కొత్త సంవత్సరం… బయట పార్టీలంటూ తిరిగే సీన్ ఎలాగూ లేదు… మన సర్కారు వారు అర్ధరాత్రి దాకా మందు షాపులు ఓపెన్ చేస్తామన్నారు కదాని, ఎటెటో తిరిగి, ఏదేదో తాగి, రోడ్ల మీద పడితే, పోలీసులు టెర్రరిస్టులంటూ ఇరగదీశారు… సో, ఇంట్లో అందరికీ టీవీలే దిక్కు… అందుబాటులో ఉన్న ఏకైక వినోదం కదా మరి… కానీ మన తెలుగు టీవీలు ఏం చేశాయి..? స్ట్రెయిట్ గా చెప్పాలంటే నాలుగు టీవీల్లో ఈటీవి మాత్రమే హిట్… మిగతా వాటిల్లో జెమిని పాత వాసన కొట్టింది… జీటీవీ వాడు అడ్డగోలుగా నిరాశ పరిచాడు… మాటీవీ అట్టర్ ఫ్లాప్… ఇదీ సంక్షిప్తంగా సమీక్ష…
ఈటీవి… రాత్రి 9.30 నుంచి 12 గంటల దాకా DJ పేరిట స్పెషల్ షో చేసింది… అంటే ఢీ వర్సెస్ జబర్దస్త్ అనే కాన్సెప్టు… పనిలోపనిగా కార్తికేయ, ఆమని కొత్త సినిమా ఏదో ఉన్నట్టుంది… ఈ షోకు హాజరై తమ సినిమా ప్రమోషన్ చేసుకున్నారు… (ఓహో, చివరకు మల్లెమాల ఈ పని కూడా చేస్తుందన్నమాట…) ఈటీవీ నిజానికి చాలా ఏళ్లుగా ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ చేయడంలో పర్ఫెక్ట్… పలు రియాలిటీ షోల ఆస్థాన విద్వాంసులు రెడీగా ఉంటారు కదా… ఎప్పటిలాగే రోజా ఓవర్ యాక్షన్ యథాతథంగా ఉంది… కానీ ఆమెకు తగినట్టు శేఖర్ మాస్టర్ లేకపోవడం ఒకింత రిలీఫ్… లేకపోతే ఇద్దరూ డాన్సులు చేసేవాళ్లేమో… ఈసారి బాబా భాస్కర్ ఉన్నాడు… ఇక రష్మి, అనసూయ, హైపర్ ఆది, వర్షిణి, సుడిగాలి సుధీర్ ప్లస్ జబర్దస్త్ ఇతర comedians… ఇంకేం కావాలి..? అలవోకగా ఒక ఫుల్ entertainment షో రన్ చేశారు…
Ads
Zee వాడు అదృష్టయోగం పేరిట 10.30 నుంచి 12.30 దాకా ఒక స్పెషల్ షో వేశాడు… దారుణం… రాశుల వారీగా జాతక ఫలితాలు చెప్పి చేతులు దులిపేసుకున్నడు… ఆయనెవరో జ్యోతిష, సంఖ్యా, వాస్తు తదితర సకల శాస్త్రవేత్త అట, ప్లస్ ఇంకెవరో లేడీ యాత్రాఫలిస్ట్ ఏదేదో చెప్పారు… తుస్సు… వినోదం గంతులు వేయాల్సిన సందర్భంలో ఇది ఏం టేస్టురా తండ్రీ… పైగా రాశులవారీగా జాతకాలు, పంచాంగశ్రవణాలు ఉగాది స్పెషల్ బాబూ… ఇంగ్లిషు సంవత్సరానికి ఈ పంచాంగం ఏమిటో… జీవాడి తలకాయ్… నిజానికి మొన్న ఆదివారం party time పేరిట ప్రత్యేక commercial షో వేసింది జీటీవీ… దానికి ఇది అదనం… ఎవడూ చూడలేదు…
ఈమధ్య జెమిని వాడు కూడా ఈవెంట్ స్పెషల్ షోలకు దిగాడు కదా… 10 నుంచి 12 దాకా welcome 2021 పేరిట ఒక షో చేశారు… ఇందులో కూడా సేమ్ జబర్దస్త్ comedians స్కిట్స్ చేశారు… తీరా చానెల్ ట్యూన్ చేసి చూస్తే… అది చాలా పాత షో… వేరే దిక్కులేక పునః ప్రసారం చేసి మమ అనిపించారు… గతంలో కొన్ని పండుగల స్పెషల్స్ చేస్తే పూర్ రేటింగ్స్ వచ్చాయి… దాని రీచే అంత… అందుకే డబ్బు ఖర్చు పెట్టి మళ్లీ చేతులు కాల్చుకోవడం దేనికిలే అనుకుని కొత్త సంవత్సరం ఈవెంట్ వదిలేసినట్టున్నాడు… పాపం… మరి మాటీవీ వాడు ఏం చేశాడో తెలుసా… అసలే ఈ టీంకు స్పెషల్ ఈవెంట్స్ చేతకాదు కదా… సింపుల్ గా 11.30 గంటల నుంచి అత్తారింటికి దారేది సినిమా వేసి చేతులు దులుపుకున్నాడు… టీవీలో ఈ సినిమాను జనం కనీసం లక్ష సార్లు చూసి ఉంటారు… వెరసి మాటీవీ తుస్… సాధనసంపత్తి లేక కాదు… టేస్టు లేక…! సో, కంగ్రాట్స్ ఈటీవీ… ఉన్నంతలో కొత్త సంవత్సరం ఆగమనవేళ బాగానే ఎంటర్టెయిన్ చేశారు…!!
Share this Article