Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…

May 16, 2025 by M S R

.

లెవెన్… అదేలెండి, ఎలెవెన్… తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు… సహనిర్మాత నటి రియా హరి… తమిళమే… మరి సినిమా అన్నాక, కథ మెయిన్ ప్లాట్ ఎలా ఉన్నా ఓ ప్రేమకథ ఉండాలి కదా…

అందుకని ఈ సినిమాలోనూ ఓ లవ్ ట్రాక్ జొప్పించారు… నిజానికి కథకూ దానికీ లింకేమీ ఉండదు, కథలో అది ఇమడలేదు నిజానికి… ఈమాత్రం దానికి మళ్లీ వేరే ఓ హీరోయిన్ ఎందుకులే, నవీన్ చంద్ర పక్కన నేను సరిపోనా ఏం అనుకుని హీరోయిన్‌గా రియా హరి తనే చేసింది…

Ads

ఆమె ఆ పాత్రలో సూట్ కాలేదు.., పైగా కృత్రిమంగా జొప్పించబడిన ఆ ప్రేమకథలో లైఫ్ లేదు.., పైగా ఒకే డైమెన్షన్‌లో నటించే, కనిపించే హీరో నవీన్ చంద్ర… ఇవీ కథాగమనానికి అడ్డుపడుతూ చిరాకుపుట్టిస్తయ్…

నిజమే… 20 ఏళ్లుగా ఫీల్డులో ఉన్నాడు నవీన్… అన్నిరకాల పాత్రలూ వేస్తాడు… కానీ తన నటనలో ఓ మొనాటనీ ఉంటుంది… సీరియస్ ఫేస్… ఎమోషన్, కామెడీ, భయం గట్రా ఏ ఉద్వేగం తీసుకున్నా సరే, తను అంతే… కాకపోతే సీరియస్ సీన్లలో మాత్రం బాగా చేస్తాడు…

ఇందులోనూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫిట్టయ్యాడు… ఎటొచ్చీ హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదు, అసలు కామర్స్, మ్యాథ్స్ కూడా లేదు… పైగా హీరో పాత్ర కేరక్టరైజేషన్‌లో ఓ దర్యాప్తు అధికారిగా గాకుండా పాత విషయాల్ని వివరించే ఓ కథకుడిలా అనిపిస్తాడు పాపం…

వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి… ఓ పోలీసాయనకు ప్రమాదం, తన స్థానంలో హీరో వస్తాడు… ట్విన్స్‌లో ఒక్కరినే హత్య చేయడం మాత్రమే ఓ కొత్త పాయింట్… కాకపోతే ఓ ఫ్లాష్ బ్యాక్, బిఫోర్ క్లైమాక్స్ ట్విస్టులు కాస్త ఆసక్తిగా ఉంటాయి తప్ప ఇక మొత్తం అనాసక్తంగా సాగుతుంది…

నవీన్ చంద్ర వెబ్ సీరీస్‌ల్లో కూడా కనిపిస్తాడు కదా… ఎక్కువగా ఇలాంటి పాత్రలే… అవును, ఈ సినిమా కూడా ఓటీటీకి సూటబుల్… థియేటర్లలో పెద్దగా క్లిక్ కాదు, అయ్యేందుకు చాన్సే లేదు… పాపం శమించుగాక..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ అక్రమ భవనాలకూ – జన్వాడ ఫామ్‌హౌజుకూ ఏమిటి లింకులు?!
  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!
  • STOCK MARKET HUMOUR – Sorry, I haven’t verified the Data
  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!
  • TGRPDCL @ రైతు డిస్కమ్ – రేవంత్ రెడ్డి సర్కారు భలే ప్లాన్ !!
  • రొనాల్డో శకం ముగిసింది – ఫుట్‌బాల్ సామ్రాట్ కన్నీటి వీడ్కోలు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions