.
Priyadarshini Krishna …… లేటుగా కాదు గాని లేటెస్టుగా రాస్తున్నా…. చాలా కాలంగా తెలుగు OTT apps ఐన ఆహా గానీ ఈటీవీ విన్ గాని సబ్‌స్క్రిప్షన్ రెన్యువల్ చేసుకోలేదు…. అహా మీద విరక్తి కలిగింది… ఈ టీవీ మీద ఏదో తెలీని నైరాశ్యం వచ్చింది…
నాకు ఏ కంటెంట్ ఐనా యూట్యూబ్ గానీ OTTలు గానీ ఫోన్ లో గాకుండా టీవీలో చూసే అలవాటు…
రెండు వారాల క్రితం ఈటీవీ విన్ లో ‘కథాసుధ’ మొదలవుతుంది అని మళ్ళీ సబ్‌స్క్రైబ్ చేసుకున్నా….
ఈటీవీ వారు OTTలో మెదలు పెట్టిన కొత్త వెబ్‌సీరీస్- 30 నిముషాల మినీ సీరీస్ లు…. ఏ కథకు ఆ కథ సెపరేట్…
Ads
మా గురువు గారు రాఘవేంద్ర రావు గారి ఆధ్వర్యంలో కొన్ని కథలు, అలాగే నాకు ఆప్తులు శ్రేయోభిలాషి అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వేగేశ్న సతీష్ గారి వి కొన్ని కథలు రిలీస్ అయ్యాయి…
మా గురువు గారి కథల గురించి చెప్పడానికి ఏమీలేదు…. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది…
లవ్ యు నాయనమ్మ అనే కథ కొంతలో కొంత బెటర్…. మిగతావి ఒకే ఇంట్లో చుట్టి పడేసిన కథలే… నటులు కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చెప్పుకో తగ్గవిగా లేవు….
ఇక సతీష్ గారు తీసిన (ఇప్పటి వరకూ విడుదలైనవి) మూడు కూడా చాలా బాగున్నాయి….
మానవ సంబంధాలు, పాతతరం మనస్తత్వాలు, కట్టుబాట్లు, ఆప్యాయతలు, అనుబంధాలు రంగరించిన ఎపిసోడ్స్…
మొదటి కథ ‘ ఉత్తరం’లో నాయనమ్మ తన మనవరాలికి భర్తకు దూరంగా ఉండేటప్పటి ఎడబాటు, దాని నుండి కలిగే అనుభూతి అనురాగాలను ఉత్తరాల ద్వారా చెప్పుకునేప్పుడు కలిగే మురిపెం, విరహం వంటి తీపి అనుభూతులను ఇప్పటి తరం వారు ఎలా మిస్సవ్వుతున్నారు లాంటి అంశాలను హృద్యంగా చూపించారు…
రెండో ఎపిసోడ్ వెండి పట్టీలు చాలా చాలా బాగుంది… బాలాదిత్య నటనతో గుండెలు పిండేసాడు… తన బిడ్డ నోరారా అడిగిన వెండి పట్టీలను కొనలేక పోయానే అనే బాధతో, అకాలవర్షాలకు పంట నష్టపోయి, అప్పుల భారంతో పుట్టెడు దుఃఖంతో నటించిన సీన్లు మనల్ని హత్తుకుంటాయి. ఆర్తి ఆర్ద్రతతో నిండిన ఈ ఎపిసోడ్ తప్పక చూడాల్సిందే…
ఇక మూడవది ట్రింగ్ ట్రింగ్ కథ ముచ్చటగా సరదాగా సాగిపోయింది…
జంట కూడా ముచ్చటగా ఉన్నారు, అంతే ముచ్చటగా నటించి మెప్పించారు…..
సతీష్ గారి మార్క్ కుటుంబ విలువలు, ప్రేమలు, అనురాగాలు, అనుబంధాలు, ఆర్ద్రతతో పాటుగా పల్లెలు పచ్చదనాలను కూడా చూడవచ్చు….
ఫామిలీ మొత్తం కూర్చొని చూడతగ్గ సీరీస్….
Share this Article