Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి ఎన్టీయార్‌నే నిస్సహాయుడిగా చూపిస్తే జనం మెచ్చుతారా..?!

September 21, 2024 by M S R

అడవిరాముడు సినిమాకు ఎదురీది వంద రోజులు అడిన సినిమా 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమా . హిందీలో , బెంగాలీలో ఒకేసారి విడుదల అయిన అమానుష్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . ఈ రెండింటిలోనూ ఉత్తమ కుమార్ , షర్మిలా టాగోర్ హీరో హీరోయిన్లు . 1978 లో తమిళంలో త్యాగం అనే టైటిల్ తో శివాజీ గణేశన్ , లక్ష్మిలతో వచ్చింది . అదే సంవత్సరంలో మళయాళంలో ఇత ఒరు మనుషన్ టైటిల్ తో మధు , షీలాలతో వచ్చింది . అన్ని భాషల్లోనూ కమర్షియల్ గా కూడా సక్సెస్ అయిన మంచి సినిమా . ఇదే టైటిల్ తో 1963 లో కాంతారావు , కృష్ణకుమారి హీరో హీరోయిన్లుగా ఓ సినిమా వచ్చింది . వేర్వేరు కధలు .

సినిమా ఎక్కువ భాగం గోదావరి లంక గ్రామాల ప్రాంతంలో తీసారు . NTR , వాణిశ్రీ , జయసుధ , సత్యనారాయణ , జగ్గయ్య , కాంతారావు , ముక్కామల , బాలకృష్ణ ప్రభృతులు నటించారు . వి మధుసూదనరావు దర్శకులు .

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు చాలా బాగుంటాయి . హిట్టయ్యాయి కూడా . శ్రీశ్రీ వ్రాసిన ఎదురీతకు అంతం లేదా పాట చాలా చాలా శ్రావ్యంగా ఉంటుంది . వేటూరి వ్రాసిన ఒకసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంత బుగ్గ డ్యూయెట్ చాలా బాగుంటుంది . జయసుధ వేసే బాలరాజు బంగారు సామీ పాటతో వేసే గ్రూప్ డాన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది . ఈ పాటను కొసరాజు వ్రాసారు . యస్ జానకి పాడింది . కధానాయకుడు సినిమాలో జయలలిత డాన్స్ ఏమయ్యా రామయ్యా గుర్తుకు వస్తుంది . జయసుధ చాలా చలాకీగా నటించింది . జయసుధకు గుర్తింపు తెచ్చిన పాత్ర .

Ads

టైటిల్సుతో వచ్చే వేటూరి వ్రాసిన గోదావరి వరదల్లో రాదారి పడవల్లె పాట శ్రావ్యంగా ఉంటుంది . NTR మీద మరో పాట తాగితే ఉయ్యాలా ఊగితే జంపాలా కూడా బాగుంటుంది .

ఈ సినిమాలో NTR పాత్రను మలచటంలో దర్శకుడు గందరగోళంలో ఉన్నాడేమో అని అనిపిస్తుంది . జమీందారు కొడుకు మొరటోడిగా కాసేపు , హుందాగా కాసేపు మాట్లాడతాడు . తాగనప్పుడు కూడా ఈ తేడా కనిపిస్తుంది . ఆ పాత్రను మలచటంలో ఉన్న inconsistency తో సంబంధం లేకుండా NTR బాగా నటించారు . ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే . వాణిశ్రీని చాలా అందంగా చూపారు .

నటనపరంగా ఆమెకూ కొట్టిన పిండే . అతి ఆత్మాభిమానం , టెక్కు , వగైరాల పాత్ర . సత్యనారాయణ తన నటనా ప్రభంజనాన్ని కొనసాగించారు . ఈ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్ర పోలీసు ఆఫీసర్ జగ్గయ్యది . సహాయ పాత్రలో ఆయన్ని మించినవారు ఎవరున్నారు ! చక్కగా నటించారు .

పాతాళభైరవి నేస్తం అంజిగాడు ఈ సినిమాలో NTR కి నేస్తంగా నటించారు . అతనితో పాటు సారధి . ప్రేక్షకులకు NTR అంటే సూపర్ హీరో . ఆ హీరోని మరీ నిస్సహాయుడిగా చూపితే జనానికి ఒప్పదు . ఈ సినిమాలో ఆయన పాత్ర కాస్త అలాగే ఉంటుంది . బహుశా ఈ సినిమా బాగా ఆడకపోవటానికి అది కూడా కారణమయి ఉండవచ్చు . పైగా NTR మార్కు మారువేషాలు లేని సినిమా కూడా .

అయినను చూడవచ్చు ఈ సినిమాను . యూట్యూబులో ఉంది . తరచూ టివి చానళ్ళలో వస్తూ ఉంటుంది . ఈమధ్యనే ఏదో చానల్లో చూసా . వాణిశ్రీ , NTR , జయసుధ అభిమానులు తప్పక చూడతగ్గ feel good movie . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . సినిమా చూసేందుకు టైం లేకపోతే పాటల వీడియోలను చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వేలాది అమాయక సిక్కుల ఊచకోత – ఆ దుర్జనుడు మరణించెను !
  • కంగనా – రాందేవ్ !… యవ్వనాలు, బెడ్‌రూంల దాకా లొల్లి !!
  • అనుబంధాల పలకరింపు కోసం ఓ ముసలి మనసు తన్లాట… అంతే…
  • తప్పు పైలట్లలో లేదు – బోయింగ్ విమానాల్లోనే లోపాలు- ప్రమాదాలు !!
  • ఆర్మీ జవాన్లు జెన్-జీ కాదా? ఈ పిల్లది మరీ ముదురు పైత్యం !!
  • అమిత్ షా కూర్చునే భంగిమ ! ఇలా చాలా ఈక్వేషన్లను పట్టిస్తుంది…!!
  • తెలంగాణ కాంగ్రెస్‌లో హరా‘కిరికిరి’ బ్యాచ్ ! సోయి లేని హైకమాండ్ !!
  • చిన్న అల్లుడు… ఇతరుల దర్శకత్వంలోనూ దాసరి నటించెను !
  • 4 వేల కోట్లు కాదు – 8 లక్షలు- 50 దేశాలు- మన తొలి పాన్ వరల్డ్ జెండా !!
  • భారం- ప్రేక్షకుడు ఇంకా దూరం- కూర్చున్న కొమ్మ నరుక్కునే టాలీవుడ్ !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions