.
తెలంగాణ బీజేపీకి… ఈటలను వ్యతిరేకిస్తూ, తెల్లారిలేస్తే తనను ద్వేషించేవారికి సింపుల్ ప్రశ్న… కాదు, సీరియస్ ప్రశ్నే… ‘‘మరెందుకు ఈటలను పార్టీలో చేర్చుకున్నారు..?’’
ఎస్, తను మొదట్లో బీజేపీకి వ్యతిరేక పీడీఎస్‌యు సిద్ధాంతం నుంచి ఎదిగిన లీడర్… తరువాత తెలంగాణ ఉద్యమంలో గానీ, తెలంగాణవాదమే ప్రధానంగా… అన్నింటికీ మించి తన హుజూరాబాద్ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా బలసంపన్నుడు…
Ads
జనంలో ఉంటాడు, జనంతోనే ఉంటాడు… కాకపోతే గెలుపూఓటములు రాజకీయాల్లో సహజం… ఐనా హైదరాబాద్‌కు తన రాజకీయ క్షేత్రాన్ని మార్చుకున్నాడు, నిలబడ్డాడు… కేసీయార్ వేధింపుల కారణంగా, తన అవసరం కోసం బీజేపీలోకి వచ్చినా సరే, మరీ ఆర్ఎస్ఎస్ మనిషిలా వ్యవహరించలేకపోయినా సరే, తను బీజేపీకి నష్టమేమీ చేయలేదు కదా, మరెందుకు ఈ కోపాలు, ప్రచారాలు, సోషల్ మీడయాలో దాడులు..?
ఎస్, తనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని కోరుకున్నాడు, తప్పేముంది..? ఇస్తామనే హామీ కూడా హైకమాండ్ నుంచి ఉన్నట్టు చెబుతారు… కానీ ఇవ్వలేదు, సరే, ఐనా తన మీద మాటల దాడి ఎందుకు జరుగుతోంది..? ప్రధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వైపు నుంచి…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావు ఎన్నికయ్యాక బండి సంజయ్ తనకు అదనపు బలం వచ్చినట్టు ఫీలవుతున్నాడా..? ఈటల బహిరంగంగా పేరు తీసుకోకపోయినా చాలా సీరియస్‌గా ఎదురుదాడి స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది… తను రాజకీయాల్లో మళ్లీ వెనక్కి పోలేడు… ఇక బీజేపీలోనే పోరాటం తప్పేట్టు లేదు…
వెరసి కరీంనగర్ పాత జిల్లా బీజేపీ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర బీజేపీ రాజకీయాల్లోనే ఓ ముసలం బయల్దేరిందనే సంకేతాలు జనంలోకి వెళ్తున్నాయి…
రాజాసింగ్ విషయంలోనూ అంతే… తను పార్టీ మీద అలగడం కొత్తేమీ కాదు, కానీ ఈసారి రాజీనామా లేఖ ఇచ్చిన వెంటనే ఆమోదించేయడం పార్టీ శ్రేణులకు ఒకింత విస్మయాన్ని కలిగించింది… ఐనా పార్టీ అధ్యక్ష పదవి ఆశించడంలో తప్పేముంది..? డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ వంటి నేతలూ ఆశించారు కదా… డీకే అరుణ కూడా బయటి నుంచి వచ్చిందే కదా… పార్టీలో ఇమిడిపోలేదా..?
మెహబూబా ముఫ్తితోనే పొత్తు పెట్టుకున్నప్పుడు… హిమంత విశ్వ శర్మను సీఎంను చేసినప్పుడు ఈ సిద్ధాంతాలు రాద్ధాంతాలు పనిచేయలేదు కదా… మరి ఇప్పుడేమిటిలా..?
మొన్నామధ్య కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కార్యకర్తలపై విసుక్కున్నట్టు వార్తలు వచ్చాయి… పార్టీ అంటే రకరకాల వ్యక్తులు చేరతారు, ఓన్ చేసుకోవాల్సిందే… కేవలం సంఘ్ నుంచి ఎమర్జయిన వ్యక్తులే కావాలని అనుకుంటే ఎలా..? ఇన్నేళ్లూ మరి సొంతంగా ఎదగలేకపోయింది కదా…
సో, అర్థమయ్యేది… ఈటల వర్సెస్ బండి సంజయ్ ఘర్షణ అనేది సైద్ధాంతికం కాదు… కేవలం వ్యక్తులు, వర్గాల ఘర్షణ మాత్రమే… కానీ రాను రాను తెలంగాణలో అధికారాన్ని ఆశిస్తున్న క్రమంలో ఈ ఘర్షణలు పార్టీ శ్రేణుల్లో కలకలానికి, కలవరానికి దారితీసి పార్టీకే నష్టం జరుగుతుంది… మరి సంఘ్ గానీ, పార్టీ గానీ ఎందుకు దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు..? అది అన్నింటికన్నా పెద్ద ప్రశ్న… తెలంగాణలో పార్టీని గాలికి వదిలేస్తోందా..?
Share this Article