Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మామిడికాయ పప్పుచారు… యూట్యూబ్ వంటల వీడియోలతో జాగ్రత్త సుమీ…

April 8, 2022 by M S R

ఎంతసేపూ ఆ చెత్తా రాజకీయాలు, నేరాలు, ఘోరాలేనా..? కాస్త ఆత్మారాముడి సంగతీ చూద్దాం… మొన్నొక ఫేస్‌బుక్ దోస్తు బాధపడిపోయాడు… యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చూసి వంటలు చేయడం చాలా కష్టం సుమీ అని…!! కానీ చాలామందికి కాస్తోకూస్తో వంటలు నేర్పిస్తున్నది యూట్యూబే… కాకపోతే సదరు వీడియోల్లో చూస్తూ మక్కికిమక్కీ చేయాలని ప్రయత్నించడంతో వస్తుంది సమస్య… ఓ ప్రధాన సూచన, సలహా ఏమిటంటే… యూట్యూబ్ వీడియోల నుంచి వివిధ పంటల బేసిక్స్ తెలుసుకోవాలే తప్ప యథాతథంగా అనుసరించొద్దు…

ప్రత్యేకించి పెద్ద పెద్ద హోటళ్ల చెఫులు పెట్టే వీడియోల జోలికి అస్సలు వెళ్లకండి… వాళ్లు టీవీల్లో చూపించే వంటకాల జోలికి ఏమాత్రం వెళ్లకండి… ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు… స్టార్ హోటళ్ల చెఫుల్లో ఒక్కరికీ వంట రుచిగా చేయడం రాదు… మరీ టీవీల్లో చూపించినట్టు గనుక చేశారో… వాయిఖ్… అంతేకాదు, ఒక వంటకం వీడియో కావాలంటే, ఒకటే చూస్తే సరిపోదు, కొన్ని వీడియోలు చూసి, అంతిమంగా మన స్టయిల్‌లో చేసుకోవాలి… అదీ పద్ధతి… ఎలాగంటే..?

ఈ వీడియోల్లో ప్రధానలోపం ఏమిటంటే… రకరకాల ఇంగ్రెడియెంట్స్ వేసేసి, కలగూరగంప చేస్తారు… అదీ తప్పు… దీనివల్ల ఒరిజినల్ వంట కుదరదు… ఉదాహరణకు, ఓ పాపులర్ వంటాయన ఉన్నాడు, అదేలెండి చెఫ్… ప్రతి కూరలోనూ కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ఇంగువ, కొత్తిమీర, వీలయితే పుదీనా, మెంతి వేయమంటాడు… అంటే ఏ రుచీ పంటికి తగలదు… ఇంకా నయం, కాస్త పాలకూర, ఇంకాస్త బచ్చలి ఆకు వేయమనలేదు… ఇలా చేస్తే అసలు ఏం వండుతున్నామో మనకే తెలియదు… టూమచ్ పోపు కూడా మంచిది కాదు… అదీ లైట్‌గా ఉండాలి…

Ads

మరొకామె వీడియోల్లో… రకరకాల కూరగాయలు వేసేస్తుంటుంది… టమాట, ఉల్లిపాయ లేని వంటే ఉండదు… ఓ వీడియోలో గుమ్మడి, వంకాయ, మునక్కాడ, సొరకాయ, బీరకాయ ముక్కలు వేసి సాంబార్ చేసింది… అసలు అదేమైనా కాంబినేషనా..? ఒక కూరలో బీన్స్, కేరెట్, ఆలూ, పల్లీ, పచ్చి శెనిగెపప్పు, ఉల్లిపాయలు, పచ్చి బఠానీలు వేసింది… పైగా ధనియాల పొడి, చాట్ మసాలా అదనం… అసలు ఏ రుచి తగులుతుంది నాలుకకు..? నథింగ్… అందుకని చాలా చాలా ఈజీగా, సరళంగా, తక్కువ ఇంగ్రెడియెంట్స్‌తో చేసుకోగల వంటలే ఎన్నుకోవాలి… ఆ విధానమే ఫాలో కావాలి…

