ఫాఫం ఈటీవీ… నానాటికీ తీసికట్టు అన్నట్టుగా చానెల్ వెలవెలబోతోంది… జబర్దస్త్ మినహా మరేఇతర ప్రోగ్రామ్ కూడా చూసేవాళ్లు కరువై, రేటింగ్స్ లేక, పోటీచానెళ్ల ముందు తలవంచుతోంది… కొన్ని నెలల రేటింగ్స్ తీరు చూస్తుంటే అర్థమయ్యేది అదే… తాజా బార్క్ రేటింగ్స్ చెబుతున్నదీ అదే… వయోభారంతో రామోజీరావు వదిలేసి ఉండవచ్చుగాక… కానీ దాన్ని ఉద్దరించాల్సిన బాధ్యులు ఏం చేస్తున్నట్టు..?
సరే, వాళ్లకు చేతకాదు, ఆ బూతుల జబర్దస్త్ ప్లస్ దాన్ని నిర్మించే అదే మల్లెమాల వాళ్లు నిర్మించే శ్రీదేవి డ్రామా కంపెనీ… అవి తప్ప ఒక్కటీ జనరంజకం కావు… కావడం లేదు… ఒక్క సీరియల్‌నూ జనం చూడటం లేదు పెద్దగా… చాలా పూర్ ప్రొడక్షన్స్… నిజం చెప్పాలంటే… న్యూస్‌తో రేటింగ్స్ సంపాదించి, నిలబడుతున్న వినోద చానెల్ ప్రపంచంలో ఇదొక్కటేనేమో…
ఆగండాగండి… మరో దుర్మార్గం ఉంది… ఈ చానెల్ కోసం ప్రేక్షకుడు అసలు ఎవడూ చూడని మరో రెండు చానెళ్లను కూడా ‘ప్యాకేజీ’ కింద సబ్‌స్క్రయిబ్ చేసుకోవాల్సి రావడం… ఇదే నాసిరకం, దీనికి తోడు ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్… నిర్బంధంగా అంటగట్టడం అన్నమాట… ఒక్కసారి ఈ టేబుల్ చూడండి… మీకే అర్థమవుతుంది… ఆ రెండు చానెళ్ల దుర్గతి ఏమిటో…
Ads
చివరకు స్టూడియో వన్ ప్లస్‌కన్నా దిగువకు…!! ఇవి తాజా రేటింగ్సే… చానెళ్లు, వాటికి యాడ్స్ ఇచ్చి పోషించే ప్రకటనకర్తలు పరిగణనలోకి తీసుకునే బార్క్ రేటింగ్సే ఇవి… ఆ చానెళ్లు మరీ అంత దరిద్రపు పర్‌ఫామెన్స్ ఎందుకు చూపిస్తున్నయ్..? సమీక్ష లేదు, అడిగి తగు చర్యలు తీసుకునేవాడు లేడు… ప్రేక్షకుల నెత్తికి రుద్దడం మినహా ఈటీవీ టీం ఉద్దరిస్తున్నది కూడా ఏమీ లేదు…
హైదరాబాద్ కేటగిరీ రేటింగ్స్ పరిశీలిస్తే… ఈటీవీ వినోద చానెల్‌ను కూడా ఎవడూ దేకడం లేదనే విషయం అర్థమవుతుంది… స్టార్ మా, జీతెలుగు చానెళ్ల రేటింగ్స్‌తో పోలిస్తే సగం… రెండు రాష్ట్రాల రేటింగ్స్ పరిశీలిస్తే నంబర్ వన్‌లో ఉన్న మాటీవీ రేటింగ్స్‌లో 40 శాతం మాత్రమే… ఫాఫం… దాన్నలా వదిలేసేయండి… ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్ కూడా అంతే… మొత్తానికి ఈటీవీ చూడాలనుకునే ప్రేక్షకులు ఉత్త పుణ్యానికి అదనంగా నాలుగు చానెళ్లను మోస్తున్నారు అన్నమాట…
చాలా కేటగిరీల్లో మాటీవీ తోపు, టాపు… కానీ హైదరాబాద్ వచ్చేసరికి మాటీవీని ఎప్పటికప్పుడు జీటీవీ తొక్కిపారేస్తోంది… హైదరాబాద్ మార్కెట్‌లో మాటీవీని ఎవడూ దేకడం లేదు… కార్తీకదీపాలు గట్రా సీరియళ్ల హవా ఇతర ప్రాంతాల్లో మాత్రమే… హైదరాబాద్‌లో మాత్రం త్రినయని, ప్రేమఎంతమధురం వంటి సీరియళ్లు మాత్రమే…
రేటింగ్స్ సాధించడంలో మాకు ఎదురు లేదు, తిరుగులేదు, మేం తోపులం, ఏమైనా చేయగలం అనుకునే మాటీవీ టీం అహాన్ని జీటీవీ ఎప్పటికప్పుడు బద్దలు కొడుతోంది… అవునూ, ఇతర ప్రాంతాల్లో రేటింగ్స్‌ను ఆర్గనైజ్ చేయగలిగే మాటీవీ టీం హైదరాబాద్‌లో ఎందుకు ఎడ్డిమొహం వేస్తోంది… మీటర్లున్న ఇళ్లు ఏవో వెతకండి బాస్..!! జెమిని టీవీ గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు… ఆ పేరుతో ఒక టీవీ చానెల్ ఉందని జనం మరిచిపోతున్నారు… అంతే…!!
Share this Article