నిన్న ఈడీ దాడుల్లో బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ దొరికిపోయాడు కదా… అరెస్టు కూడా చేశారు… అక్కడక్కడా రణగొణ ధ్వనులు మినహా టీఎంసీ క్యాంపు కిమ్మనడం లేదు… దొరికిన సారు గారు చిన్న నాయకుడేమీ కాదు… ఘటికుడు… మమతకు, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు… అంతెందుకు..? ఒక దశలో అసెంబ్లీలో అతనే ప్రతిపక్ష నేత… టీఎంసీ తరఫున…
ఆల్‌రెడీ తనపై సీబీఐ కేసు ఉంది… దానికి కొనసాగింపే ఈడీ దర్యాప్తు… పక్కాగా సమాచారం తీసుకుని, సదరు పార్థుడు ఎక్కడి నుంచి ఈ లావాదేవీలు ఆపరేట్ చేస్తాడో ఆరాలు తీసి దాడులు చేసింది ఈడీ… ఎక్కడా ఏమీ దొరకలేదు కానీ అర్పిత ముఖర్జీ ఇంట్లో ఏకంగా 20 కోట్ల రూపాయల నగదు దొరికింది… అదంతా ఎక్కడిది..? అసలు ఆమె ఎవరు..?
Ads
సదరు పార్థుడు మెయింటెయిన్ చేసే వాళ్లలో ఆమె ఒకరు… ఆమె గురించిన పూర్తి వివరాలను సంపాదించే పనిలో మీడియా తెగ బిజీ అయిపోయింది… ఆమె ఓ సింగర్, ఓ యాక్టర్, ఓ మోడల్… తమిళ, ఒడియా సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేసేది… మూణ్నాలుగు బెంగాలీ సినిమాల్లోనూ నటించినట్టుంది… చాన్నాళ్లుగా పార్థుడి స్నేహితురాలిగా ప్రసిద్ధి… ఎవరికీ ఏ సందేహాలూ రాకుండా ఆమె ఇంట్లో నుంచే అన్నీ ఆపరేట్ చేస్తుంటాడు సారు గారు…
ఉపాధ్యాయుల నియామకాల కుంభకోణం మీద దర్యాప్తులో భాగమే ఇదంతా… బెంగాల్ ఎలిమెంటరీ స్కూల్ బోర్డు ఇచ్చిన అసైన్‌మెంట్ మేరకు బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ టీచర్ల నియామకం చేసింది… కోట్లకుకోట్ల స్కాం అనే ఆరోపణలు వచ్చాయి… అప్పట్లో ఇదే పార్థుడు గారు విద్యామంత్రిగా ఉన్నాడు… తరువాత మమత ఆయన్ని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా మార్చింది… ఇదీ కథ… అసలు ఆ అర్పిత మాత్రమే కాదు… ఇప్పుడు ఈడీ కన్ను మరో మహిళ మీద పడింది…
ఆమె కూడా సదరు పార్థుడి గారికి దగ్గర, మరీ దగ్గర స్నేహితురాలు అన్నమాట… పేరు మోనాలిసా దాస్… ప్రొఫెసర్ ఆమె… సారు గారి దయ వల్లే జాబ్ సంపాదించిందని చెబుతారు… అసన్‌సోల్ లోని కాజి నజ్రుల్ యూనివర్శిటీలో బెంగాలీ డిపార్ట్‌మెంట్ హెడ్ ఆమె… ఈడీ ఎంక్వయిరీలో ఆమెకు ఓ పెద్ద విలాసవంతమైన భవనం ప్లస్ పది వరకూ ఫ్లాట్లు ఉన్నట్టు తేలింది… ఆమెకు అంత ఆస్తి ఎక్కడిదనే విషయంలో ఈడీ ఎంక్వయిరీ చేస్తోంది… ఆమెను కూడా బుక్ చేయాలని ఈడీ ప్లాన్… సారు గారి స్నేహితురాళ్లు వీళ్లేనా..? జాబితాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తోంది… అదండీ సంగతి…!
Share this Article