అంతకుముందు ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో అచ్చం కొన్ని జాతరల్లోని రికార్డింగ్ డాన్సులు, బూతు షోలా అనిపించేది… వెకిలి, వెగటు… అఫ్‌కోర్స్, రెచ్చిపోదాం బ్రదర్ అలాగే ఉంది… అరె, ఏందిర భయ్, ఈటీవీ డైరెక్టర్లు నితిన్, భరత్‌లను నాగబాబు ఎత్తుకుపోయాక ఇక ఈటీవీకి ఎవరూ దొరకలేదా..? ఏదో జాతర నిర్వాహకుల్ని తెచ్చిపెట్టుకున్నారా అనిపించేది… కానీ సుధీర్‌ను యాంకర్‌గా చేసి, కొన్ని మార్పులు చేశారు… కామెడీతో పాటు మ్యూజిక్, మ్యాజిక్, డాన్సులే కాదు… రకరకాల హ్యూమన్ టచ్ ఇవ్వసాగారు… ఫలితం ఏమిటో తెలుసా..? ఈటీవీకే అసెట్ అయిపోయింది ఆ ప్రోగ్రాం… మనం గతంలోనూ చెప్పుకున్నాం, కానీ కొందరు వెటకరించారు… వాళ్లకోసం ఈ తాజా రేటింగ్స్… రేటింగ్స్ మంత్రగాళ్లు మాటీవీ ఆపరేటర్లు కూడా చేతులెత్తేసి, ఈటీవీ ముందు మోకరిల్లారు… బూతు తప్ప ఇంకేమీ ఉండని జబర్దస్త్ షోకు కూడా ఓ బాట చూపేలా ఉంది… జబర్దస్త్ మణికంఠ అనే డైరెక్టర్ చూస్తాడట, ఇప్పుడు హైపర్ ఆది వివాదానికి బాధ్యుడు తనే… బాబూ, నీకో దండం తండ్రీ… శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎపిసోడ్ ప్రదీప్ అనే క్రియేటివ్ డైరెక్టర్ చేశాడా, శ్రీపాద చేశాడా తెలియదు… కానీ కాంప్లిమెంట్స్….
చూశారు కదా… గత వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఏకంగా 6 రేటింగ్స్ పొందితే, అదే టైంలో వృద్ధ యాంకరిణి సుమ ముక్కుతూ మూలుగుతూ నడిపించే స్టార్ మ్యూజిక్ అనే కిట్టీ పార్టీకి 4 రేటింగ్స్… ఇక అవినాష్ పెత్తనం సాగించే కామెడీ స్టార్స్ రెండున్నర రేటింగ్స్… కామెడీ స్టార్స్ అట్టర్ ఫ్లాప్… శేఖర్ మాస్టర్ తలపట్టుకుని, ఇజ్జత్ పోతుంది గదరా అనుకుంటున్నట్టున్నాడు… సో, రేటింగ్స్ మాయ అన్నివేళలా పనిచేయదు, షోలో దమ్ముండాలి… అది మాటీవీ క్రియేటివ్ టీంకు తెలియనట్టుంది… సరే, శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి చెప్పుకుంటున్నాం కదా… వచ్చే షోను ‘‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’’ అంటూ ఓ కొత్త కాన్సెప్టు తీసుకున్నట్టున్నారు… ఎందుకు దాని గురించి చెప్పాలి అంటే… పునీత్ రాజకుమార్‌కు ఆ షో సమర్పించిన నివాళి ఓ విశేషం… చెత్తా దర్శకులు, చెత్తా హీరోల జన్మదినాల్ని సెలబ్రేట్ చేయడం కాదు… ఓ రియల్ లైఫ్ హీరో పునీత్‌కు మనస్పూర్తిగా అర్పించిన నివాళి…
Ads
ఇదుగో ఇదే… ఇతర చానెళ్లకు చేతకానిది… పునీత్ పట్ల అద్భుతమైన ప్రేమ దేశమంతా వ్యక్తమైంది… ఆ మరణానికి దుఖించని కన్నడ కుటుంబం లేదు… తను సంపాదించుకున్న మంచి పేరు అది… మరణించి ఇన్నిరోజులవుతున్నా రోజూ వేలాది మంది ఇంకా వచ్చేస్తూ పునీత్‌కు దండాలు పెట్టుకుంటున్న తీరు రియల్లీ టచింగ్… అబ్బే, మన హీరో కాదు అనుకోకుండా తనకు మంచి నివాళి అర్పించిన తీరు పట్ల ఈటీవీకి, మల్లెమాలకు హేట్సాఫ్… మరో విషయం… ఇండియన్ ఐడల్ పోటీతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించిన ‘మన షణ్ముఖప్రియ’ను పిలిచి, నాలుగు పాటలు పాడించి, ఆమెను గౌరవించుకున్న తీరు కూడా బాగుంది… టీవీ సెలబ్రిటీలను గాకుండా పలు రంగాల్లో ప్రముఖంగా పేరు సంపాదించిన ఆడవాళ్లను పిలిచి, గౌరవించి, ఆదివారం సెలవు టాపిక్ మీద పలకరిస్తే ఇంకా బాగుండేది…. ఇంకా అదే లాస్య, అదే సాఫిత్రి… ఇంకాస్త మారండిరా బాబూ…. సరే, ఇవి వదిలేయండి బాస్… టీవీ ప్రోగ్రాములు, సీరియళ్లు, న్యూస్, డిబేట్లు అంతేనే ఓ చెత్తా… అందులోనూ అప్పుడప్పుడూ కొన్ని మెరుపులు కనిపిస్తుంటయ్… చప్పట్లు కొడదాం… పునీత్‌కు నివాళి, షణ్ముఖప్రియ పాటల్ని అభినందిద్దాం… పోయేదేముంది డ్యూడ్, కాస్త ఎంకరేజ్‌మెంట్… కాస్త మారండర్రా అని బుర్రల్లేని టీవీల క్రియేటివ్ టీంలకు ఓ హితవు… అంతే…
Share this Article