ఎలెక్టరల్ బాండ్స్ ! పార్ట్ -1
కొండని తవ్వి ఎలుకను పట్టిన వైనం!
గతం నుంచి వర్తమానంలోకి వద్దాం!
మోహన్ దాస్ కరంచంద్ గాంధీతో మొదలయ్యింది రాజకీయ పార్టీకి పారిశ్రామిక వేత్తల విరాళాలు ఇవ్వడం!
ఘనశ్యామ్ దాస్ బిర్లా (GD Birla) గాంధీకి ఆర్థికంగా సహాయం చేశాడు.
గాంధీ 1909 లో వ్రాసిన ‘ The Indian Opinion ‘ అనే పుస్తకంలో తనకి ఉదారంగా విరాళం ఇచ్చిన రతన్ జీ జెంషెడ్ జీ గురించి ప్రస్తావించారు.
రతన్జీ జంషెడ్ జీ తనకి 25,000 విరాళంగా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు గాంధీ!
1947 తరువాత గాంధీ ఢిల్లీలోని తీస్ హజారీ రోడ్ లో ఉన్న బిర్లా హౌస్ లో ఉన్నారు.
సరోజినీ నాయుడు: గాంధీని పేదవాడుగా, నిరాడంబరుడుగా చూపడానికి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ!
గాంధీ 3rd క్లాస్ లో ప్రయాణించేవాడు కానీ దాని కోసం మొత్తం ట్రైన్ ను బుక్ చేసేది కాంగ్రెస్ పార్టీ. ఆహారం కోసం ఏదో ఒక స్టేషన్ లో ఆపేసీ గాంధీతో పాటు అతని అనుచరులకు కూడా భోజనం పెట్టేది కాంగ్రెస్ పార్టీ!
********
1947 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బిర్లాలు, బజాజ్ లు విరాళాలు ఇచ్చారు.
ఫలితంగా హిందుస్థాన్ మోటార్స్ కి చెందిన అంబాసిడర్ కార్లు ప్రభుత్వ అధికార వాహనాలు అయ్యాయి.
2014లో ఫ్రెంచ్ ఆటో దిగ్గజం peugeot కొనే వరకూ అది బిర్లాల చేతిలోనే ఉంది.
1982 లో మారుతీ సుజుకీ మన దేశంలో అడుగుపెట్టినా అంబాసిడర్ కారు ఆధిపత్యం కొనసాగింది.
ఇక Bajaj అయితే 1985 వరకూ స్కూటర్లు, ఆటో రిక్షా మార్కెట్ ను ఏకఛత్రాధిత్యంగా ఏలింది కాంగ్రెస్ పార్టీ అండతోనే కాదా?
జమన్ లాల్ బజాజ్ గాంధీతో ఉద్యమంలో పాల్గొన్నారు అని స్కూటర్లు, ఆటో రిక్షాల రంగంలో వేరే ఎవరికీ అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ!
లైసెన్స్ రాజ్ కాలంలో వేరే ఎవరికీ స్కూటర్లు, ఆటో రిక్షాలు తయారు చేయడానికీ వీలు లేకుండా జమన లాల్ బజాజ్ నెహ్రూ, గాంధిల దగ్గర లాబీయింగ్ చేశాడు.
ఆటో రిక్షా కొని నడపాలి అంటే కాంగ్రెస్ MLA రికమెండేషన్ ఉంటే బజాజ్ ఆటో దొరుకుతుంది, మళ్లీ కాంగ్రెస్ అనుబంధ యూనియన్ INTUC లో సభ్యత్యం తీసుకోవాలి సదరు ఆటో డ్రైవర్.
ఇక బజాజ్ స్కూటర్ అయితే బుక్ చేసుకోవాలి, అదీ 6 నెలల్లో లేదా సంవత్సరం పట్టేది డెలివరీ ఇవ్వడానికి. అదే కాంగ్రెస్ ఎంపీ సిఫారసు ఉంటే నెలరోజుల లోపే డెలివరీ ఉండేది!
బజాజ్ స్కూటర్ కొనాలి అంటే డాలర్ల రూపంలో చెల్లిస్తే వెంటనే డెలివరీ ఉండేది! అందుకే ఎవరన్నా అమెరికా నుండి వచ్చిన వాళ్ల దగ్గర డాలర్ల కోసం దేబిరించే వాళ్ళు బజాజ్ స్కూటర్లు కొనడానికి.
డిమాండ్ ఉన్నా (వేరే దారి లేదు) ఎందుకు ఉత్పత్తి పెంచకుండా కృత్రిమ కొరత సృష్టించారు?
అవి కొనాలి అంటే కాంగ్రెస్ పార్టీ MLA, MP లని ఆశ్రయించాలి!
Ads
సినిమా రంగం – ముడి ఫిల్మ్!
చాలామందికి ఈ విషయం గురించి తెలియకపోవచ్చు!
అప్పట్లో సినీ నెగిటివ్ ఫిల్మ్ కొనాలి అంటే సవా లక్ష అనుమతులు కావాలి.
సదరు నిర్మాత స్క్రిప్టులో కాంగ్రెస్ వ్యతిరేక అంశాలు లేవని హామీ ఇవ్వాలి, అప్పుడే ముడి ఫిల్మ్ దొరుకుతుంది.
మరీ షార్టేజ్ ఉంటే కాంగ్రెస్ MP సిఫారసు చేస్తే ముడి ఫిల్మ్ దొరికేది, అదీ కండిషన్స్ తో మాత్రమే!
కండిషన్ ఏమిటంటే సినిమాలో గాంధీ, నెహ్రూ ల ప్రస్తావన ఉండాలి.
అందుకే పాత సినిమాలలో నాయిక స్టేజీ మీద నృత్య ప్రదర్శన పేరుతో దేశభక్తి నృత్య రూపకం ఉండేది దానిలో గాంధీ, నెహ్రూల భజన ఉండేది.
********
1948 లో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో బ్రిటన్లో భారత హై కమీషనర్ గా ఉన్న VK కృష్ణ మీనన్ ప్రోటోకాల్ పాటించకుండా WILLYS జీపుల కొనుగోలు ఒప్పందం మీద సంతకం చేసాడు. అప్పట్లో ఆ ఒప్పందం విలువ 80 లక్షలు.
ఏంటీ 80 లక్షలేనా అని పెదవి విరవకండి. అప్పట్లో ఒక డాలర్ కి ఒక రూపాయి మారకం విలువ ఉండేది.
ఆ ఒప్పందం మీద ఎంత శాతం ముడుపులు ముట్టాయో తెలీదు కానీ పార్టీ ఫండ్ కావాలి కదా?
*********
సాంప్రదాయనీ – సుప్పినీ – సుద్ధ పూసనీ!
1957 లో అప్పటి పార్లమెంట్ లో పెద్ద రభస జరిగింది.
కేంద్ర ఆర్థిక శాఖ ఒత్తిడి చేయడంతో LIC కలకత్తాకి చెందిన పారిశ్రామికవేత్త ముంద్రాకి చెందిన పనికిరాని షేర్లు, 1.2 కోట్ల రూపాయల విలువ కలిగిన షేర్లు కొన్నది. దీని మీద అప్పట్లో పెద్ద చర్చ జరిగింది కానీ కాంగ్రెస్ స్వాతంత్ర్యo తెచ్చింది కాబట్టి, మెజారిటీ ఉంది కాబట్టి, ఎవరూ ఏమీ చేయలేక పోయారు.
ముంద్రా నుండి పార్టీ ఫండ్ ఎంత ముట్టి ఉంటుంది?
ఇప్పటి విలువతో పోలిస్తే 9,000 వేల కోట్ల రూపాయలు అవుతుంది!
*******”
రోనాల్డ్ రేవాల్డ్ (Ronald Rewald) అఫడవిట్!
నవంబర్ 15, 1984.
రోనాల్డ్ రేవల్డ్ హవాయి ద్వీపంలోని హోనలులూలో ఒక ఫైనాన్స్ కంపెనీకి యజమాని.
ఒక రోజు హఠాత్తుగా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు! అయితే హాస్పటల్ లో చికిత్స తరువాత బ్రతికాడు.
రెనాల్ట్ ఆత్మహత్యయత్నం ఎందుకు చేసుకున్నాడు?
మిలియన్ డాలర్ల ఫ్రాడ్ చేశాడని కేసు పెట్టారు పోలీసులు.
నిజానికి రెవాల్డ్ CIA ఏజెంట్. 1977 నుండి 1983 వరకూ తన ఫైనాన్స్ సంస్థ కేవలం CIA ఆపరేషన్స్ కోసమే హోనలులూలో పెట్టాడు.
హవాయిలో ఉన్న CIA స్టేషన్ తో సంబంధాలు ఉన్నాయి. CIA హవాయి స్టేషన్ చీఫ్ తో నేరుగా మాట్లాడే వాడు రేవాల్డ్.
రోనాల్డ్ రేవాల్ట్ అమెరికన్ ఫెడరల్ కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో ఇలా పేర్కొన్నాడు:
హోనలులూలో తన ఫైనాన్స్ సంస్థ పెట్టింది కేవలం ఇండియాకి CIA నిధులను పంపించడానికి!
CIA – రాజీవ్ గాంధీ!
రోనాల్డ్ రెవల్డ్ తో పాటు అతని సంస్థలో మరో ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు బిషప్ బాల్డ్విన్ (Bishop Baldwin), సొన్నీ వాంగ్ (Sonny Wong), డేవ్ బాల్డ్విన్ (Dave Boldwin).
బిషప్ బాల్డ్విన్ కి రాజీవ్ గాంధీ సన్నిహిత మిత్రుడు అయిన సుఖ చరణ్ సింగ్ తో స్నేహం ఉంది.
సుఖ చరణ్ సింగ్ సహాయంతో ఆయుధ డీల్ గురుంచి రాజీవ్ గాంధీతో మాట్లాడే ఉద్దేశ్యంతో ఇండియాలో ఒక ఫైనాన్స్ సంస్థ పెట్టాలని చూసి వెనక్కి తగ్గాడు.
ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ కి కావాల్సిన AWACS (Airborn Warning and Control Systems) తో పాటు హెలికాప్టర్ లు కొనడానికి గాను సంప్రదింపులు జరుగుతున్న సమయంలో CIA 10 మిలియన్ డాలర్లు రోనాల్డ్ రేవాల్డ్ సంస్థలో నకిలీ అకౌంట్లని ఓపెన్ చేసి వాటిలో డిపాజిట్ చేసింది.
ఇక రాజీవ్ సన్నిహితుడు అయిన సుఖ చరణ్ సింగ్ సహాయంతో బిషప్ రాజీవ్ ను పలుసార్లు కలిశాడు.
ఆ తరువాతే రెనాల్ట్ సంస్థలోని నకిలీ అకౌంట్ల నుండి డాలర్లు మాయం అయ్యాయి.
ఈ విషయం మీద FBI రోనాల్డ్ రేవాల్డ్ మీద కేసు పెట్టింది.
తన మీద కేసు బుక్ అవగానే CIA తమకేం పట్టనట్లు వ్యవహరిస్తోంది అని అర్థం చేసుకున్న రోనాల్డ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు!
తన సంస్థ నుండి మాయం అయిన 10 మిలియన్ డాలర్ల విషయంలో కేవలం బిషప్ మరియు సుఖ చరణ్ సింగ్ లకి మాత్రమే సంబంధం ఉంది కానీ అవి నా కంట్రోల్ లేవు అని అఫిడవిట్ లో పేర్కొన్నాడు.
CIA మాత్రం రెనాల్ట్ సంస్థని కేవలం అడ్రస్ కోసం వాడుకున్నట్లు అంగీకరించింది!
సుఖచరణ్ సింగ్ కి ద్వంద్వ పౌరసత్వం ఉంది అంటే కెనడాతొ పాటు భారత పౌరసత్వం ఉంది. కెనడాలో రైల్వే కాంట్రాక్ట్స్ చేసేవాడు అప్పట్లో.
మన దేశం ఏ ఆయుధాలు కొనబోతున్నదో దొడ్డి దారిన కాకుండా అధికార ఛానెల్ ద్వారా CIA కి తెలిసి పోయేది అంటే అర్ధం చేసుకోవచ్చు ముడుపుల కోసం దేశాన్ని తాకట్టు పెట్టారని!
ఈ సంఘటన 1983-84 ల మధ్య జరిగింది మరియు అప్పట్లో ఇండియా టుడే కవర్ చేసింది! పూర్తిగా తెలుసుకోవడానికి లింక్ మీద క్లిక్ చేయండి.
https://www.indiatoday.in/magazine/investigation/story/19841115-honolulu-based-businessman-ronald-rewald-arrest-brings-out-sensational-disclosures-803459-1984-11-14
********
So! ఇవేవీ స్కాంలు కావన్న మాట! క్విడ్ ప్రోకోలు కావన్న మాట!
కానీ రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించడానికి పార్లమెంట్ లో బిల్లు పెట్టి దానిని చట్టబద్ధం చేయడం మాత్రం స్కాం అట.
సుప్రీం కోర్టు విరాళాలు ఇచ్చిన వాళ్ల వివరాలు బహిర్గతం చేయమంది.
విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. SBI లో ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. కేవలం పేర్లు రహస్యంగా ఉంచారు. ఇది స్కాం ఎలా అవుతుంది?
ఒకసారి ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాక వాటిని ఆయా రాజకీయ పార్టీలు 15 రోజులలోపే వాడుకోవాలి, ఆ తరువాత అవి ప్రధాన మంత్రి సహాయ నిధికి ఆటోమేటిగ్గా వెళ్లిపోతాయి. అన్నింటికీ వివరాలు ఉన్నప్పుడు స్కాం ఎలా అవుతుంది?
Share this Article