ఎంత చెత్త టీవీ ప్రోగ్రాం అయినా సరే… ఎప్పుడైతే అందులో కాస్త ఫ్యామిలీ ఎమోషన్ యాడ్ అవుతుందో జనానికి కనెక్ట్ అవుతుంది… బిగ్‌బాస్ కూడా అంతే… ఇప్పుడొచ్చే సినిమాలు, టీవీ సీరియళ్లు, ఇతర రియాలిటీ షోలు, బూతు జబర్దస్త్ షోలతో పోలిస్తే బిగ్‌బాస్ పెద్ద అనాసక్తమేమీ కాదు… అఫ్ కోర్స్, ఈ సీజన్ బిగ్‌బాస్ తెలుగు అనేది ఓ చెత్త… అందులో డౌట్ లేదు… మొదటి నుంచీ విసిగించేస్తున్నారు, అసలు కంటెస్టెంట్ల ఎంపికే సరిగ్గా లేదు… బిగ్‌బాస్ చూసే రెగ్యులర్ ప్రేక్షకులు సైతం ఈసారి వదిలేశారంటే అదే కారణం… భిన్నరంగాలకు చెందిన వాళ్లు గనుక హౌజులోకి వస్తే వాళ్ల మధ్య పోటీ, కాన్‌ఫ్లిక్ట్ బలంగా, వెరయిటీగా ఉంటుంది… ఎంతసేపూ టీవీ పర్సనాలిటీలు, యూట్యూబ్ కేరక్టర్లనే తెచ్చి పెడితే ఏముంటుంది..? ఆ మెంటల్ సిరి, షణ్ముఖ్‌ల హగ్గుల్లా, బెడ్ మీద పెనవేసుకున్నట్టు ఛండాలంగా ఉంటుంది…
చాలా రోజుల తరువాత బిగ్‌బాస్ ఒక ఎపిసోడ్ కాస్త జనానికి కనెక్టయింది… అది కంటెస్టెంట్లను చాలారోజుల తరువాత ఫ్యామిలీ మెంబర్స్‌తో కలపడం… సహజంగానే కాస్త ఎమోషన్ ఉంటుంది… చాలారోజులపాటు దూరంగా ఉంటారు కాబట్టి వాళ్లు కలిసినప్పుడు ఆవిష్కరించబడే ప్రేమాభిమానాలు ప్రేక్షకుల్ని కనెక్ట్ చేస్తాయి… గుర్తుందా… గత సీజన్ విజేత అభిజిత్ తల్లి హౌజుకు వచ్చినప్పుడు… కొట్టుకొండిరా, లేకపోతే ఆటలో మజా ఏముంది అంటూ సరదాగా అందరినీ ఒకేరీతిన పలకరించి, ప్రేమను పంచిన తీరు… జనానికి విపరీతంగా నచ్చింది… ఆమె వచ్చివెళ్లడం అభిజిత్ పట్ల ప్రేక్షకుల ఆదరణను సహజంగానే పెంచడానికి ఉపయోగపడింది… ఇప్పుడు కూడా అంతే…
Ads
సిరి అమ్మ వచ్చింది, ఆ హగ్గులేమిటే అన్నది… కరెక్ట్, ఆమె తల్లి… సిరికి అది అర్థమైతే కదా, మెంటల్ కేసు… పాన్ షాపు పెట్టుకుని నా బిడ్డను పోషించుకున్నాను అన్నది… మానస్ తల్లి వచ్చింది, సేమ్, అభిజిత్ అమ్మలాగే అందరితోనూ సరదాగా, కలివిడిగా మాట్లాడి అందరి అభిమానాన్ని చూరగొన్నది… కాజల్ బిడ్డ, భర్త… శ్రీరామచంద్ర సోదరి… షణ్ముఖ్ తల్లి… సన్నీ అమ్మ… (ప్రియాంక కోసం వచ్చిందెవరో అర్థం కాలేదు… ఏం ఎడిటింగురా బాబూ..?) బాగనిపించింది రవి కూతురు, భార్య వచ్చిన ఎపిసోడ్… నిజానికి రవి ప్రతిసారీ (దాదాపు) నామినేటవుతాడు, హౌజులో ఎవరూ నమ్మరు తనను, ఏవేవో ఎత్తుగడలు వేస్తూ ఏవేవో తిప్పలు పడుతూ ఉంటాడు… కాస్త ప్రేక్షకుల్లోనూ నెగెటివిటీ ఉంది… కానీ రవి బిడ్డతో తను గడిపిన ఆ కొద్దిసేపు సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నయ్… కూతురు పట్ల ప్రేమ… ఆ అమ్మాయి కూడా ముద్దుగా భలే ఆకర్షించింది ప్రేక్షకులను, ఈ దెబ్బకు రవి పట్ల నెగెటివిటీ ఇంకాస్త తగ్గిపోయినట్టే అనిపించింది… తను ఖచ్చితంగా ఫైనలిస్టుల్లో ఉంటాడు… ఎటొచ్చీ విసిగించేస్తోంది నాగార్జున ప్రేమపాత్రుడు షణ్ముఖ్, తన లవ్వరో, ఫ్రెండో, మరొకటో అర్థం కాని సిరి… ప్లస్ ప్రియాంక అండ్ సన్నీ… రవిలాగే ఏవేవో సొంత ప్లాన్లతో చిరాకెత్తించే కాజల్… ఈసారి బయటికి వెళ్లేది ఎవరో మరి..!! (ఏమాటకామాట శ్రీరామచంద్ర మెచ్యూర్డ్‌గా, హుందాగా కనిపిస్తున్నాడు… మిగతా చిరాకు కేరక్టర్లతో పోలిస్తేనే సుమా…)…
Share this Article