Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తమిళం, హిందీల్లో సక్సెస్… తెలుగు డ్రైవర్ బాబు మాత్రం స్లో రైడ్…

August 6, 2025 by M S R

.

Subramanyam Dogiparthi..... అన్నాదమ్ముల అనుబంధం చుట్టూ అల్లబడిన మంచి కుటుంబ కధాచిత్రం ఈ డ్రైవర్ బాబు సినిమా . అన్నాతమ్ముళ్ళ సెంటిమెంటుకి కాస్త క్రైం , ఏక్షన్ , డ్రామాలను కూడా అద్ది నిర్మించబడిన సినిమా .

1986 జనవరిలో సంక్రాంతి ముందు రిలీజయిన ఈ సినిమాకు మాతృక హిందీలో తీయబడిన ఖుద్దార్ . హిందీలో అమితాబ్ , సంజీవ్ కుమార్ , వినోద్ మెహ్రా , పర్వీన్ బాబీ , తనూజ , బిందియా గోస్వామి , ప్రేం చోప్రాలు నటించారు .

Ads

హిందీలో సక్సెస్ అయిన ఈ సినిమాను 1985 లో తమిళంలో కూడా పడిక్కధవదన్ టైటిలుతో తీసారు . తమిళంలో రజనీకాంత్ , శివాజీ గణేశన్ , జయశంకర్ , అంబిక , రమ్యకృష్ణ , ప్రభృతులు నటించారు . తమిళంలో కూడా బాగానే సక్సెస్ అయింది . రజనీకాంతుకు మంచి పేరు కూడా వచ్చింది .

మన తెలుగు సినిమా కూడా చాలా బాగుంటుంది . శోభన్ బాబు , సత్యనారాయణలు చాలా బాగా నటించారు . అయినా హిందీ , తమిళ సినిమాలంత సక్సెస్ కాలేదు .

ఇద్దరు మారు తమ్ముళ్ళని తల్లీతండ్రీ తానే అయి పెంచుతుంటాడు సత్యనారాయణ . పెళ్ళయ్యాక వచ్చిన వదిన ప్రమీల భర్త లేనప్పుడు మరుదులను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది .ఆ ఇద్దరు తమ్ముళ్ళని పి యల్ నారాయణ దగ్గరకు తీస్తాడు . తన స్వంత బిడ్డలతో సమానంగా పెంచుతాడు .

హీరో శోభన్ బాబు నీతినిజాయితీలకు మారు పేరుగా అహర్నిశలు కష్టపడుతూ తమ్ముడు రాజేషుని పెంచి , చదివిస్తూ ఉంటాడు . తమ్ముడు చెడు అలవాట్లకు బానిసయి విలన్ ప్రభాకరరెడ్డి చేతిలోకి జారుతాడు . విలన్ తన అన్న గుమ్మడి ఆస్తి మీద కన్నేసి అతని కూతురు తులసితో పెళ్లి అయ్యేలా మేనేజర్ సుత్తి వీరభద్రరావు సహకారంతో చేస్తాడు . పెళ్ళయ్యాక అల్లుడి చేత చట్టవిరుధ్ధ వ్యాపారాలు చేయిస్తాడు .

మామ గుమ్మడి అల్లుడిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు . వాళ్ళిద్దరి అభిప్రాయ బేధాలను ఆసరాగా తీసుకుని అన్నను హత్య చేసి ఆ నేరాన్ని హీరో శోభన్ బాబు మీదకు నెట్టేస్తాడు ప్రభాకరరెడ్డి . శోభన్ బాబు తన తమ్ముడే అని తెలిసిన జడ్జి సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేసి లాయరుగా తమ్ముడిని రక్షించుకుంటాడు . ఇదీ స్టోరీ .

