2019… గానగంధర్వన్ అనే సినిమా… మళయాళం… కేరళ సూపర్ స్టార్లలో ఒకడైన మమ్ముట్టి హీరో… అందులో కథానాయకుడిని రక్షించడానికి ఓ వకీలమ్మ వస్తుంది… సీన్ కట్ చేస్తే… 2021… దృశ్యం-2 సినిమా… కేరళ మరో సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరో… ఇందులోనూ కథానాయకుడిని రక్షించేందుకు ఓ వకీలమ్మ వస్తుంది… ఆ రెండు పాత్రలనూ పోషించింది శాంతి మాయాదేవి అలియాస్ శాంతిప్రియ… విశేషం ఏమిటంటే..? ఆమె వృత్తిరీత్యా వకీలమ్మే… ప్రాక్టీసింగ్ లాయర్… తను రెగ్యులర్ యాక్టర్ కూడా కాదు… కానీ దృశ్యంలో ఆమెను చూస్తే పార్ట్ టైమ్ యాక్టర్ అనుకోరు… రేణుక అనే పాత్రలో అంత కమాండింగ్‌గా కనిపించింది… సినిమాలో ఆమెదీ ముఖ్యమైన పాత్రే… జార్జికుట్టి పాత్ర పోషించిన మోహన్‌లాల్ పక్కన ఏ బెరుకూ, సంకోచం, తడబాటు ఏమీ లేకుండా నటించేసింది…
ఎర్నాకులం ఆమెది… మొదట లిటరేచర్‌లో డిగ్రీ… తరువాత కేరళ లా అకాడమీ నుంచి లా గ్రాడ్యుయేషన్ చేశాక, సైబర్ లా డిప్లొమా కూడా చేసింది… ఆసియానెట్ టీవీ వాళ్ల అమృత టీవీలో యాంకర్‌గా కూడా చేసింది కొన్నాళ్లు… సోషల్ యాక్టివిస్టు, కాలమిస్టు… తరువాత ఎర్నాకులం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ మొదలెట్టింది… భర్త షిజు రాజశేఖర్, బిడ్డ ఆరాధ్య రేష్మిక పౌర్ణమితో అక్కడే ఉంటుంది… ప్రధానంగా ప్రాక్టీస్ ఎర్నాకులమే అయినా ఈమధ్య కేరళ హైకోర్టులో కూడా కొన్ని కేసుల్లో వాదిస్తోంది… ఈ ప్రొఫెషనల్ లాయర్‌ను తీసుకొచ్చి వరుసగా ఇద్దరు సూపర్ స్టార్ల సినిమాల్లో అదే వకీల్ పాత్రను పోషింపచేయడం విశేషమే… ఆమెకు కూడా కెమెరా కొత్తేమీ కాదు గనుక ఆ రెండు వకీల్ పాత్రల్నీ అలవోకగా చేసేసింది… ఇకపైనా సినిమాల్లో పాత్రలు చేస్తావా అనడిగితే… మంచి పాత్రలు దొరికితే చేస్తాను, కానీ మరీ సినిమాల్లో కూడా లాయర్ వేషాలేనా..? అని నవ్వేసింది సరదాగా ఏదో ఇంటర్వ్యూలో…! అన్నట్టు ఈమె సుప్రీం కోర్టులో శబరిమల కేసు విషయంలోనూ ఇన్వాల్వయింది…
Ads
Share this Article