Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆహాకు కూడా పాకిన జబర్దస్త్ మార్క్ పైత్యం… ఈ బాడీ షేమింగ్ ఏమిటర్రా…

January 11, 2024 by M S R

మనకు లేడీ కమెడియన్లే చాలా తక్కువ… అప్పట్లో శ్రీలక్ష్మి… తరువాత ఆ రేంజులో క్లిక్కయిన లేడీ కమెడియన్ రాలేదు… విద్యుల్లేఖ, కోవై సరళ వంటి ఇతర భాషా తారలు వచ్చారు, కానీ వాళ్ల టోన్ అబ్బో… దుస్సహం… ఇంకెవరైనా ఉన్నారో లేదో గానీ ఈమధ్య టీవీ తెర మీద నుంచి వెండి తెరపైకి కూడా వచ్చిన రోహిణి గురించి చెప్పుకోవచ్చు… మంచి టైమింగ్, మంచి ఉచ్చారణ… (బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసినట్టుంది…)

జబర్దస్త్ నుంచి ఎమర్జయిన ఫైమా గురించీ కాస్త చెప్పుకోవాలి, తన డైలాగ్ డెలివరీ, ఎనర్జీ, టైమింగ్ బాగుంటయ్, కానీ బిగ్‌బాస్ నుంచి వచ్చాక టీవీ స్పెషల్స్‌లో తప్ప రెగ్యులర్ జబర్దస్త్ వంటి షోలలో కనిపించడం లేదు… ఇక్కడ ఫైమా, రోహిణి… ఇద్దరూ కామెడీ స్కిట్లలో భీకరమైన బాడీ షేమింగుకు గురవుతున్నవాళ్లే… కానీ అసలే లేడీ కమెడియన్లు, ఎవరికి కోపం వచ్చినా కడుపుకి దెబ్బ… అందుకే భరిస్తున్నారేమో… లేదా తాము అలా ఉండటం వల్లే తమకు ఈ కామెడీ వేషాలు వస్తున్నాయని అనుకుంటున్నారో…

రీసెంటుగా ఆహా ఓటీటీలో డగవుట్ అని ఓ పోగ్రాం వస్తోంది… ఫస్ట్ సీజన్ కూడా అయిపోయినట్టుంది… నవదీప్ హోస్ట్… నవదీప్ అంటేనే కాస్త ప్లేబోయ్ తరహా కదా… పొరపాటున రోహిణి, ఆటో రాంప్రసాద్ గెస్టులుగా వచ్చిన ఓ ఎపిసోడ్ చూడబడ్డాను… రోహిణి టైమింగే కాదు, తన స్పాంటేనిటీ కూడా బాగుంటుంది… కాకపోతే లావైపోయి తెర మీద ఆడ్‌గా కనిపిస్తోంది… అలా ఉంటేనే కామెడీ వేషాలు వస్తున్నాయని ఆమె ఏమైనా అలాగే ఉండాలని అనుకుంటున్నదేమో తెలియదు…

Ads

అదొక పిచ్చి రియాలిటీ షో… ఏదో సుమ అడ్డా తరహాలో, ప్రదీప్ సర్కార్ తరహాలో ఏవో నాలుగు పిచ్చి గేమ్స్ ఆడించి అరగంటో, ముప్పావుగంటో ఎపిసోడ్ చేసేస్తుంటారు… డగవుట్ కూడా అలాంటిదే… ఓచోట రోహిణి అప్పటికప్పుడు అల్లిన డైలాగులు కాస్త హాట్ బాపతే అయినా అంత పెద్ద అశ్లీలంగా ఏమీ అనిపించలేదు, అవన్నీ ద్వంద్వార్థాల మాటలు… ఆటో, బెడ్ ఈ రెంటి మీదా కలిపి మూడు హాట్ డైలాగులు చెప్పాలని నవదీప్ చెప్పిన టాస్క్…

అంతకుముందే మూడు గాసిప్స్ అలవోకగా చెప్పిన ఆమె ఈ టాస్కు కూడా మరింత అలవోకగా చెప్పింది… ఉదాహరణ కూడా నవదీప్ చెప్పాడు ‘హరన్ ప్లీజ్’… ఆమె అదే స్పిరిట్‌తో ‘‘మరీ మీదకు ఎక్కేస్తున్నవ్.., ఏటి, ఇంతేనా స్పీడ్.., ఇంకాస్త ఫాస్ట్ గా వెళ్లూ.., సీట్ సరిగ్గా లేదు…’’ అంటూ ఆటో ప్రయాణానికీ, బెడ్ కార్యానికీ లింకు పెడుతూ డైలాగులు విసిరింది… ఇంకా నయం, సీట్ చిరిగిపోయిందనలేదు అంటూ నవదీప్ మధ్యమధ్య తనూ అందుకుని ‘‘రక్తి కట్టించాడు’’…

ఇదంతా కాదు… ఆ షోయే అలాంటిది… కాస్త వెగటువాసన… లాస్ట్ ఎపిసోడ్‌లో అయితే బిగ్‌బాస్ ఫేమ్, ఆర్జీవీ ఐస్‌క్రీమ్ పాప తేజస్వి అయితే ఇక రెచ్చిపోయింది… మళ్లీ రోహిణి దగ్గరకొద్దాం… ఎపిసోడ్ ఆరంభం నుంచీ, అయిపోయేదాకా రోహిణి సైజు, ఆకారం మీద రాంప్రసాద్ ఏవేవో తలతిక్క విసుర్లు వేస్తూనే ఉన్నాడు… ఒక్కచోట కూడా ఆమె అఫెండ్ కాలేదు… కాకపోతే పలుసార్లు సైలెంటుగా ఉండిపోయింది… ఐనా ఆటో రాంప్రసాద్‌ కూడా మరీ ఇలా మారాడేంటి..? ఆ హైపర్ ఆదితో దోస్తానా చేసీ చేసీ తను కూడా…?

కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ అంటూ ఓ డిఫరెంటు ఫార్మాట్‌తో, దర్శకుడు అనిల్ రావిపూడితో, హోస్ట్‌గా శ్రీముఖిని పెట్టి, ఆరేడుగురు కమెడియన్లలో నీట్ కామెడీని ప్రజెంట్ చేస్తున్న ఆహా ఓటీటీకి ఈ నవదీప్ బాపతు వెకిలి షో అవసరమా..? ఇండియన్ ఐడల్, అన్‌స్టాపబుల్, సర్కార్ వంటి షోలు పాపులరయ్యాయి కదా… టీం కాస్త క్రియేటివిటీని ప్రదర్శిస్తోంది కదా… ఈ డగవుట్లు అవసరమా మనకు అల్లు అరవంద్ భయ్యా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions