Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లాజిక్ ఆలోచిస్తే మ్యాజిక్ కరువు… కానీ గీతదాటితే మెలోడ్రామాతో సినిమా మటాషే…

March 30, 2023 by M S R

ముందుగా ప్రముఖ రచయిత Yandamoori Veerendranath  ఫేస్ బుక్‌ వాల్ పై కనిపించిన చిన్న కంటెంట్ చదవండి… ‘‘”హీరోయిన్ డాక్టర్. దేశ సరిహద్దులో టెంట్. ఎదురుగా గాయాలతో సైనికుడు. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు..! కానీ టెంట్ లో కరెంట్ లేదు…” రచయిత చెబుతొంటే నిర్మాత వింటున్నాడు.

“…ఏమి చేయాలో అర్థం కాక హీరోయిన్ సైనికుడి వైపు నిస్సహాయంగా చూస్తుండగా, అకస్మాత్తుగా వెలుగు వస్తుంది. ఆశ్చర్యపోయి చూస్తే, పక్కనే అసిస్టెంట్ రోష్నీ తన వంటి మీద వస్త్రాలని ఒక్కొక్కటే తీసి అగ్గిపెట్టెతో కాల్చటం కనపడుతుంది. ఆ వెలుగులో ఆపరేషన్ మొదలు పెడుతుంది. రోష్నీ వంటిపై ఆఖరి వస్త్రం ఆఖరి చివర కాలటం పూర్తయ్యేసరికి ఆఖరి కుట్టు వేసిన హీరోయిన్, టార్చ్ లైట్ వేసి, ఒక మూల నగ్నంగా మునగదీసుకొని కూర్చుని ఉన్న రోష్నీని చూసి, ‘ఎంత త్యాగం చేశావు చెల్లీ’ అంటుంది”.
దర్శకుడు తలెత్తి చూసేసరికి నిర్మాత కళ్ళలో నీళ్ళు. 1999లో రిలీజయిన ‘జైహింద్’ అనే ఈ సినిమాని ఆస్కార్ కి కూడా పంపాలని దర్శకుడు మనోజ్ కుమార్ ప్రయత్నించాడు కానీ అవలేదు. “టార్చ్‌లైట్ వెలుతురులోనే ఆపరేషన్ చేయ్యొచ్చు కదా. బట్టలు కాల్చటం ఎందుకు” అని ప్రేక్షకులకి అనుమానం రావటంతో ఈ సినిమా వారం కూడా ఆడలేదు. డ్రామాకీ మెలోడ్రామాకీ వెంట్రుక వాసి తేడా ఉంటుది. మెలోడ్రామా సరిగ్గా పండక పోతే ఫలితం ఇలాగే ఉంటుంది…’’’’

నిజమే… డ్రామా పండితే సినిమా హిట్… ఎదురుతంతే, ప్రేక్షకులకు నచ్చకపోతే థియేటర్లు ఖాళీ… నిర్మాత నెత్తిపై ధవళవస్త్రం… రాఘవేంద్రరావు ఏమంటాడంటే..? ‘‘లాజిక్ కోసం ప్రయత్నిస్తే మ్యాజిక్ దెబ్బతింటుంది’’… అంటే లాజిక్కులు అవసరం లేకపోవడమే సినిమా కథ… హీరో ఒకే దెబ్బ కొడితే ఇరవై మంది రౌడీలు అలా గాల్లోకి లేచి అల్లంత దూరాన పడతారు… ఇక్కడ లాజిక్ ఏం పాడైంది…? అసలు స్టెప్పుల సినిమా డ్యూయెట్లే అతి పెద్ద లాజిక్ రాహిత్యం కదా…

స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ శ్రీరామనవమి ఉత్సవాల్లోని మంగళసూత్రాన్ని తీసుకుని, రాధిక మెడలో కట్టేస్తాడు… మరి ఆ అమాయకుడికి ఆ ఆలోచన ఎలా తట్టింది..? అదే మ్యాజిక్… లాజిక్ ఆలోచించొద్దు… సాగరసంగమం సినిమాలో ఫుల్లు తాగేసి బావి మీద డాన్సాడుతున్న కమలహాసన్ జయప్రద నొసటిపై బొట్టు వర్షపునీటికి కారిపోతుంటే అంత ఉలిక్కిపడి, తాగిందంతా దిగిపోయి, ఆమె బొట్టుకు అరచేయి అడ్డుపెడతాడు ఎందుకు..? అసలు బొట్టు లేని జయప్రదను చూస్తే ఏంటట..? అదే కథలోని మ్యాజిక్… ఆఫ్టరాల్ బొట్టు అనుకుంటే లాజిక్… అది ఉంటే ఆ సినిమా కథే లేదు…

Ads

సో, లాజిక్కుకూ సినిమా కథకూ లింకు ఉండదు, ఉండకూడదు… ఉంటే అది సినిమా కథ అనిపించుకోబడదు… మీరు డ్రామా అనండి, మెలోడ్రామా అనండి… అది ఉండాల్సిందే… లేకపోతే రియల్ లైఫ్‌ కథలకూ రీల్ లైఫ్‌ కథలకూ తేడా ఏముంటుంది..? ఎందుకు చూడాలి..? మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్స్… త్రీ ఇడియెట్స్ సినిమాలో ఏకంగా జనరేటర్ పెట్టి, ఏకంగా వాక్యూమ్ క్లీనర్ పెట్టి మరీ కాన్పు చేస్తాడు హీరో… పోకిరి సినిమాలో అదేదో సీన్‌లో రెండు గ్రూపులు తుపాకులతో కాల్చుకున్నంతసేపు, ఓ గుండు తాకిన కరెంటు బల్బు నుంచి నిప్పు రవ్వలు పడుతూనే ఉంటాయి… మరి ఫైట్ స్పెషల్ ఎఫెక్ట్, పంచ్ కుదరాలంటే ఆ రవ్వలు పడుతూనే ఉండాలి…

అంతెందుకు..? దాదాపు అన్ని సినిమాల్లోనూ కరెంటు షాకుల కామెడీ ఒకేతీరు… ఒకరిని విడిపించబోయి మరొకరు ఊగుతూ ఉంటారు… అదేనట షాక్ అంటే… చూస్తుంటే నవ్వొస్తుంది… అందువల్ల చేత సినిమాల్లో డ్రామాలు, మెలోడ్రామాలు కొన్నిసార్లు పండును… ఇంకొన్నిసార్లు మండిపోవును… అది ప్రేక్షకుడి దయ- నిర్మాత ప్రాప్తం… అంతే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions