.
మొన్న చెప్పుకున్నాం కదా… వాళ్లకు ఏం సాయం చేసినా సరే… పట్టదు… మతమే ముఖ్యం… సాయం తీసుకుంటూనే మతం పేరిట పాకిస్థాన్‌కు సపోర్టు… ఇండియా మీద ద్వేషం… ఇండియా సర్వనాశనం కావాలనే లక్ష్యం…
పిచ్చి గాడిదలు… బంగ్లాదేశ్, టర్కీ, పాకిస్థాన్, అజర్‌బైజాన్ మొత్తం ముస్లింల సంఖ్యకన్నా ఇండియాలో ముస్లిములు ఎక్కువ… ఇండియా నాశనమైతే వాళ్లూ అంతే కదా… మరి తమ మతస్థుల పట్ల ప్రేమ ఏమున్నట్టు..? కామన్ సెన్స్‌కూ ఉగ్రవాదానికీ అందుకే చుక్కెదురు…
Ads
ఎస్, పాకిస్థాన్ ఓ రోగ్ కంట్రీ… అది ప్రపంచానికే వేరు పురుగు… ఇతర ఇస్లామిక్ కంట్రీస్ కూడా పాకిస్థాన్ విషాన్ని తెలిసి దూరం ఉంచుతున్నాయి… కానీ బంగ్లాదేశ్ (వాడికి మనం లేకపోతే ఉనికే లేదు…), తుర్కియో, అజర్‌బైజాన్ తోడయ్యాయి… జస్ట్, మతమే కారణం…
సరే, మన దేశపు అసలు ప్రత్యర్థుల లిస్టులోకి చేరినందుకు అభినందనలు… అయితే ఆమధ్య మాల్దీవుల ప్రభుత్వం కూడా ఇలాగే మతం పేరిట ఇండియా మీద ద్వేషాన్ని, విషాన్ని చిమ్మి, తరువాత మోడీ దెబ్బకు టూరిస్టులు పడిపోయి, ఏడుస్తూ మళ్లీ ఇండియా శరణు జొచ్చాడు… ఐననూ నమ్మరాని విషపురుగు అది…
ఇప్పుడిక టర్కీ, అజర్ బైజాన్‌లకు టూరిస్టులు వెళ్లకూడదనే వైరల్ క్యాంపెయిన్ మొదలైంది… 2022లో 60 వేల మంది టూరిస్టులు వెళ్తే, అజర్ బైజాన్‌కు వెళ్లే టూరిస్టుల సంఖ్య ఇప్పుడు 3 లక్షలు దాటిపోయింది… అర్థమైంది కదా మనపై అది ఎంత ఆధారపడిందో… ఐనా సరే, మతమే ప్రధానం అంటున్నాడు దాని అధ్యక్షుడు…
ఇదే టర్కీ భూకంపానికి గురై విలవిల్లాడుతుంటే మనమే ఫస్ట్ రిలీఫ్ ప్లెయిన్స్ పంపించాం… అది భస్మాసుర కేరక్టర్… తాజాగా పాకిస్థాన్‌కు సాయం చేసినందుకు నిరసనగా వేల కోట్ల యాపిల్స్, గ్రానైట్ పలకల్ని దిగుమతి చేసేకోకూడదని ఇండియన్ మర్చెంట్స్ అసోసియేషన్స్ తీర్మానం చేసుకున్నాయి… గుడ్, దానిపైనే నిలబడి ఉండండి… టూరిస్టులను పంపించే ట్రావెల్ ఏజెన్సీలనూ బ్యాన్ చేయాలి…
ఢిల్లీ నుంచి బాకు నడుమ వారానికి పది డైరెక్ట్ ఫ్లయిట్స్ నడుస్తున్నాయి… టర్కీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా 3.3 లక్షలకు పెరిగింది… వేల కోట్ల రెవిన్యూ మన పర్యాటకుల ద్వారానే వస్తోంది…
కానీ కేవలం టూరిస్టులు వెళ్లకపోతే ప్రతీకాారం సాధ్యమేనా..? కాదు… దెబ్బ తగులుతుంది నిజమే గానీ… ఆ దేశాలతో మనకు వాణిజ్యమూ ఉంది… అదీ పరిగణనలోకి తీసుకోవాలి… అన్నీ వదులుకుంటేనే ‘సర్జికల్ స్ట్రయిక్స్’ సాధ్యం…
ఈ రెండు దేశాలతో మనకు ఏటా 12 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఉంది… ప్రధానంగా క్రూడ్ ఆయిల్… సో, లక్షద్వీప్ బీచులో కుర్చీ వేసుకుని కూర్చుని ఫోటోలు దిగి ప్రచారం చేసుకున్నంత ఈజీ కాదు ఈ దేశాలతో కటీఫ్… స్ట్రాటజీ కావాలి…
పైగా టర్కీతో ఇదే అమెరికాకు డిఫెన్స్ ఒప్పందాలున్నాయి… టర్కీ పాకిస్థాన్ వాడికి అమ్మిన డ్రోన్లనూ అమెరికానూ వేరు చేసి చూడలేం… పైకి ట్రంపు పెద్ద మనిషి… నీతులు చెబుతాడు… ఇక మన సెలబ్రిటీల దగ్గరకు వద్దాం…
మాల్దీవులకు మళ్లీ వెళ్తారు మన సెలబ్రిటీలు, ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు, సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తారు… ఒక్క గాడిదకూ దేశం అక్కర్లేదు… వెళ్లామా..? ఎంజాయ్ చేశామా..? అనేదే ముఖ్యం… ఆమధ్య తెలుగు సినిమా సెలబ్రిటీలు గుంపులుగుంపులుగా ఏదో కార్యక్రమానికి వెళ్లారు… సి.శ లేని బ్యాచులు కదా మనవాళ్లు… ఆమధ్య శ్రీలంకతో మన సంబంధాలు మరీ దెబ్బతిన్నప్పుడు కూడా మన టూరిస్టులు యథాప్రకారం వెళ్లారు,..
రేప్పొద్దున టర్కీ, అజర్‌బైజాన్‌లకు వెళ్లొద్దురా అనే క్యాంపెయిన్ ఇంకా బలంగా నడిచినా సరే, మళ్లీ ఏదో ఓ పాయింట్‌లో బ్రేక్ ఉంటుంది… మళ్లీ మనవాళ్లు క్యూ కడతారు… అసలు దరిద్రం మన టూరిస్టులు, మన సెలబ్రిటీల దగ్గర కదా ఉన్నది… ఆల్రెడీ ఈ ప్రమాదం గమనించి టర్కీ బాబ్బాబూ, రాకుండా ఉండొద్దు, ప్లీజ్ నండి అని ప్రచారం మొదలుపెట్టింది…
పాకిస్థాన్‌కు డ్రోన్లు సప్లయ్ చేసినప్పుడు ఏమైందిరా అని మోడీ అడగడు… ఏ ట్రావెల్ ఏజెన్సీ అయినా సరే టర్కీకి, అజర్‌బైజాన్‌కు టూరిస్టులకు పంపినా తాటతీస్తాం అనే హెచ్చరిక ఇవ్వగలదా ప్రభుత్వం..? యుద్ధం అంటే డ్రోన్లు, క్షిపణులే కాదు… ఆర్థిక యుద్దాలు, ఎస్, పర్యాటక యుద్ధాలు కూడా..!!
Share this Article