Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎలెవన్..! 11 మార్కులు మాత్రమే… యాభైకా..? వందకా..? అదే ప్రశ్న..!!

June 15, 2025 by M S R

.

(Ashok Pothraj) ……….. ఎ లెవన్ (ఆహా తెలుగులో)… ఈ రోజుల్లో, సీరియల్ కిల్లర్ సినిమాలు చాలా సాధారణం అయ్యాయి. కథ మధ్య స్థానానికి చేరుకునేలోపే సాధారణ ప్రేక్షకులు కూడా హంతకుడిని గుర్తించగలరు. ఈ అంచనా వేయడం వల్లనే చిత్రనిర్మాతలు చివరి వరకు ఉత్కంఠను కొనసాగించడం కోసం చేస్తున్నా సైకోసిస్ థ్రిల్లర్స్ ప్లాన్స్ అన్నీ ఇన్నీ కావు.

ఇది సినిమాకే సవాలుగా మారింది. ఫలితంగా, ఇప్పుడు మరింత ప్రభావవంతమైన విధానం ఏమిటంటే, ఆశ్చర్యంపై మాత్రమే ఆధారపడకుండా, కథలో దానికి తగిన వాతావరణాన్ని నిర్మించడం, మరియు ప్రేక్షకుల మానసిక స్థితి, పాత్రలతో అభివృద్ధి, భావోద్వేగాల లోతు చూపడంలో సాధారణ ప్రేక్షకులను కథలోకి నిమగ్నం చేయడం ముఖ్యమైన అంశం.

Ads

ఈ సినిమా విషయంలో.. కథలోకి వెళితే...!
విశాఖపట్నంలో వరుస హత్యలు పోలీసులకు సవాల్‌గా నిలుస్తాయి. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి రంజిత్ (శశాంక్) యాక్సిడెంట్ గురి అవుతాడు. దాంతో ఆ కేసు విచారణ బాధ్యతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ అరవింద్‌ (నవీన్ చంద్ర)కు అప్పగిస్తారు. అయితే నగరంలో బెంజిమెన్ అనే సైకో ముసుగేసుకొని సీరియల్ కిల్లింగ్‌స్ కు పాల్పడుతున్నాడని ఏసీపీ అరవింద్ తెలుసుకుంటాడు. తన సహచర ఆఫీసర్ మనోహర్‌తో కలిసి సైకోను పట్టుకునేందుకు ఆ దిశగా ప్లాన్ మొదలు పెడతాడు.

సైకో బెంజిమెన్ ఎవరు? ఎందుకు సైకోగా మారాడు? ఇంతలా ఎందుకు హత్యలు చేస్తున్నాడు?
అతనికి ఈ హత్యలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి? చివరకు బెంజిమెన్‌ను అరవింద్ పట్టుకుంటాడా? ఈ హత్యల వెనుక బలమైన కారణం ఏమిటి? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానమే ఎలెవన్ సినిమా కథ.

లోకేశ్ అజల్స్ దర్శకత్వం వహించిన ఎలెవెన్, ఆసక్తికరమైన కథనంతో ప్రారంభమవుతుంది కానీ..! దాని అసమాన కథనం కారణంగా వీక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించడంలో ఇబ్బంది పెడుతుంది. కవల పిల్లల్లో ఒకరిపై మరొకరికి ఉండే ఎమోషనల్ బాండింగ్‌ను బేస్ చేసుకొని రాసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్.

స్టోరీకి బేస్ అయినా, బేసిక్ పాయింట్‌ లాజిక్ లెస్‌గా ఉండటం వల్ల సినిమాకు కనెక్ట్ కావడానికి సమయం పడుతుంది ఇదే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ లోపాన్ని హీరో తన పెర్ఫార్మెన్స్‌తో కప్పిపుచ్చాడు. దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లే, రాసుకున్న ట్విస్టులు సినిమాను కొంత పాజిటివ్‌గా మార్చాయి. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

హంతకుడి గుర్తింపు చుట్టూ ఉన్న ఉత్కంఠ సరిగ్గా లేదు, ఎందుకంటే మొదటి సీన్ ప్రారంభంలోనే స్పష్టమైన ఆధారాలు వదిలివేయబడతాయి, దీని వల్ల ట్విస్ట్ అనేది సులభంగా ఊహించే విధంగా మారుతుంది. ఈ చిత్రంలో ప్రారంభ సన్నివేశాలు మరియు భావోద్వేగంతో కూడిన ఫ్లాష్‌బ్యాక్‌లో కొంత కొత్త కథని జోడించి చూపిస్తారు.

సైకాలజికల్, హ్యుమన్ ఎమోషన్స్‌తో ఉండే స్టోరీ పాయింట్‌ను దర్శకుడు లోకేష్ ఎంచుకోవడంలోనే తప్పటడుగు వేశాడని చెప్పవచ్చు. ఓ కుర్రాడిని ఆటపట్టించడానికి పిల్లలు చేసిన తప్పుకు అంత మందికి శిక్ష వేయడమనేది లాజిక్‌ లెస్‌గా అనిపిస్తుంది.

కానీ కథను నడిపించిన తీరు, సన్నివేశాలను రాసుకొన్న విధానం, ఫ్లాష్‌ బ్యాక్‌లో హ్యుమన్ ఎమోషన్స్ జొప్పించిన తీరు బాగుంది. కథలో నాలుగైదు చోట్ల దర్శకుడి ప్రతిభ ప్రశంసించేలా ఉంటుంది.

మిగతా అంతా రొటీన్‌గా సాగడం ఓ లోపంగా కనిపిస్తుంది. ఇంటర్వెల్‌లోను క్లైమాక్స్‌లో రెండు ట్విస్టులు ఫీల్‌గుడ్‌గా ఉన్నాయి . కథను నడిపించడానికి ఎంచుకొన్న బేసిక్ పాయింట్‌ కన్విన్సింగ్‌గా లేదనిపిస్తుంది.
ఈ కథలో కిల్లర్ కిడ్నాప్ చేసే దృశ్యాలు, హత్య చేసే సీన్లు ఏ మాత్రం టెన్షన్ పెట్టవు, భయపెట్టవు.

ఆ స్థాయిలో ఈ సన్నివేశాలను డిజైన్ కూడా చేయలేదు. ఊపిరి బిగబట్టి చూడవలసిన సన్నివేశాలు తెరపై అలా వచ్చి పోతూ ఉంటాయి. ఇక పోలీస్ ఆఫీసర్స్ వైపు నుంచి కూడా పెద్దగా హడావిడి కనిపించదు. అసలు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగడం లేదని తెరపై పోలీస్ ఆఫీసర్ ఇటు ప్రేక్షకుడు ఫీలవుతుంటే, హీరోయిన్ ప్రేమ ప్రేమా అంటూ హీరో వెంటపడటం వంటి సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి. ఇక్కడ ఒక విషయం ఆ హీరోయినే ఈ సినిమా నిర్మాతనట.

ఈ కథలోని అత్యంత కీలకమైన అంశం, సైకో టార్గెట్ చేసిన లిస్టులో ఎవరున్నారో తెలుసుకోవడం వారిని కాపాడటం. అయితే అందుకు సంబంధించిన సంఘటనలు కూడా తెరపై నింపాదిగానే నడిచాయి. ఈ తరహా కథలు నవల చదువుతున్నట్టుగా కాదు, స్పాట్ లో మనం ఉండి చూస్తున్నట్టుగా అనిపించాలి.

లేదంటే కొంత నిరాశ మరికొంత అసంతృప్తి తప్పదు. ఇక్కడ అదే మనకు అనిపిస్తుంది. మరీ అంత దారుణంగా ఏం లేదు, ఒకసారి చూడొచ్చు. శుక్రవారం నుంచి ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు చూడొచ్చు… ఇంట్రస్టు అనిపిస్తేనే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిన్న కథే… చిన్న విషయాలే… ఐతేనేం, చీకట్లో చిరుదివ్వె చాలదా ఏం..?
  • రంగు పూసల దండల ఫేక్ జ్యోతిష్కులతో జాగ్రత్త; జాగ్రత్త; జాగ్రత్త…
  • కొన్ని పాత్రలు, కొన్ని పోరాటాలు ఎన్టీయార్‌కు మాత్రమే సాధ్యం..!!
  • నల్గొండ గోర్కీ… కృష్ణమూర్తి దేవులపల్లి… తెలంగాణ కథల తంగేడు చెట్టు…
  • ఎలెవన్..! 11 మార్కులు మాత్రమే… యాభైకా..? వందకా..? అదే ప్రశ్న..!!
  • పుష్ప2 బ్యాటింగుతో బుల్లితెర పగిలిపోయింది… ఆల్ టైమ్ హై రేటింగ్స్…
  • టెంబా బావుమా… నల్ల జాతి చేతిలో ఓ అపురూప విజయపతాక…
  • ఏమాటకామాట… కన్నప్ప భారీ నిర్మాణ విలువలకు తగినట్టే ట్రెయిలర్…
  • ఒక్క క్షణం…! ఎంత విలువైంది… ఓసారి పుతిన్ పుట్టుకను చదవండి… అర్థమౌతుంది…
  • దేవుడే పెదరాయుడు..! తీర్పు చెబితే సుప్రీం చెప్పినట్టే… అదే గుడికోర్టు…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions