ఈనాడులో ఒక చిన్న వార్త కనిపించింది… పెద్ద పత్రికల్లో పెద్ద పెద్ద వార్తల్లో ఏమీ ఉండదు, చాటంత కథనాలేమో బయాస్డ్… పత్రిక ఉద్దేశాలు, విధేయతలు, అవసరాలకు అనుగుణంగా వండబడుతూ ఉంటాయి… కానీ చిన్న చిన్న వార్తల్లో కొన్ని ఆసక్తికరంగా కనిపిస్తయ్, కనెక్టవుతయ్… మెయిన్ పేజీల్లో వచ్చే క్రైం స్టోరీస్, ఇతర ప్రాంతాల న్యూస్, హ్యూమన్ ఇంట్రస్టింగ్ ఎట్సెట్రా… కాకపోతే సింగిల్ కాలమ్‌లో కొట్టేస్తుంటారు… ఇస్తినమ్మ వాయినం తరహాలో…
ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ కూడా చాలా చిన్నది… చాలా చిన్న ఫోటో… సేమ్, సింగిల్ కాలమ్… వావ్, ఇంట్రస్టింగుగా ఉందీ చదవడం మొదలుపెట్టి, అది ముగిసేలోపే మళ్లీ ప్చ్ అనే నిరాశ… అంతటి ఈనాడులో ప్రమాణాల పతనం అనుకున్నదానికన్నా వేగంగా ఉందనిపించింది… నిజానికి ఇక్కడ రిపోర్టర్‌ది తప్పు కాదు, తనకు వైజ్ఞానిక విషయాలన్నీ తెలియాలని లేదు… కానీ డెస్కుల్లో ఉన్న సబ్ ఎడిటర్లకు శిక్షణ ఉంటుంది… అవసరమైతే నిజానిజాల నిర్ధారణకు, అదనపు సమాచారానికి అందుబాటులో నెట్ సౌకర్యం ఉంది ఇప్పుడు… గూగులమ్మ సాయమూ ఉంది…
Ads
మరీ అంత అవసరమైతే కృత్రిమ మేధ ప్లాట్‌ఫారాలు కూడా వచ్చాయి కదా… ఇంతకీ వార్త ఏమిటంటే..? ‘‘హార్స్‌లీ హిల్స్‌లో ఓ అరుదైన రాయిని గుర్తించారు… మామూలుగా మనం నీటిప్రవాహం వల్ల కోతకు గురైన రాళ్లను చూస్తాం, కానీ ఇది గాలి కోతకు గురైన రాయి, సముద్ర మట్టానికి 4312 అడుగుల ఎత్తులో ఉంది… గాలిబండ అనే పెద్ద రాతి గుట్ట ఉంది.. దీనిపై ఓ బండరాయి ఆకృతిలో మార్పులు చూసిన ఓ అధ్యాపకుడు దాన్ని పరిశీలించాడు… ఎత్తయిన ప్రాంతం కావడంతో వేగంగా వీచే గాలి వల్లే కోతకు గురైందని గుర్తించాడు…
ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయాడు… వీఎస్ఆర్ విండ్ వేవ్ హోటల్ యజమాని సుధాకర్‌రెడ్డి సొంత ఖర్చుతో బండరాయి చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేశాడు… మదనపల్లి ఆర్డీవో, డీఎస్పీలు కూడా వచ్చి పరిశీలించారు… త్వరలో వాళ్లు దీన్ని ఆవిష్కరించనున్నారు…’’
……… ఇదండీ వార్త… వెదరింగ్ అనే నేచర్‌కు సంబంధించిన నేచురల్ ప్రాసెస్… అంటే తెలుగులో ఏమనాలో తెలియదు కానీ… ఎంత పెద్ద రాళ్లు గానీ, కొండలు గానీ వెదరింగ్‌కు గురవుతాయి, ఆకృతుల్లో కూడా మార్పులు వస్తాయి… ప్రకృతి సహజం… సో, నీటి కోతకు బదులు గాలి కోతకు ఇలా కావడం పెద్ద విశేషమూ కాదు, వింతా కాదు… వోకే, విశేషమే అనుకుందాం…
సదరు విండ్ వేవ్ హోటలాయన దీనికి రక్షణ కంచె ఎందుకు పెట్టించినట్టు..? గాలి కోతను ఆపడానికా..? లేక దాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారా..? రక్షణ కంచె అంటే ఏమీ లేదు… చుట్టూ కొన్ని చిన్న చిన్న ఇనుప రాడ్స్ పాతించి, చెయిన్లతో లింక్ చేయడం… అంతే… పైగా సదరు ఆర్డీవో, డీఎస్పీలు దీన్ని ఆవిష్కరిస్తారట… దేనికి..? ఏమని..? అసాధారణ వింత, విశేషం అంటూ దాన్నొక మాన్యుమెంట్‌లా ఆవిష్కరిస్తారా..? సో, రిపోర్టర్, సబ్‌ఎడిటర్‌తోపాటు ఆ ఆర్డీవో, ఆ డీఎస్పీ, ఆ హోటల్ ఓనర్… అందరూ ధన్యజీవులయ్యా…!!!
Share this Article