దీనివల్ల సమయం, శ్రమ తగ్గుతాయి… ఒరిజినాలిటీ ఉంటుంది… ఉదాహరణకు… మామిడికాయ పప్పుచారు… ఇప్పుడు సీజన్… పుల్లటి మామిడి కాయలు దొరికితే పప్పుచారు చేసుకోగలిగితే… అన్నంలోకి నేరుగా కలిపి జుర్రుకుంటూ… రొట్టెల్ని ముక్కలు చేసి, అందులో వేసుకుని తింటూ… ష్, ఇడ్లీలకు కూడా సూటబుల్… వైనాట్… సంగటిలోకి కూడా…! సరిగ్గా కుదరాలే గానీ దాన్ని మించింది లేదు… వేడి అన్నం ప్లస్ ఈ పప్పుచారు ఉంటే ఇక వేరే ఏమీ అక్కర్లేదు… తొక్కులు, పొడులు, కూరలు, నారలు, చారులు, పెరుగులు ఏమీ లేకపోయినా ఆత్మారాముడికి పండుగ…

అయితే దీనిపై వంద వీడియోలు చూడండి… అన్నింట్లోనూ ఓ కామన్ తప్పు కనిపిస్తుంది… పప్పు, మామిడికాయ ముక్కలు ఉడికించి మాష్ చేయమంటారు… అంటే పప్పు గుత్తితో చిదమడం లేదా మెత్తగా మెదపడం… ఇతర కాయగూరల్ని వేయడం కూడా మరో తప్పు… కాస్త బెల్లం వేయకపోవడం మరో తప్పు… (చాలామంది మామిడికాయల్ని ముక్కలు చేసి, ఎండబెట్టి, ఒరుగులు చేసుకుని, భద్రపరుచుకుని, ఎప్పుడు మామిడికాయ గుర్తొస్తే అప్పుడు ఒరుగులతో వండేస్తారు… సేమ్ టేస్ట్, సేమ్ పులుపు…)

మామిడికాయ రసం వేరు, మామిడికాయ పప్పు కూర వేరు, మామిడికాయ పప్పుచారు వేరు… తేడా ఫస్ట్ తెలుసుకొండి… పప్పుచారు విషయానికొస్తే… చాలా సింపుల్ మెథడ్ ఏమిటంటే… కుక్కర్‌లో కంది పప్పు పోసి మెత్తగా ఉడికించండి… అందులోఏమీ వేయకండి… ఉడికాక మెదపండి… ఈలోపు మామిడికాయ ముక్కల్ని కాస్త పెద్దగానే కట్ చేయండి… వేరే పాత్ర తీసుకుని, టూమచ్ పోపు సామాగ్రి వేయకుండా నూనెలో లైట్‌గా ఆవాలు, జిలకర వేసి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు కాస్త చిదిమి వేయండి చాలు… అందులో తగినన్ని పచ్చి మిర్చి ముక్కలు వేసి, ఈ మెదిపిన పప్పును, మామిడి ముక్కల్ని టెంకతోసహా వేయండి… నీళ్లు పోయండి… తుకపెక ఉడకనివ్వండి…

ఇక స్టవ్వు మీద నుంచి దింపేయడమే అనుకున్న దశలో సరిపడా ఉప్పు వేసుకొండి, (దొడ్డు ఉప్పు, అనగా గళ్ల ఉప్పు బెటర్)… కాస్త బెల్లం ముక్క వేయండి… ఇక ఏమీ వద్దు… వేడి అన్నంలోకి కలుపుకుంటే… మామిడి పులుపు ప్లస్ పప్పు రియల్ టేస్ట్ అనుభవంలోకి వస్తుంది… ఏవేవో వేసేస్తే వంట అటూఇటూ గాకుండా పోతుంది… పప్పుతోపాటు మామిడికాయ ముక్కల్ని మెదపడం కాదు, ముక్కల్ని అలాగే ఉంచండి… తింటుంటే అది పంటి కిందకు రావాలి… లేకపోతే ఆ పప్పుచారు తాలూకు మజా, థ్రిల్ ఏముంటాయి…? అర్థమైంది కదా… వీడియోలు చూడండి, కానీ మీ పద్ధతిలో చేసుకొండి… ఇలా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహో, నువ్వు సినిమా హీరోయిన్‌వా..? నేనెప్పుడూ నిన్ను చూడలేదమ్మా..!!
  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions