Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫ్లాష్… బీఆర్ఎస్ అనుకూల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఈడీ…!?

October 7, 2023 by M S R

రాజకీయాల్లో తమకు పడని వ్యక్తులపై బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగిస్తుందనేది బహిరంగ రహస్యమే కదా… లేదా తమ రాజకీయ ప్రత్యర్థులకు ఉపయోగపడే అధికారులనూ అది వదిలిపెట్టదు… అలా కత్తుల్ని వేలాడదీసి, అవసరాన్ని బట్టి స్టాండ్ మార్చుకుంటూ ఉంటుంది… పంజరంలో చిలుకలు కూడా కేంద్రం ఆదేశించే పలుకులే పలుకుతాయి… అడుగులు వేస్తాయి…

తెలంగాణలో మొన్నమొన్నటిదాకా ఉన్నంతగా ప్రస్తుతం లేకపోయినా ఎంతోకొంత బీజేపీ బలం ఉంది… దాని స్థాయి ఎంత అనేది ఎన్నికలు తేలుస్తాయి… కానీ బీఆర్ఎస్ బీజేపీని కూడా ప్రధాన ప్రత్యర్థిగానే భావిస్తోంది… అంతేకాదు, బీజేపీని ఏదోరకంగా బజారుకీడ్చి బదనాం చేయాలనీ ప్రణాళికలు వేస్తుంది… మరి బీజేపీ ఊరుకోదు కదా… గతంలో కర్నాటక, బెంగాల్, ఢిల్లీ, తమిళనాడుల్లో చేసినట్టే తెలంగాణలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం…

ఈ దిశలో కొందరు నాయకుల్ని టార్గెట్ చేసిన ఉదంతాలూ చూశాం… నిజానికి ఈసారి రాజకీయ నాయకులపై కాదు… తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉండి, బీఆర్ఎస్ చెప్పినట్టల్లా ఆడే ఉన్నతాధికారుల్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది… అయిదుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఈడీని ప్రయోగించే ప్లాన్ బీజేపీ పెద్దల మదిలో ఉందట…

Ads

దీనివల్ల పార్టీకి ఫాయిదా ఏమిటీ అంటారా..? రేప్పొద్దున ఎన్నికల్లో సదరు అధికారులు బీఆర్ఎస్‌కు ఏరకంగానూ ఉపయోగపడకుండా కట్టడి చేయడం… మేం చూస్తూ ఊరుకోం సుమా అనే హెచ్చరికను ఇతర అధికారులకూ పంపించడం కాబోయే దాడుల ఆంతర్యంగా చెబుతున్నారు… ఐతే, ఇది నిజమేనా..? మళ్లీ కేసీయార్‌తో బీజేపీ గోక్కుంటుందా అనేది ప్రశ్న… కానీ విశ్వసనీయ వర్గాలు చెప్పేది ఏమిటంటే…

‘‘పార్టీకి రెవిన్యూపరంగా ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ముఖ్యం… ముంబై ఎలాగోలా చేతికి వచ్చింది… చెన్నై, బెంగుళూరు తమ చేతుల్లో లేవు… ఇప్పట్లో వచ్చే సీన్ లేదు… హైదరాబాద్‌ను ఎలాగైనా ఈసారి చేజారనివ్వొద్దు… ఎన్నిరకాల ఉపాయాలు పన్నయినా సరే ఈసారి తెలంగాణలో జెండా ఎగరవేయాలి… ఈ దిశలో బీఆర్ఎస్‌ను కట్టడి చేయాలి… జరగాలంటే ఆ పార్టీకి సహకరించే బ్యూరోక్రాట్లు, వ్యాపారవర్గాలపై కన్నేయాలి…’’ ఇదేనట ఆలోచన… (హైదరాబాద్ యూటీ అనే ఆలోచనలు కూడా ఈ భావజాలం నుంచే వస్తున్నాయా..?)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొమ్మినేని అరెస్టు… పత్రికాస్వేచ్ఛ మీద ఓ సుదీర్ఘ తటస్థ విశ్లేషణ..!!
  • తెలంగాణ అంటే ఇక తాగుడేనా..? ఇవేం ముద్రలురా భయ్..?!
  • ఎలన్ మస్క్‌‌కు రాయునది ఏమనగా… కాస్త నేను చెప్పేదీ ఓసారి విను…
  • కృతి మహేశ్… లండన్‌లో ఫోరెన్సిక్ సైన్స్ పీజీ… ఇప్పుడు డాన్స్ ఫ్లోరే బతుకు…
  • జయమాలిని కేవలం మసాలా డాన్సర్ కాదు… ఫుల్ లెంగ్త్ రోల్ సుమలతలాగే…
  • ఆడదాని ఒళ్లు ఎఫెక్టివ్‌‌గా అమ్మగలగడమే సినీవ్యాపార సూత్రం..!!
  • ఆ దంపతులు నడిపితేనే.. నాటి రాజకీయ ప్రముఖుల విమానయానం…
  • జైన వెడ్స్ బ్రాహ్మణ… ఒక సంపూర్ణ సంప్రదాయిక పెళ్లి వేడుక…
  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions