భారతీయ ఆలయ నిర్మాణ పరిజ్ఞానం అపూర్వం అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు… వాస్తు, శిల్ప కళలే కాదు, ప్రకృతి విపత్తులను తట్టుకునే పరిజ్ఞానం ఇప్పటికీ అబ్బురమే… ఒక్క ఉదాహరణ చెప్పుకుని మనం అయోధ్య వార్తలోకి వెళ్దాం… వేయి స్తంభాల గుడి పునాదుల్ని సాండ్ బాక్స్ పద్దతిలో నిర్మించిన తీరు ఇంకెక్కడా మనం చూడలేం… ఎన్నో ఆలయాలు ఎన్నెన్నో విశిష్టతలు… వింతలు…
అయోధ్య విషయానికి వస్తే… శ్రీరామనవమి ఉదయమే సూర్యుడి కిరాణాలు ఏకంగా బాలరాముడి నొసటన తిలకమై మెరుస్తాయని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయం కూడా తీసుకున్నారని మనం వార్తల్లో చదివాం… కాకపోతే ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయ్యాక ఆ విశేషం మన కళ్లముందుకొస్తుంది… రాముడు సూర్యవంశ తిలకుడు కదా… అందుకే ఆ తిలకానికి సూర్యకిరణాల ప్రభ అన్నమాట…
తాజా వార్త ఏమిటంటే… CSIR-Central Building Research Institute (CSIR-CBRI) అని రూర్కీలోని సంస్థ… అది అయోధ్య గుడి నిర్మాణాన్ని పలు సాంకేతిక కోణాల్లో సైంటిఫిక్ స్టడీ చేసింది… అందులో తేలిందేమిటయ్యా అంటే… 2500 ఏళ్లకు ఒకసారి వచ్చే భారీ భూకంపం స్థాయిని కూడా అయోధ్య గుడి తట్టుకుంటుందట… అంత దృఢత్వం సంతరించుకున్నదట… ఏ సాధువో, ఏ సంఘీయో చెప్పడం లేదయ్యా… సాంకేతిక విజ్ఙాన సంస్థకు చెందిన సైంటిస్టులు చెబుతున్నారు…
Ads
అనేకరకాల స్టడీస్‌లో geophysical characterisation, geotechnical analysis, foundation design vetting, 3D structural analysis and design, structural safety వంటివెన్నో కోణాలున్నయ్… ఈ సంస్థ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, తరువాత ఆయన వారసుడు గోపాలకృష్ణన్ నేతృత్వంలో Centre of Excellence for Conservation of Heritage Structures విభాగానికి చెందిన సీనియర్ సైంటిస్టులు దేవదత్త ఘోష్, మనోజిత్ సమంత ఈ స్టడీస్ నిర్వహించారు…
దీనికి ఏయే రకాల సాంకేతికాంశాలను పరిగణనలోకి తీసుకున్నారనే డీప్ టెక్నికల్ టరమ్స్‌లోకి పోకుండా మనం చెప్పుకునేది ఏమిటంటే… ఈ దృఢమైన కట్టడం అత్యంత భారీ భూకంపాలను కూడా తట్టుకోగలదు అని..! ఇక్కడ గుర్తు చేసేది మరొకటుంది… ఈ గుడి నిర్మాణంలో అస్సలు ఇనుము వాడలేదు… ఐనా ఈ రేంజ్ దృఢత్వాన్ని ఆ గుడి నిర్మాణంలో సాధించారంటే… హేట్సాఫ్ టు కన్‌స్ట్రక్షన్ డిజైనర్స్… ఎల్అండ్‌టీ సంస్థ కదా కట్టింది… గుడ్…
Share this Article