Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సద్దాం ప్రత్యక్షం – హైపర్ ఆది మాయం – వాటీజ్ దిస్ నాగబాబూ…

August 17, 2026 by M S R

.

చాన్నాళ్ల తరువాత ఈటీవీ జబర్దస్త్ ఏమైనా మారిందా… శుక్ర, శనివారాల్లో షోలు మానేసి, ఆదివారానికి మార్చి, మళ్లీ నాగబాబును తీసుకొచ్చి, కొత్త కొత్త సినిమా, టీవీ కేరక్టర్లను స్కిట్లలోకి తీసుకొస్తున్నారు కదా, నాణ్యత ఏమైనా పెరిగిందా అనే ఆసక్తితో ట్యూన్ చేశాను…

అదే స్థిరమైన, దృఢమైన నాసిరకం, వెగటు కామెడీ… తగ్గేదేలా… హేట్సాఫ్ మల్లెమాల, ఓ కాలుష్యాన్ని ఎన్నేళ్లయినా వ్యాప్తి చేయగల షో… ఆసక్తికరంగా ఇందులోకి సద్దాం వచ్చాడు… నిజానికి తను నాగబాబు మనిషే… జబర్దస్త్ నుంచి నాగబాబు కోపంతో వెళ్లి జీతెలుగులో అదేదో అదుర్స్ అని ఓ కామెడీ షో, అచ్చం జబర్దస్త్‌ను కాపీ కొడుతూ చేయించాడు తెలుసు కదా…

Ads

అది ఆరెంజ్ సినిమాకన్నా డిజాస్టర్… సద్దాం కొన్నాళ్లు కనిపించలేదు, రీసెంటుగా జెమినిలో మాస్ జాతర చేస్తున్నాడు… నిజానికి అది కాస్త బాగుంటుంది… ఇక్కడ నాగబాబు వచ్చాడు కదా, పాత బ్యాచ్ వస్తోంది కదా, సద్దాం కూడా ఈటీవీకి వచ్చాడు…

పృష్ఠభాగాన్ని ఊపుతూ… బ్యాక్ టు జబర్దస్త్ అని తెలియాలి కదా అని జబర్దస్త్ మార్క్ వెకిలి పంచ్ కూడా వేశాడు… అంతేకాదు, మరో రోత ఏమిటంటే..? వాడెవడో పక్కన ఉండి గాలికి పోయే కంపను గు- కు తగిలించుకున్నట్టు అని చెప్పడానికి నిజంగానే ఓ కంపను తెచ్చి, దానికి ఓ గు- ను తగిలించి సింబాలిక్‌గా ఓ వాంతి డైలాగ్ విసురుతాడు, సద్దాం స్కిట్లలో ఇవి కామనే, పక్కాగా జబర్దస్త్ షో కేరక్టర్‌కు ఆప్ట్…

తను వచ్చాడు, తప్పకుండా తనుంటే రియాజ్ ఉంటాడు కదా, తనూ వచ్చాడు… సరే, ఓ నాసిరకం స్కిట్… కానీ విశేషం ఏమిటంటే..? నాగబాబు చెప్పాడు కదాని హైపర్ ఆది మళ్లీ జబర్దస్త్‌కు వచ్చాడు కదా, సద్దాం రాగానే తను మాయం… ఎస్, ఇందులో మతలబులున్నాయి…

గతంలో సద్దాం, హైపర్ ఆది నడుమ సెటైర్లు, వీడియో విమర్శలు నడిపించాయి కొన్నాళ్లు… కానీ తన అత్యంత విశ్వసనీయ వ్యక్తిగత, పార్టీ బంటు హైపర్ ఆదికి నచ్చదని తెలిసీ సద్దాంను నాగబాబు జబర్దస్త్‌కు ఎందుకు పట్టుకొచ్చాడు..? అసలు ఈ నాగబాబు ఎవడికైనా అర్థం అవుతాడా ప్రపంచంలో..?

సద్దాం

నిజానికి సద్దాం కామెడీ టైమింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది… తన డైలాగ్ డిక్షన్ గానీ, యాక్షన్ గానీ బాగుంటాయి… కానీ ఎందుకో పాపులర్ కాలేకపోతున్నాడు… ఎక్కడో తేడా కొడుతోంది… సరే, ఈ హైపర్ ఆది, ఈ బంపర్ అంతం ఎట్సెట్రా వదిలేసి, ఎలాగూ నాగబాబు సపోర్ట్ దొరికింది కదా, ఇప్పుడిక సద్వినియోగం చేసుకుంటే ఆద్యంతం కెరీర్ బాగుపడే చాన్సయితే ఉంది… సద్దాం, అలాగే చేద్దాం…!!

చివరగా… సద్దాం మారడు… తన స్కిట్‌లో ఓచోట ‘‘వదిలేసి వెళ్తారు, హీరోలు అవుతారు, దర్శకులవుతారు, మళ్లీ ఇక్కడికే వస్తారు’’ అంటూ ఓ సెటైర్ వదిలాడు… ధన్‌రాజ్ గురించేనా..? ఇంకెవరైనా ఉన్నారా..? ప్రదీప్ రాలేదు, సుడిగాలి సుధీర్ రాలేదు, బలగం వేణు రాలేదు, మరి ఎవరి గురించబ్బా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సద్దాం ప్రత్యక్షం – హైపర్ ఆది మాయం – వాటీజ్ దిస్ నాగబాబూ…
  • బీజేపీ నేత థర్డ్ రేట్ – క్షుద్ర వ్యాఖ్యలు … ఇజ్జత్ పోయిందిగా…!!
  • దేవదాసు చావడు… కాలం మారేకొద్దీ కొత్తగా పుడుతున్నాడు !
  • పార్టీలో అప‘స్వరాలు ! ఔట్ స్పోకెన్ రేవంత్ అసాధారణ నిశ్శబ్దం !
  • కృష్ణ, విజయనిర్మల … డెయిలీ పేపర్ల కార్గో ఫ్లయిట్‌లో చెన్నైకి !!
  • రాజగోపాలరెడ్డి ప్రయాణం ఎటువైపు ? హైకమాండ్ సైలెన్స్ ఎందుకు ?
  • Viral Mansi Sherni – ‘మోనాలిసాతో పోల్చితే మర్యాద దక్కదు సుమా’
  • తెలంగాణ కాన్వాస్ అంటే ఉరికేంత మైదానం ! చెడగొట్టకండి !!
  • దిమాగీ నక్సల్ ! మోదీ నోటి వెంట ఓ కొత్త మాట ! దేనికి ఈ సంకేతం !!
  • బిగ్‌బాస్ – ఇలాంటోళ్లను తీసుకొండి – పాజిటివ్ వైబ్స్ పక్కా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions