Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డ్రాగన్ రాజు కావచ్చు…. కానీ జామపండు రారాజు… ఆరోగ్య చక్రవర్తి…

May 22, 2025 by M S R

.

జామకాయలో ఏముంది సార్..? ఇది డ్రాగన్… హెల్త్ కాన్షియస్ ఉన్నోళ్లకు ఇది బంగారం సార్… ధర కాదు, ఆరోగ్యం ముఖ్యం, అసలు ఈ పండే ఒక ఔషధం అని క్లాస్ పీకాడు పళ్లబ్బాయి… అంత స్పెషలా అనడిగాను…

నిజంగానే డ్రాగన్ ఫ్రూట్ మీద విపరీతమైన హైప్ ఏర్పడింది మార్కెట్‌లో… చివరకు ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్లలో, అంటే పూలుపండ్లు ఫంక్షన్లలో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ పెడితే అదొక లెవల్ అట… ఓ పాపులర్ సామెత ఉంది కదా… రోజుకొక సేపు (యాపిల్) డాక్టర్లకు ఇక సెలవు అని…

Ads

ఇది అంతకన్నా ఎక్కువేనట… కాస్త సెర్చితే, ఇది సర్వరోగ నివారణి, కాదు, అసలు రోగాల్నే రానివ్వదు అన్నంత హైపుతో మీడియాలో వీడియోలు, ఆర్టికల్స్ కనిపించాయి… నిజమేనా..?

కొంత ఆరోగ్యప్రదాయిని అనేది నిజమే, దాని పోషకాల స్థాయిని బట్టి… కానీ మరీ ఆ లెవల్ గొప్ప పండేమీ కాదు… ఎందుకంటే..? ఓ మాట చెప్పుకోవాలి… ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్… అంటే ఇంటి కోడి పప్పుతో సమానం అని…

ఎస్, డ్రాగన్ ఫ్రూట్‌తో పోలిస్తే జామపండు/ జామకాయ చాలా బెటర్… (అఫ్‌కోర్స్, కోడి న్యూట్రిషన్ వాల్యూ కూడా పప్పులో ఉంటుంది)… కాస్త వివరంగా చెప్పుకోవాలంటే…

ధర… ఒక్క డ్రాగన్ ఫ్రూట్ ధరలో కిలో, కిలోన్నర జామపండ్లు గ్యారంటీ…. పచ్చి డ్రాగన్, అంటే కాయగా ఉన్న డ్రాగన్ తినలేం… కానీ జామకాయ ఎంచక్కా తినేయొచ్చు… అదొక రుచి… కాస్త దోరగా ఉంటే చాలు…

డ్రాగన్‌లో కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి కాబట్టి ఎముకలు, దంతాలకు బెటర్, అసలు ఆస్టియోపొరోసిస్ దగ్గరకు రానివ్వదు… బీ విటమిన్ ఎక్కువ కాబట్టి నరాల సంబంధ అంశాలకు బెటర్… విటమిన్ ఏ ఎక్కువ కాబట్టి కళ్లకు భేషైన పండు…

యాంటీ యాక్సిడెంట్స్, ఫాటీ యాసిడ్స్ ఫుల్లు కాబట్టి చర్మం నిగనిగ… హై విటమిన్, న్యూట్రియెంట్స్ కాబట్టి దాని ఆల్కలైన స్వభావంతో మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది, కీళ్లకు భేష్, దెబ్బలు వెంటనే మానుతాయి, వ్యాధుల్ని దరికిరానివ్వదు… హై ఫైబర్ కాబట్టి సులభ జీర్ణం, మెటబాలిజం పెంచుతుంది…

బీపీ తగ్గిస్తుంది, కొలెస్టరాల్ తగ్గుతుంది, సో, గుండెకు మంచిది… వయస్సు మీద పడే లక్షణాల్ని తగ్గించి, యంగ్‌గా ఉంచుతుంది… ఇమ్యూనిటీని పెంచుతుంది, సో, కరోనా వంటి విపత్తుల్లో కాపాడుతుంది… కేన్సర్ రాకుండా కాపాడుతుంది… ఇదీ డ్రాగన్ ఫ్రూట్ మీద ఉన్న ప్రచారాల సారాంశం… ఒక్క ముక్కలో చెప్పాలంటే… ఇది దైవఫలం…

ఔనా..? నిజమేనా..? ఓసారి జామపండుతో పోలుద్దాం, ఏ పోషకం స్థాయి ఏమిటో…
పోషక విలువల సమగ్ర పట్టిక (100 గ్రాములకు)…
పోషకం జామపండు డ్రాగన్ ఫ్రూట్
శక్తి (క్యాలరీలు) 68 kcal 50 kcal
కార్బోహైడ్రేట్లు 14.3 g 11.0 g
చక్కెర (షుగర్) 8.9 g 8.0 g
ఫైబర్ 5.4 g 3.0 g
ప్రోటీన్ 2.6 g 1.1 g
కొవ్వు (Fat) 0.9 g 0.4 g
నీటి శాతం ~80% ~90%


🌿 విటమిన్లు:
విటమిన్ జామపండు డ్రాగన్ ఫ్రూట్
విటమిన్ C 228 mg 20 mg
విటమిన్ A 31 µg 36 µg
ఫోలేట్ (Vit B9) 49 µg 16 µg
నియాసిన్ (B3) 1.1 mg 0.2 mg
పైరిడోక్సిన్ (B6) 0.11 mg 0.04 mg
థయమిన్ (B1) 0.07 mg 0.01 mg


⚙ ఖనిజాలు:
ఖనిజం జామపండు డ్రాగన్ ఫ్రూట్
కాల్షియం 18 mg 9 mg
ఫాస్ఫరస్ 11 mg 24 mg
పొటాషియం 417 mg 300 mg
మాగ్నీషియం 22 mg 10 mg
ఇనుము (Iron) 0.3 mg 1.9 mg
జింక్ 0.2 mg 0.3 mg


ఒక్క ఫాస్పరస్, ఐరన్ మినహా ఏ పోషకం కోణంలో చూసినా సరే, జామపండు కింగ్… కాల్షియం, పొటాషియం మాత్రమే కాదు… పదే పదే ఘనంగా చెప్పబడే విటమిన్ సి డ్రాగన్‌తో పోలిస్తే పది రెట్లు ఎక్కువ… సో.., ధర, లభ్యత, రుచి, పోషకాలు… ఏది చూసుకున్నా ఇది ముర్గీకి బరాబర్… అర్థమైంది కదా…!! ఇండియన్ సరుకు వేరు, చైనా మాల్ వేరు… హహ… ఇదీ అంతే…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ అద్భుత ఆధ్యాత్మిక యాత్ర మళ్లీ ఆరంభం అవుతోంది..!
  • తెలియదు… నంబాల మరణంతో నా మనస్సు ఎందుకు చివుక్కుమంది..!
  • డ్రాగన్ రాజు కావచ్చు…. కానీ జామపండు రారాజు… ఆరోగ్య చక్రవర్తి…
  • వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!
  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?
  • పెను విధ్వంసం సృష్టించగల ఓ భారీ విపత్తు వేగంగా సమీపిస్తోంది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions