Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వంగు, పండు, పువ్వు, పాఁయ్ పాఁయ్… ధారాళంగా సినిమా బూతు…

November 4, 2024 by M S R

NTR- రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ డూపర్ హిట్ ఈ డ్రైవర్ రాముడు . రామకృష్ణ సినీ స్టూడియోస్ బేనరుపై 2-2-1979 న 35 సెంటర్లలో రిలీజ్ అయితే 14 సెంటర్లలో వంద రోజులు , 2 సెంటర్లలో సిల్వర్ జూబిలీ ఆడింది .

ఈరోజుకీ కలెక్షన్ల సునామీయే . జుట్టున్న అమ్మ ఏ కొప్పయినా పెట్టుకుంటుంది . కధ ఉంటే మిగిలిన హంగులన్నీ ఏర్పడతాయి . ఏర్పాటు చేసిన వాటికి ఫలం ఉంటుంది . సూపర్ హిట్టయిన ఈ సినిమాకు కూడా కధ ఉంది .

అందుకు తగ్గట్టుగానే చక్రవర్తి సంగీతం , జనాన్ని ఊగించే లిరిక్స్ , జంధ్యాల పదునైన డైలాగులు , రాఘవేంద్రరావు పేటెంట్ డాన్సుల చిత్రీకరణ , వెరశి సినిమా సూపర్ డూపర్ హిట్ .

Ads

ఓ పాటేమో లారీలో , మరో పాటేమో గూడ్స్ రైల్ వేగన్లో . మావిళ్ళ తోపుకాడ పండిస్తే మరుమల్లె తోట కాడ పువ్విస్తే పాట లారీలో . దొంగ దొంగ దొరికింది దొంగల బండి ఎక్కింది పాట వేగన్లో . రెండు పాటలూ వేటూరివే .

ఆత్రేయ వ్రాసిన పాట గుగ్గుగ్గుడిసుంది మమ్మమ్మనసుంది తిరణాళ్ళల్లో , రికార్డు డాన్సుల్లో జనాన్ని గంతులేయించింది . బహుశా ఇప్పుడు కూడా వేయిస్తుందేమో ! జయమాలినితో ధీటుగా NTR కష్టపడ్డారని చెప్పవచ్చు .

ఇలాంటి ఊపు పాట మరొకటి హలంతో ఉంది . ఎందరో ముద్దుగుమ్మలు అందరికీ నా శుభాకాంక్షలు అంటూ సాగే పాట . హలానికి NTR తో ఇదేనేమో మొదటి డాన్స్ ! వేటూరి వారిదే మరో ఊపు పాట వంగమాకు , వంగమాకు , వంగి వంగి దొంగలాగ పాకమాకు . NTR , జయసుధల మీద హుషారుగా ఉంటుంది .

ఈ సినిమాకు ఐకాన్ పాట ఆత్రేయ వ్రాసిన ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును . రాఘవేంద్రరావు చాలా బాగా చిత్రీకరించారు ఈ పాటను . అడవిరాముడు సినిమాలో కృషి ఉంటే మనుషులు రుషులవుతారు పాటలాగా ఉదాత్తంగా , మనసుకు హత్తుకునేలా సాగుతుంది . అన్నాచెల్లెళ్ళ సెంటిమెంటుని డైరెక్టర్ చక్కగా చూపించారు .

ఈ పాటలు కాకుండా సత్యనారాయణ , జయసుధ , మాడాల రికార్డింగ్ డాన్స్ జనానికి చాలా సరదాగా ఉంటుంది . అరెరెరే ఎట్టాగో ఉంటాది ఓలమ్మీ , చిలక కొట్టుడు కొడితే , చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పాటలకు రికార్డింగ్ డాన్సులు సరదాగా ఉంటాయి .

NTR కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . జయసుధ పాత్ర రొటీన్ అల్లరి పిల్ల పాత్ర . సత్యనారాయణ పాత్ర ప్రధానమయినది . బాగా నటించారు . అల్లు రామలింగయ్య , ఛాయాదేవి , మమతల కామెడీ ట్రాక్ కాస్త ముతగ్గా ఉంటుంది . ఇతర పాత్రల్లో రోజారమణి , కాంచన , శ్రీధర్ , మోహన్ బాబు , రావు గోపాలరావు , సారధి ప్రభృతులు నటించారు .

తెలుగులో సూపర్ హిట్టయిన ఈ సినిమా శివాజీ గణేశన్ తో తమిళంలోకి , మిథున్ చక్రవర్తితో హిందీలోకి రీమేక్ అయింది . మన తెలుగు సినిమా యూట్యూబులో లేదు . పాటలు , కొన్ని సీన్స్ మాత్రమే ఉన్నాయి . ఆసక్తి కల NTR అభిమానులు చూడవచ్చు . పాటల వీడియోలు ఉన్నాయి . వాటిని తప్పక చూడవచ్చు . Enjoyable .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)




ఆగండాగండి… దీనికి సరిగ్గా వ్యతిరేక కోణంలో చూస్తే… తెలుగు సినిమాల్లోకి బూతు ధారాళంగా ప్రవహించడం ఎన్టీఆర్- రాఘవేంద్రరావు సినిమాలతోనే… ఆత్రేయను చూసి వేటూరి పోటీపడ్డాడు… వంగమాకు అనే పదం ఏ అర్థంలో ధ్వనిస్తుందో ప్రస్తుతం తెలుగు టీవీ చానెళ్లలో వినిపించే మింగడం, మాదాపూర్ వంటి వెగటు భాష తెలిసిన వాళ్లకు బాగా అర్థమవుతుంది… మరీ ఈటీవీ జబర్దస్త్ ఎట్సెట్రా షోలు, హైపర్ ఆది వంటి కమెడియన్లు ఈ భాషకు పెట్టింది పేరు.., ఇప్పుడిది సోషల్ మీడియా భాష అయిపోయింది కూడా…

డ్రైవర్ రాముడు సినిమాలో కమర్షియల్ వాల్యూస్ పేరిట టీమ్ అందరూ చెలరేగిపోయారు… గుగ్గుగుగ్గు గుడిసుంది… వంగమాకు వంగమాకు, వంగి వంగి దొంగలాగ పాకమాకు… పండిస్తే – పువ్విస్తే… వంటి పదప్రయోగాలన్నీ అవే… మరీ పాఁయ్ పాఁయ్ అంటూ ఎన్టీయార్‌తో వెగటు బాడీ సైన్స్ కూడా చూపిస్తాడు దర్శకుడు… అంతెందుకు, సినిమాలో అల్లు, ఛాయ, మమత కామెడీ ట్రాక్ కూడా మరీ ముతక…

సత్యనారాయణ, జయసుధ, మాడాల రికార్డింగ్ డాన్సులు కూడా ఆ ముతక ధోరణిలో ఉంటాయి ఓ పాటలో… జనం సినిమా చూడాలి అంటే బూతులే మార్గమా..? ఈ పాటలపై అనేకమంది వ్యాసాలు రాశారు… ప్రత్యేకించి మనసుకవి అనిపించుకున్న ఆత్రేయ కూడా బూత్రేయ ఎలా అయ్యాడో కూడా చాలామంది ఎత్తిచూపారు… అన్నట్టు ఈ ఎత్తిచూపడం అనే పదం కూడా బూతుగా మారి, కొన్ని ప్రధానపత్రికల్లో ఆ పదాన్ని నిషేధించారు… సరిగ్గా ఇది డ్రైవర్ రాముడు అనే నాణేనికి మరో కోణం….. ముచ్చట 

అప్పట్లో ముచ్చట ప్రచురించిన భరద్వాజ రంగావఝల పోస్టు లింక్ ఇది… సందర్భం కాబట్టి నెమరువేత…


ఆత్రేయా బూత్రేయా… సెన్సారోళ్ల కత్తెర్లకు పరీక్షలు పెట్టేవారు ఫాఫం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మనసున్న వార్త… ఓ ముసలాయనకు ప్రాణం పోసిన ఓ మనస్విని సేవ…
  • ఎఐసీసీ మంత్రి పదవిని ప్రామిస్ చేస్తే… రేవంత్ రెడ్డిని ఎందుకు అడగడం..!?
  • తెరపైకి మళ్లీ ‘దాసరి చిరంజీవి’… పెద్దన్న పాత్రలోకి రంగప్రవేశం..!!
  • సీఎం సాబ్… తమరు జర్నలిస్టుగా ఉన్న కాలం కాదు… జమానా బదల్ గయా..!!
  • ట్రావెల్ థెరపీ… సరదాగా చెప్పుకున్నా నిజముంది, ఫలముంది…
  • మోడీ దర్శించిన ఆ హిస్టారిక్ టెంపుల్ కథాకమామిషు ఏమిటంటే..!!
  • జయహో టెస్టు మ్యాచ్ సీరీస్… వన్డేలు, టీ20లకు దీటుగా ప్రేక్షకాదరణ…
  • Ramayana… a story for English readers and civil trainees..!!
  • ఢిల్లీలో ఫైట్‌కు రేవంత్ రెడీ..! కుదరదంటున్న బండి సంజయ్..!!
  • ఫేక్ జర్నలిస్టులపై మరి ప్రభుత్వ తక్షణ బాధ్యత ఏమీ లేదా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions