.
ఆది పినిశెట్టి… రచయిత, దర్శకుడు రవిరాజా పినిశెట్టి కొడుకు… 2006 నుంచే సినిమాలు చేస్తున్నాడు… మన తెలుగు ఫిలిమ్ జర్నలిస్టుల భాషలో చెప్పాలంటే హీరో మెటీరియలే… నందులు, సైమాలు, ఫిలిమ్‌ఫేర్లు కూడా ఉన్నాయి కెరీర్‌లో…
కానీ హీరోగా మాత్రమే కాదు, ఏ సినిమాలో ఎలాంటి ముఖ్యమైన రోల్ వచ్చినా చేస్తూనే ఉన్నాడు… హీరోగా మాత్రమే చేస్తాను అంటే కుదరదు ఈ ఇండస్ట్రీలో… తనను తాను ఎప్పుడూ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు…
Ads
సినిమా హిట్టో ఫట్టో అక్కర్లేదు… తన వరకూ తనకు అప్పగించిన పాత్రను ఎఫెక్టివ్‌గా పర్‌ఫామ్ చేశానా లేదా అన్నట్టు ఉంటాడు… అవును, వర్తమాన అఖండ-2 లో కూడా విలన్ పాత్ర చేశాడు… అఫ్‌కోర్స్, చాలామంది విలన్ల నడుమ తనొక విలన్… ఆ పాత్ర కేరక్టరైజేషన్ బాగాలేక, ఆది కష్టం వృథా అయిపోయింది…
అసలు 2024లో ఒక్క సినిమా లేదు… ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు… ఒకటి అఖండ, రెండోది డ్రైవ్ అనే సినిమా… ఈ సినిమా కూడా థియేటర్లలో రిలీజైనా… పెద్దగా ప్రచారంలోకి రాలేక, మరీ అనామకంగా మిగిలిపోయింది… దానికి తోడు సినిమా కూడా సో సో బాపతు…
ఇదొక థ్రిల్లర్ డ్రామా… అసలు కథే అనాసక్తంగా ఉంటుంది… ఓ మీడియా దిగ్గజం జయదేవ్ (ఆది పినిశెట్టి) ఓ జాతీయ వాద గ్రూపుతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని లండన్ పారిపోవాలని ప్లాన్ చేస్తాడు..? ఓ హ్యాకర్ ఆ ఒప్పందాన్ని బహిర్గతం చేసి, జయదేవ్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తాడు… ఎందుకు..? ఈ పోరాటానికి ముగింపు ఏది..? ఇదీ కథ…
సినిమాలో లోపించింది ఏమిటంటే… ప్రధానంగా కథ, దాని ప్రజెంటేషన్… పేలవమైన మాటలు, సంగీతం ఎట్సెట్రా… ఎక్కడా ఒక్క సీన్ కూడా హై అనిపించేలా లేకుండా దర్శకుడు బాగా కష్టపడ్డాడు పాపం… అఫ్‌కోర్స్, క్లైమాక్సులో సత్యదేవ్ కొంత మెరిసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది… పొరపాటున ఎవడైనా థియేటర్ వెళ్తే ఉసూరుమంటూ బయటికొస్తాడు…
ష్… భయపడకండి, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందట… ఉన్నా లేకపోయినా, ఉండే అవకాశం కోసం కథను అలా ట్విస్ట్ చేసి చివరలో అలా వదిలేస్తుంటారు… ఇది ప్రజెంట్ ట్రెండ్… సినిమా హిట్టయితే సీక్వెల్… లేకపోతే పోయిందేముంది..? నిద్రావస్థ..!! మరీ సినిమా దెబ్బతింటే మరణావస్థ..!
ఈ చిత్రం రివెంజ్ డ్రామాగా తెరకెక్కినా, దానికి కావాల్సిన టెన్షన్ ఎక్కడా కనిపించదు… కథ చాలా రొటీన్‌గా సాగుతూ… హ్యాకర్ అసలు ఉద్దేశ్యం ఏమిటనే విషయాన్ని పూర్తిగా రివీల్ చేయలేకపోతుంది… అతని సామర్థ్యాలను బట్టి, అతను వెంటనే సమస్యను పరిష్కరించగలడు లేదా తీవ్ర నష్టం కలిగించగలడు… అయినప్పటికీ స్క్రిప్ట్ అతన్ని కేవలం రివెంజ్ తీర్చుకునే పాత్రకే పరిమితం చేస్తుంది…
మడోన్నా సెబాస్టియన్ పాత్ర కథనానికి ఏ మాత్రం ఉపయోగపడదు… ఆమె సన్నివేశాలు ఎక్కువగా సీరియస్ సీన్స్‌లో రావడం… తరుచూ ప్రశ్నలను అడుగుతూ ఉంటుంది, అంతే… దీంతో సీరియస్ మూమెంట్స్ కూడా కామెడీగా మారుతాయి… చాలా సన్నివేశాల్లో లాజిక్ లోపిస్తుంది…
రచయిత, దర్శకుడు జనూస్ మహమ్మద్ మజీద్ ఉత్కంఠను పెంచడంలో, వేగాన్ని కొనసాగించడంలో లేదా కథాంశానికి భావోద్వేగాలను తీసుకురావడంలో విఫలమయ్యాడు… రచన అంతటా డెప్త్ లోపిస్తుంది… ఒక్క ముక్కలో చెప్పాలంటే…
ఈమాత్రం కథకు, సినిమాకు ఆది పినిశెట్టి దాకా ఎందుకు.,.? ఆది సాయికుమార్ అయినా వోకే... అంతెందుకు..? చివరకు హైపర్ ఆది అయినా వోకే..!!
Share this Article