అంతటి నటుడిని, ఆయన పెట్టిన పార్టీని భ్రష్టుపట్టించి… తెలుగు సినిమాను సిండికేట్ గుప్పిట్లో చెరబట్టి… చివరకు ఇప్పుడు డిజిటల్ మీడియాను కూడా వదలని ఆ మహావ్యక్తి గురించి కాసేపు విశ్లేషణలు మానేద్దాం… ఇండస్ట్రీలో మెజారిటీ వ్యక్తులు అలాంటివాళ్లే కాబట్టి..! ఆ సారు గారు ఆహా ఓహో అంటూ స్టార్ట్ చేసిన సదరు ఓటీటీ కంటెంటు నాణ్యత కూడా అలాంటిదే… అదీ కాసేపు వదిలేద్దాం..! ప్రస్తుతం ఓ సీరియస్ చర్చ అవసరం… థియేటర్లలో నడిస్తే సెన్సార్ అవసరం… ఆ సెన్సార్ సభ్యుల అవినీతి, మానసిక ప్రతిభ వేరే కథ… కానీ ఓ కంట్రోల్, ఓ పగ్గం ఉండేది… కానీ ఓటీటీకి..? ఏ పగ్గాలూ లేవు… ఎవడి నియంత్రణా లేదు… అసలు కట్టుబాట్ల నడుమ కూడా ఎంతసేపూ శృంగారం, ప్రేమ, పగ, ప్రతీకారం నింపిన కథలు తప్ప మరేమీ పట్టలేదు మన నిర్మాతలకు… ఇక ఏ కట్టుబాట్ల కట్లు లేవనేసరికి ఎలా ఉంటుంది..? హిందీ నుంచి ప్రాంతీయ భాషల దాకా ఓటీటీల్లో బూతును దట్టించేస్తున్నయ్…
ఇన్నాళ్లు పెద్ద నిర్మాతలు, సిండికేట్ల నడుమ చిక్కుకుని విలవిలలాడిన క్రియేటివిటీకి కొత్త దారులు కనిపిస్తాయని ఓవైపు ఆశలు పెరుగుతుంటే… మన వెగటు సినిమాలను మించి ఎన్నోరెట్లు నాణ్యమైన, స్ఫూర్తిదాయక వెబ్ సీరీస్ కూడా పుట్టుకొస్తుంటే… ఇదుగో… మరోవైపు బూతు కంటెంటు విపరీతంగా నిండిపోతోంది… ఓటీటీ వెబ్ సీరీస్ అంటే చాలు… ఫుల్లు వెగటు, వెకిలి… ఈటీవీ వాళ్లు జబర్దస్త్ కూడా ఎందుకూ పనికిరాదు అన్న స్థాయిలో బూతు సీన్లు, డైలాగులతో నింపేయాలి అనుకునే క్రియేటర్స్ ఎక్కువైపోయారు… సేమ్, అలాంటి మెంటాలిటీయే కదా, మనం పైన చెప్పిన ఓ కేరక్టర్… ఇంకేముంది..? అందరూ రాంగోపాలవర్మ వంటి నికృష్టులే అయిపోతున్నారు ఇప్పుడు…
Ads
ఇన్ ది నేమ్ గాడ్ అని ఓ వెబ్ సీరిస్ ఆహా అనబడే ఓ డిజిటల్ ప్లాట్ఫారంలో కనిపించింది… ఫాఫం, మంచి నటుడిగా, సెలెక్టెడ్ పాత్రలే ఎంచుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు అని ఓ పాజిటివ్ ఫీల్ ఉండేది ప్రియదర్శిని చూస్తే… ఈ సీరీస్లో నటించి ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయాడు… ఏమిటీ ఎంపిక ప్రియదర్శీ..? ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్, ఆ ఓటీటీ ఓనర్లను వదిలెయ్… నీ బుర్రకు ఏమైంది..? కనీసం షూటింగు సమయంలోనైనా సోయి లేదా నీకు..? లేక ఇదో కళాఖండం అనుకున్నావా..? జనం ఛీఛీ అంటున్నది ప్రధానంగా నిన్నే… మిగతా థర్డ్ రేట్ వాళ్లను వదిలెయ్… నీ ఇంగితం ఏమైంది..? లేక నా ఒరిజినల్ బుర్రే ఇది, మీ ఖర్మ, చూస్తే చూడండి, లేకపోతే ఆ ఓటీటీని చూడటం మానేయండి, నా మొహం కనిపిస్తే చాలు మూసేయండి అని పరోక్షంగా చెబుతున్నావా..?
ఆ కథే థర్డ్ రేట్… ఆ కథనం ఫోర్త్ రేట్… ఆ దర్శకుడు, ఆ నిర్మాతల టేస్ట్ ఫిఫ్త్ రేట్… టీవీ తెర మీదకు వస్తే వేయి నీతులు చెప్పే పోసానీ, ఏమిటిది..? ఏమైంది నీ బుర్రకు..?! ఆగండాగండి… అరెరె, అప్పుడే అయిపోలేదట… బహుశా మరో ఏడో ఎనిమిదో ఎపిసోడ్ల పార్ట్-2 ఉంటుందేమో… బీరెడీ… ఆహా అని లొట్టలు వేసే ప్రేక్షకులూ ఉంటారేమో… కానీ జనం బుర్రల్లోకి పదే పదే ఎలాంటి కంటెంటును ఎక్కిస్తున్నాం మనం… మోడీ ప్రభుత్వం ఏదీ సరిగ్గా చేసి ఏడవదు… కనీసం ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కేస్టింగ్ అనే మంత్రిత్వ శాఖ ఉందా..? దానికో మంత్రి ఉన్నాడా..? ఇలాంటి కంటెంటుకు ఏ కట్టుబాటూ అక్కర్లేదా..?!
Share this Article