.
ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు… తన దోస్తుల పేర్లతో పార్టీ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించాడు… పార్టీ పేరు బహుజన జనతా సమితి… బీజేఎస్… అన్ని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కనిపించాయి…
సరే, మొన్నటిదాకా మీడియా కల్వకుంట్ల కవితతో కూడా పార్టీ పెట్టించింది, పేర్లు కూడా తనే పెట్టింది… రాజాసింగ్‌ను బీజేపీ వదిలేసింది కదా, తను ఇక తెలంగాణ శివసేన పగ్గాలు చేపడతాడనీ, లేదా మహారాష్ట్రకే వెళ్లి అక్కడ శివసేన నుంచి పోటీచేస్తాడని కూడా రాసేసింది మీడియా…
Ads
షిండే శివసేనకూ బీజేపీకి పొత్తు కాబట్టి, తను ఠాక్రే శివసేనకే వెళ్తాడని కూడా స్పష్టీకరణలు… ఇప్పుడిక కొన్ని రోజులు ఈటల పార్టీపైనా, పార్టీ పేరుపైనా వార్తలు వస్తాయి… ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండ్‌లో వాటిని జనం చదువుతారు కూడా…
నిజానికి ఓ కొత్త పార్టీ ఫ్లోట్ చేయడం, నిలబెట్టడం ఈరోజుల్లో చాలా చాలా కష్టం… ఒక దశలో అంతటి కేసీయారే తన టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని అనుకున్న సంగతి తెలుసు కదా… కాకపోతే ఇప్పుడు కేసీయార్ సాధనసంపత్తి కోణంలో పార్టీ బలంగా రన్ అవుతుంది, డౌట్ లేదు…
ఈటల విషయానికి వస్తే… నిన్న బండి సంజయ్‌ను ఉద్దేశించి తనంతటతానే మాటలదాడికి దిగలేదు, బండి వ్యాఖ్యలకు, తన పట్ల కనబరుస్తున్న వ్యతిరేకతకు ఎదురుదాడి అది… బహుశా పైవాళ్లకు ఓ మాట చెప్పాకే రియాక్ట్ అయి ఉంటాడు… అందుకే హైకమాండ్‌కు వివరాలన్నీ చేరుతున్నాయనే ఓ మాటన్నాడు…
వర్గాల పోరు పార్టీకే చేటు కాబట్టి… ఎక్కడో ఓచోట హైకమాండే ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందనీ, పార్టీకి ఈటల చేసిన నష్టం, ద్రోహం ఏమీ లేదు కాబట్టి తనను వదులుకోదని ఒక అంచనా… తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ఢిల్లీకి, నాగపూర్‌కు కొన్నాళ్లుగా పట్టు లేదు, పట్టింపూ లేదు… సో, సయోధ్య ప్రయత్నాలు ఎప్పుడు అనే ప్రశ్నకు ఇప్పుడప్పుడే ఎవరూ జవాబు కూడా చెప్పలేరు…
అవునూ, ఇంతకీ నిజంగానే సొంత పార్టీ పెడితే… తెలంగాణ వ్యాప్తంగా తను ప్రభావం చూపించగలడా, లేకపోతే సొంత పార్టీ వల్ల ఉపయోగం ఏమిటి అనే చర్చల్ని కూడా కాసేపు పక్కన పెడితే… తనకు పార్టీ పేరులో తెలంగాణ అనే పదం ఉండటం తప్పనిసరి… దాన్ని కత్తిరించుకుని బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించిన సంగతి తెలిసిందే కదా…
ప్రస్తుతం రాష్ట్రంలో కులగణన, 42 శాతం రిజర్వేషన్లు వంటి పరిణామాలతో బీసీ వాయిస్ బలంగా ఉంది… సో, తెలంగాణ ప్లస్ బహుజన అనే పదాలు రావాలని అనుకుంటే ఈటల తన పార్టీకి తెలంగాణ బహుజన సమితి అని పెట్టుకోవడమే బెటర్ అని ఆల్రెడీ సోషల్ మీడియాలో సూచనలు కూడా ఇస్తోంది… శుభం…
Share this Article