.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు అస్సలు క్రీడాస్పూర్తి లేదు, బాజ్ బాల్ కాదు, బాడీ బాల్, స్లెడ్జింగ్, కుళ్లుబోతుతనం, కోతి బుద్ది అని చాలా చెప్పుకున్నాం కదా… ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ మనస్సులో మెదులుతున్న ఓ ప్రశ్న…
ఈ టైమ్‌లో కోహ్లీ గనుక కెప్టెన్‌గా ఉండి ఉంటే..? భలే ఉండేది కదా..?
Ads
మన కెప్టెన్ శుభమన్ గిల్ జూనియర్ అయిపోయాడు… జడేజా స్టోక్స్ వ్యాఖ్యలకు ఏవో కౌంటర్లు ఇచ్చాడు గానీ అవి సరిపోలేదు… స్టోక్స్‌ను కోహ్లీ గనుక అయిఉంటే తనూ మాటలతో ఆడుకునవాడు… ఎస్, ప్రస్తుత క్రికెట్‌లో మాటకుమాట మాత్రమే కాదు, టెంపర్‌మెంట్ ఉండాలి… లేకపోతే అవతల జట్టు మనల్ని ఈగల్లాగా తీసేస్తుంది…
టెస్ట్ క్రికెట్‌లో టెక్నిక్, ప్లాన్ ఎంత ముఖ్యమో టెంపర్‌మెంట్ కూడా అంతే ముఖ్యం ఈరోజుల్లో… అది ప్రేక్షకులకు కూడా కిక్కు… ఒక ధోని, ఒక రోహిత్, ఒక కోహ్లీ కొన్ని సక్సెసులు తమ ఖాతాలో నమోదు చేసుకున్నారంటే ఇదే కారణం… కీలెరిగి వాతపెట్టడం ధోనికి తెలుసు, చేతల్లో టెంపర్ చూపడం రోహిత్ స్టయిల్… మాటకుమాట, ఆటకుఆట కోహ్లీ శైలి…
అయితే అగ్రెసివ్‌నెస్ ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కాదు, గ్రౌండులో ఉండాలి… ఒక విశ్లేషణ ఏమిటంటే..?
నిన్నటి మ్యాచులో మన మేనేజ్మెంట్ చేసిన అతి పెద్ద బ్లండర్… ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పటివరకు 60 సెషన్స్ లో (4 టెస్టులు * ప్రతి రోజూ 3 సెషన్స్ * 5 రోజులు ) మనం కనీసం 35 సెషన్స్చలో మనం ఆధిపత్యం చెలాయించాం… కానీ అంతిమంగా 2-1 తో వెనుకంజలో ఉండటం అంటే క్లియర్ గా మేనేజ్మెంట్ లోపం…
ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు గౌతమ్ గంబీర్ ని కోచ్ చెయ్యటం ఓ బ్లండర్, చాలా స్ట్రాటజిక్ మిస్టేక్స్ ఉన్నాయ్ మేనేజ్మెంట్లో… ఒక చిన్న ఎగ్జాంపుల్… నిన్న మ్యాచులో నిర్ణీ త ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ డ్రాకి ప్రతిపాదిస్తే మన ప్లేయర్స్ ఒప్పుకోలేదు…
ఎందుకంటే, ఇద్దరు బ్యాటర్లు సెంచరీలకి దగ్గర్లో ఉన్నారు కాబట్టి.., కానీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ స్లెడ్జింగ్ తో మా బౌలర్ల బౌలింగులో సెంచరీలు చేస్తారా అని ఎగతాళి చేస్తే.., మనవాళ్ళు ఇద్దరు సెంచరీలు కాగానే డ్రాకి ఒప్పుకున్నారు..,
అదే ప్లేసులో విరాట్ కోహ్లీ గనుక ఉంటే సెంచరీల తర్వాత కూడా మ్యాచ్ మొత్తం ఇంగ్లాండ్ వాళ్ళతో బౌలింగ్ చేపించేవాడు.., అది టెంపర్మెంట్ అంటే.., ఒక్కసారి ఉహించుకోండి, మనం డ్రాకి ఒప్పుకోకుండా అందుబాటులో ఉన్న మొత్తం ఓవర్లు ఆడి ఉంటే, ఇంగ్లీష్ ప్లేయర్ల మానసిక స్థితి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ముందు ఎలా ఉండేదో…
కోహ్లీకి ఇతరులకి తేడా అది, మైండ్ గేమ్స్ మనవాళ్ళకి చేత కావడం లేదు… తూ కిత్తా అంటే తూ కిత్తా అనే రకం కోహ్లీ… గంబీర్ వరస్ట్ మేనేజర్, పాపం గిల్ పిల్లోడు కాబట్టి ఇంకా నేర్చుకొనే స్టేజ్ లో ఉన్నాడు…
ఒక్కసారి ఆలోచించండి, ఈ సిరీస్ లో కోహ్లీ లేదా రోహిత్ ఉండి ఉంటే… ఇప్పటి మన ప్రదర్శనకి సిరీస్ గెలిచే వాళ్ళం… గుడ్ కి, బెస్ట్ కి, బెటర్ కి తేడా అదే… మనం ఇప్పటివరకు గుడ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇదే పర్‌ఫార్మెన్స్ తో మనదైన మంచి స్ట్రాటజీ, సరైన మేనేజమెంట్ ఉంటే ఎప్పుడో బెస్ట్ అయ్యేవాళ్ళం… (గోపు విజయకుమార్ రెడ్డి)
Share this Article