Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహిళలు విరగబడిన సినిమా… వాళ్ల కోసమే ప్రత్యేక షోలు కూడా…

December 15, 2024 by M S R

.

మహిళలకు బాగా నచ్చిన సినిమా . ఎంత బాగా అంటే మహిళల కొరకు ప్రత్యేక షోలు కూడా వేసారు . 1980 సంక్రాంతికి రిలీజయిన ఈ ఏడంతస్తుల మేడ సినిమా అక్కినేని- దాసరి కాంబినేషన్లో మొదటి సూపర్ హిట్ సినిమా .

దీనికి ముందు వచ్చిన దేవదాసు మళ్ళీ పుట్టాడు , రావణుడే రాముడయితే గొప్పగా హిట్ కాలేదు . ఈ ఏడంతస్తుల మేడ పది సెంటర్లలో వంద రోజులు ఆడింది . అందులో మా గుంటూరు రంగమహల్ కూడా ఉంది . మా నరసరావుపేటలో ఈశ్వర్ మహల్లో 62 రోజులు ఆడింది . 1980 లో శంకరాభరణం , సర్దార్ పాపారాయుడు సినిమాల తర్వాత కలెక్షన్ల పరంగా మూడో స్థానంలో నిలిచింది .

Ads

హిందీలోకి , తమిళంలోకి రీమేక్ అయింది . హిందీలో జితేంద్ర , రీనారాయ్ , మౌసమీ ఛటర్జీలు నటించారు . తమిళంలో శివాజీ , సుజాత , శ్రీప్రియలు నటించారు . అక్కినేని తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు . జయప్రద ఒక డాన్స్ పాటకు అతిధి పాత్రలో నటించింది .

ఫేమిలీ సెంటిమెంట్ , భార్యాభర్తల అనుబంధం వంటి మనసుకు హత్తుకునే ఎమోషనల్ అంశాలకు చక్రవర్తి సంగీత దర్శకత్వం తోడు కావటంతో సినిమా సూపర్ హిట్టయింది . అక్కినేని డాన్సుల గురించి చెప్పేదేముంది ! కొడుకు పాత్రలో అక్కినేని చాలా హుషారుగా నటించి ఆయన అభిమానులను ఉర్రూతలూగించారు .

ముఖ్యంగా వేటూరి వ్రాసిన ఏడంతస్తుల మేడ ఇదీ పాట సూపర్ డూపర్ హిట్ . ఆ తర్వాత ఆయన వ్రాసిందే చక్కని చుక్కా తప్పాచెక్కా జయప్రద అనే బర్త్ డే పాట అక్కినేని , జయప్రదల మీద చిత్రీకరించబడింది . బాగా హుషారుగా ఉంటుంది .

వేటూరి వ్రాసిందే మరో పాట కొమ్మలోని కోయిలమ్మా కొండమల్లి పూలరెమ్మ చాలా చాలా శ్రావ్యంగా ఉంటుంది . రాజశ్రీ వ్రాసిన పాట అరటి పండు ఒలిచిపెడితే తినలేని చిన్నది , సినారె వ్రాసిన ఓ రంగి ఓ రంగి ఓ రంగి నా రంగి నా రంగి కూడా హిట్టయ్యాయి . రాజశ్రీ వ్రాసిన మరో పాట ఇది మేఘసందేశమో అనురాగ సంకేతమో చాలా శ్రావ్యంగా ఉంటుంది . ఔట్ డోర్ పాటలన్నీ కాశ్మీర్లో షూట్ చేసారు .

సుజాత నటన చాలా బాగుంటుంది . మహిళలకు బాగా నచ్చింది . జయసుధది గ్లామర్ కం తల బిరుసు పాత్ర . వాటికి చిరునామా కదా ఆవిడ ! ఇతర ప్రధాన పాత్రలలో జగ్గయ్య , ప్రభాకరరెడ్డి , ఝాన్సీ , కె వి చలం ప్రభృతులు నటించారు . తక్కువ మంది నటీనటులతో తీయబడిన డ్రామా సినిమా . దాసరి సినిమాల్లో డ్రామా ఎక్కువగా ఉంటుంది కదా !

సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు , అక్కినేని జయసుధ అభిమానులు తప్పక చూడతగ్గ సినిమా . కధ , స్క్రీన్ ప్లే , డైలాగులు , దర్శకత్వం అన్నీ మల్టీ టాస్కర్ దాసరే . A watchable musical , entertaining , sentimental and emotional movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • S I R – ఇప్పటికిదే అతి పెద్ద దరిద్రపు, హానికరపు అధికారిక ప్రోగ్రామ్ !!
  • ఇదీ ఓ ‘పడమటి సంధ్యారాగం’… కాకపోతే కథ పూర్తిగా డిఫరెంట్ !!
  • దమ్మున్న జర్నలిస్టు – ప్రకంపనలు – అసలు ఎవరు ఈ రితికా చోప్రా !?
  • ప్రేక్షకుడి సహనంపై ‘సవారీ… మసాలాలు ఎక్కువై రుచి కుదరని ‘బిర్యానీ’…
  • జేడీ చక్రవర్తి ఎవరికీ అర్థం కాడు – అర్థమైతే ఆ దోస్తీ వదలలేం…
  • దిక్కుమాలిన సంత – యాణ్నుంచి పట్టుకొచ్చార్రా వీళ్లను ?
  • ఆ సంధ్య థియేటరే దేనికి..? సొంత హైటెక్ థియేటర్లు ఉన్నాయిగా..!!
  • నాని పైత్యం ! పెంటపెంట… జవహర్‌నగర్ డంపింగ్ యార్డు దుర్వాసన !!
  • ఒవైసీ చెప్పిన ఈ పేరు వెనుక ఓ చరిత్ర’… అసలెవరు ఈ ‘మౌల్వీ?
  • బిడ్డ బాలీవుడ్ స్టార్ ! తల్లి ఓ తమిళపల్లెవాసి ! ఇదీ అసలు సౌందర్యం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions