పార్టీలకు అనుబంధంగా పనిచేసే సోషల్ మీడియా, మీడియా గ్రూపులు ఇప్పుడు ఓ పెద్ద దందా… వందలు… కాదు, వేల కోట్ల టర్నోవర్… బాగా జీతాలు లభిస్తుండటంతో చాలామంది డిజిటల్, క్రియేటివ్ పర్సన్స్ ఎంటరవుతున్నారు…
సెటైర్లు, మీమ్స్, పోస్టులు, రీల్స్, షార్ట్స్, వీడియోలు, వార్తలు… వాట్ నాట్..? ఇదొక పెద్ద ఉపాధి రంగం అయిపోయింది… అఫ్‌కోర్స్, దూషణలు, వెక్కిరింతలు, బూతులు, మార్ఫింగులు, ఫేక్ వార్తలు సరేసరి… నాణేనికి రెండు మొహాలు కదా…
తాజాగా కేరళ కాంగ్రెస్ విభాగం పోస్ట్ చేసిన ఓ వీడియో బాగా ఇంట్రస్టింగుగా, వైరల్ అవుతోంది… ఇలాంటివి సాక్షి, జగన్ టీమ్స్‌కు ఏమాత్రం చేతకావడం లేదు… కావు కూడా… ఎంతసేపూ చంద్రబాబు అండ్ కో, ఫ్యామిలీ మీద బూతులు తప్ప… అఫ్‌కోర్స్, చంద్రబాబు టీమ్స్ సేమ్ సేమ్…
Ads
https://x.com/INCKerala/status/1846521825791971431?t=rBgLrlPWylmJ0k-uv5405w&s=08
ఎస్, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే… ఫస్ట్ ప్రయారిటీ తన మీద పెట్టబడిన కేసుల నుంచి బయటపడటం… అసలే కోర్టులు తన జోలికి రావనే అత్యంత ధీమాతో ఉండే చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జగన్ ఏకంగా జైలుపాలు చేసి… చిప్పకూడు తిన్నది నేనే కాదు, నువ్వు కూడా అని వికటాట్టహాసం చేశాడు కదా…
బాబు అధికారంలోకి రాగానే మార్గదర్శి కేసులు ఉఫ్… మరి మన ఈనాడు కదా… ఏబీ వెంకటేశ్వరావు మీద కేసులు ఉఫ్… మరి మన వాడు కదా… అసలే తన మీద ఆధారపడి బతుకుతోంది మోడీ ప్రభుత్వం… దాని దుర్గతి ఫాఫం… ఇప్పుడు అదే స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నుంచి ఈడీ చంద్రబాబును వదిలేసింది కదా… తప్పదు కదా… అసలే నితిష్, ఆపై చంద్రబాబు… అవి లేక మోడీ 3.0 సర్కారు లేదు కదా…
బీజేపీలో చేరితేనే కడిగిన స్వాతిముత్యాలు అయిపోతారు అక్రమార్కులు… ఇక ప్రభుత్వమే ఆధారపడే సిట్యుయేషన్ వచ్చాక ఇక చెప్పనక్కర్లేదు కదా… పైగా చంద్రబాబు..!!
ఇదే అదునుగా చంద్రబాబు చక్రాలు తిప్పడం స్టార్ట్ చేశాడు… ఆఫ్టరాల్ ఈడీ… కోర్టులు, గీర్టులు జాన్తానై… చంద్రబాబు ఆదేశించాడు, ఆ మోడీ పాటించాడు… క్లియర్ అండ్ సింపుల్ అండ్ స్ట్రెయిట్… యాంటీ చంద్రబాబు సోషల్ టీమ్స్‌కు చేతకాలేదు… కేరళ కాంగ్రెస్ పట్టుకుంది… పైన చూశారుగా… అలా కడిగేసింది…
ఇక్కడ ఎవరి తప్పు, ఎవరు ఒప్పో చర్చించడం లేదు… ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, మళ్లీ వాళ్లు అధికారంలోకి రాగానే కేసులు ఎత్తేయడం… చిన్నాచితకా దొమ్మీ కేసుల దగ్గర నుంచి మర్డర్, అత్యాచారం కేసుల దాకా ఉపసంహరించుకోవడం… నిజానికి కోర్టులు విత్ డ్రా పిటిషన్లను అంగీకరించాలని ఏమీ లేదు… కాకపోతే ఈ కేసుల్ని కోర్టులు కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు… సందులో సడేమియాలాగా రియల్ కేసులు కూడా ఫసక్..!!
Share this Article