట్టి మన భాషల్లోకి డబ్ చేసి వదులుతున్నారు… మనవాళ్లు చేస్తున్నదీ అదే కదా…!!
Share this Article