ఇతర ముఖ్య పాత్రల్లో రాజ్యలక్ష్మి , రాజ్ వర్మ , ప్రభృతులు నటించారు . రెండు మూడేళ్ళ గేప్ తర్వాత ప్రమీల ఈ సినిమాలో సత్యనారాయణ భార్యగా కనిపిస్తుంది . గ్లామర్ స్పేసుని రాధ ఫిల్ చేస్తుంది . గ్లామర్ డాల్ గానే కాకుండా హీరో ప్రేయసిగా వెన్నంటి ఉండి , తోడుగా ధైర్యాన్ని ఇస్తూ నడిపిస్తూ ఉంటుంది . చక్కటి పాత్ర . కరణేషు మంత్రి !

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . అన్నాదమ్ముల పాట చాలా బాగుంటుంది . ముద్దుకు మేము ముగ్గురం ఒద్దికలోన ఒక్కరం పాట చాలా బాగుంటుంది . నున్నగా ఒళ్ళుంది సన్నగా నడుముంది , ముందేపు వెనకేపు అందం , ఓసోసి లఛ్ఛిమి , ఏలోమాను ఎలోమాను ఏస్కో డ్యూయెట్లు బాగుంటాయి .

సలీం నృత్య దర్శకత్వంలో ఏలోమాను పాటలో నృత్యం చక్కగా కంపోజ్ చేయబడింది .
ఈ సినిమాలో వేటూరి వారి పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజతో పాటు బాలసుబ్రమణ్యం కుమార్తె యస్ పి పల్లవి కూడా పాడుతుంది . మరి ఈ సినిమాయే ఆమె అరంగేట్రం సినిమాయో ఏమో నాకు తెలియదు . సత్యానంద్ వ్రాసిన డైలాగ్స్ బాగుంటాయి .

ఈ సినిమాలో హీరో గారి టాక్సీ కూడా ఓ పాత్రధారే . టాక్సీలో ఎవరయినా తప్పుడోళ్ళు ఎక్కితే కదలదు . అలాగే హీరో గారు ఏమయినా పొరపాటు పనులను చేస్తానికి ఉపక్రమించినా కదలదు . కోతులు , కుక్కలు , పొటేళ్ళు , పులులు , సింహాలు హీరోహీరోయిన్లకు స్నేహితులుగా చాలా సినిమాల్లో చూస్తుంటాం . ఈ సినిమాలో అలాంటి పాత్రలో టాక్సీ ఉంటుందన్న మాట . క్రియేటివిటీ !

బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చక్కటి అన్నాదమ్ముల అనుబంధం సినిమా యూట్యూబులో ఉంది . శోభన్ బాబు , సత్యనారాయణ అభిమానులు చూడవచ్చు . డ్రైవర్ బాబు కాకుండా మా మంచి అన్నయ్య అనే టైటిల్ పెట్టి ఉంటే బాగా కేచీగా ఉండేదేమో ! ఏమో ! #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫేక్ జర్నలిస్టులపై మరి ప్రభుత్వ తక్షణ బాధ్యత ఏమీ లేదా..?
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని, నీచెల్లిని… నమ్మండి, తెలుగు పాటే..!!
  • మా ‘భాగ్య’ నగరానికేం తక్కువ..? చినుకు పడితే చాలు వెనిస్ నగరమే..!!
  • తమిళం, హిందీల్లో సక్సెస్… తెలుగు డ్రైవర్ బాబు మాత్రం స్లో రైడ్…
  • ఒక నమ్మకం… ఒక ప్రార్థన… ఒక ఆశ… అవే నడిపించే బలాలు…
  • మోడీషా మెడలే వంచాలనుకుని కేసీయార్ ఆడిన ఓ డ్రామా అది..!!
  • ఏమయ్యా పవన్ కల్యాణుడా… ఓసారి కాస్త సీరియస్‌గా చదువు దీన్ని..!!
  • నటనకు క్లాప్సే కాదు… షూటింగులో అనుకోని షాకింగులు కూడా…
  • జమ్ము కాశ్మీరంపై మరో విధాన నిర్ణయం..? ఢిల్లీలో వరుసభేటీలు..!!
  • కోపం ఆపుకోలేక ఆ జర్నలిస్టును అక్కడే చెప్పు తీసి కొట్టిందట…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions