మనం ఎంతసేపూ మమత ప్రభుత్వంలో, పార్టీలో నెంబర్ టూ స్థాయిలో చెలామణీ అయిన పార్థ ఛటర్జీపై ఈడీ దాడులు, ఆయన, లేడీ దోస్త్ ఇళ్లల్లో దొరికిన 50 కోట్ల నగదు, 5 కిలోల బంగారం గురించే మాట్లాడుతున్నాం… టీఎంసీ పార్టీ మింగలేక, కక్కలేక సతమతమవుతున్న స్థితిని చెప్పుకుంటున్నాం… ఇక్కడ ఓ చిన్న క్లారిటీ… బీజేపీ ఎప్పుడూ పెద్ద తలల జోలికిపోదు… వాళ్ల ఇళ్లల్లో ఏమీ దొరకవు… లెక్కలు, లీగల్ సిట్యుయేషన్ పక్కాగా ఉంటుంది…
కొందరు బినామీలు ఉంటారు… వాళ్ల పేర్లతో, వాళ్ల ఇళ్లే అడ్డాలుగా ఆర్థిక వ్యవహారాలు సాగుతూ ఉంటయ్… దేశవ్యాప్తంగా చిన్నాచితకా పార్టీల దగ్గర్నుంచి అందరూ అనుసరించే జాగ్రత్తలే ఇవి… ఆ ఆర్థికస్థంభాలను, అవే కేంద్రాలుగా పనిచేసే నెట్‌వర్కుల్ని డిస్టర్బ్ చేయడమే బీజేపీ మోడస్ ఆపరెండి… సేమ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నం ఒకటి చురుకుగా సాగుతోంది… (కేజ్రీవాల్ దగ్గర సత్యేంద్ర జైన్, ఠాక్రే దగ్గర సంజయ్ రౌత్… వీళ్ళని కూడా ED టార్గెట్ చేసింది)…
నిజానికి ప్రస్తుతం జార్ఖండ్‌లో బీజేపీ బలం పెరుగుతోంది… ఇండియాటీవీ సర్వేలో 14 ఎంపీ సీట్లకు గాను బీజేపీ 13 గెలుస్తుందట… (కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీల కూటమి మొత్తం 81 సీట్లకు గాను 47 గెలుపొందింది గత ఎన్నికల్లో… ఇందులో జేఎంఎం వాటా 30 సీట్లు… కాగా కేవలం 25 సీట్లతో బీజేపీ చతికిలపడిపోయింది…) మరి ఎలాగూ బలం పెరుగుతున్నప్పుడు హేమంత్ సోరెన్ జోలికి పోవడం దేనికి..? ఈ ప్రశ్నకు జవాబు ఏమిటంటే… ఇంకాస్త తొక్కడం… జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల పొత్తును ఛిన్నాభిన్నం చేయడం… తద్వారా రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడం…
Ads
హేమంత్ ఓ మైనింగు బ్లాకు తనకే లీజు రాసేసుకున్నాడు… పర్యావరణ, అటవీశాఖ క్లియరెన్సులు కూడా తనే ఇచ్చేసుకున్నాడు… సంబంధిత అన్ని శాఖలూ తన దగ్గరే ఉన్నాయి… తన భార్య కల్పనకు ఓ ఇండస్ట్రియల్ కారిడార్‌లో 11 ఎకరాల ప్లాట్ కేటాయించాడు… తన రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, ప్రెస్ అడ్వయిజర్ అభిషేక్ ప్రసాద్ కూడా మైనింగ్ లీజులు పొందారని బీజేపీ ఆరోపణ… హైకోర్టులో కేసు పడింది… ఇదీ సిట్యుయేషన్…
మరోవైపు ఈడీ తవ్వుతూనే ఉంది… తాజాగా ఓ పడవను సీజ్ చేసింది… అది పంకజ్ మిశ్రాకు చెందినదేనట… దాని విలువ 30 కోట్లు అంటున్నారు… ఇది పెద్ద పెద్ద స్టోన్ బ్లాక్స్‌ను ప్రవాహాల్లో తరలించడానికి ఉపయోగపడుతుంది… రెండుమూడు జిల్లాల్లో స్టోన్ ట్రేడింగ్ మొత్తం పంకజ్ మిశ్రా చెప్పుచేతల్లోనే నడుస్తుంది… ఈ పడవను సీజ్ చేయడానికి బోలెడు చట్టాల్ని తిరగేసి, 1885 నాటి బెంగాల్ ఫెర్రీస్ యాక్ట్ పట్టుకుని, దాని ప్రకారం కేసు పెట్టారు…
అంతకుముందే రెండు స్టోన్ క్రషర్లు సీజ్… మూడు పెద్ద ట్రక్కులు సీజ్… మొదటి వారంలో ఈఢీ 18 ప్రాంతాల్లో దాడులు చేసి, పంకజ్ మిశ్రా తాలూకు వ్యాపారాల కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది… 37 బ్యాంకు ఖాతాల్ని తవ్వి, లాకర్లను తెరిచి 12 కోట్ల నగదు పట్టుకుంది… అరెస్టు చేశారు… ఇప్పుడు తాజాగా ఓ వెస్సెల్… ఇంకా హేమంత్ సన్నిహితుల మీద ఆరాలు తీస్తున్నారు… జాబితాలు ప్రిపేర్ చేస్తున్నారు.. హేమంత్‌ను పొలిటికల్‌గా, ఆర్థికంగా డిఫెన్స్‌లోకి నెట్టేయడం బీజేపీ ప్లాన్… అఫ్‌కోర్స్, కీలక నేతలకు సంబంధించి బీజేపీ మోడస్ ఆపరెండి కూడా అదే…!!
Share this Article