Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్యాతో గోక్కుని యూరప్ దేశాలు గజగజ… గ్యాస్ ఆగిపోతే మరింత వణుకే…

July 26, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి …………… ఎంతకీ ఎగతెగని రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వలన అటు రష్యాతో పాటు ఇటు ఉక్రెయిన్ మరియు ఐరోపా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి… యూరోపియన్ దేశాలు తమ దేశాల గాస్ వాడకం మీద కఠిన ఆంక్షలు విధించే దిశగా ఆలోచన చేస్తున్నాయి… తన మీద విధించిన కఠిన ఆంక్షల మీద కోపంగా ఉన్న రష్యా ఏ క్షణమైనా మొత్తం గాస్ సరఫరాని ఆపేసే అవకాశాలు ఉండవచ్చుననే ఆందోళనతో… వచ్చే శీతాకాలానికి కావాల్సిన గాస్ ని ఇప్పటి నుంచే పొదుపు చేసే చర్యలో భాగంగా యూరోపు దేశాల సమాఖ్య ప్రజలు, పరిశ్రమలు వాడే సహజ వాయువు వాడకం మీద కోత విధించాలనే నిర్ణయం తీసుకోబోతున్నాయి…

బ్రస్సెల్స్-యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ !…. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్శులా వోన్ డేర్ [Ursula Von Der Leyan ] ఈ రోజు అంటే మంగళ వారం బ్రస్సెల్స్ లో ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూరోపియన్ సభ్య దేశాలు తమ తమ దేశాలలో సహజ వాయువు వాడకం మీద రేషన్ విధించాలి అనే నిర్ణయానికి సమ్మతించాయి అని ప్రకటించింది.

EU దేశాల ఇంధన శాఖ మంత్రుల సమావేశంలో వచ్చే ఆగస్ట్ నుండి తమ తమ దేశాలలో గాస్ వాడకం మీద ఆంక్షలు విధించాలనే నిర్ణయానికి అంగీకారం కుదిరింది… వచ్చే నెల ఆగస్ట్ నుండి 2023 మార్చి నెల వరకు రోజుకి 15% వంతున గాస్ వాడకం మీద రేషన్ విధిస్తారు. ఇళ్ళలో వెచ్చదనం కోసం హీటర్లు వాడటానికి గాస్ ని ఉపయోగిస్తారు… అయితే దీని మీద 15 % కోత విధిస్తారు కాబట్టి తమ తమ ఇళ్ళలో రోజులో కొన్ని గంటల పాటు వెచ్చదనం కోసం గాస్ వాడకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలని ఉపయోగించుకోవాలని ప్రజలకి సూచనలు ఇస్తారు… ఇక పరిశ్రమలకి కోసం వాడే నాచురల్ గాస్ వాడకం మీద కూడా 15% కోత విధిస్తారు… అయితే ఇది నిర్బంధం కాదు కేవలం స్వచ్ఛంద కోత. వచ్చే శీతాకాలంలో చలిని తట్టుకోవడానికి ఎటూ గాస్ తో పనిచేసే రూమ్ హీటర్లు వాడాల్సిన స్థితి ఉంటుంది, అప్పుడు గాస్ కొరతతో బాధపడే కన్నా చలి అంత తక్కువగా ఉండని రోజుల్లో దానిని పొదుపు చేసి శీతాకాలంలో వచ్చే సమస్యని అధిగమించడానికే ఈ ముందస్తు జాగ్రత్తలు అని ఉర్శులా అన్నారు.

Ads

25-07-2022 సోమవారం ! ….. నిన్న సోమవారం రోజున రష్యా నోర్డ్ స్ట్రీమ్-1 [Nord Stream -1] పైపు లైన్ ద్వారా యూరోపు దేశాలకి సరఫరా చేసే నాచురల్ గాస్ సప్లై మీద 20% కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. తమపై విధించిన ఆంక్షలని ఎత్తివేయకపోతే యూరోపుకి పూర్తిగా గాస్ సప్లై ఆపేస్తానని పుతిన్ హెచ్చరించాడు. దాంతో విధి లేని స్థితిలో యూరోపియన్ దేశాలు తమ గాస్ వాడకం మీద స్వచ్ఛంద కోతలు విధిస్తున్నాయి.

త్వం శుంఠ అంటే త్వం శుంఠ అని రష్యా యూరోపు దేశాలు ఒకరిని ఇంకొకరు తిట్టిపోసుకుంటున్నాయి. రష్యా మీద ఏకపక్షంగా విధించిన ఆంక్షలు ఒక వైపు రష్యాకి తీవ్ర ఇబ్బందులు కలుగచేస్తుండగా… మరో వైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా రష్యా మీద యూరోపు ఆంక్షలు విధించడం రెండూ మూర్ఖపు చర్యలే. రష్యాకి చెందిన 600 బిలియన్ డాలర్ల ని వాడుకోవడానికి వీలులేకుండా చేసి రష్యాని తిట్టడం దేనికి ? రష్యా గ్యాస్ కావాలంటే రూబుల్ రూపంలో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేయడం సమంజసమే ! నిజానికి యూరోపు డాలర్ల రూపంలో చెల్లింపులు చేస్తే అవి వాడుకోవడానికి ఆంక్షలు అడ్డంగా ఉన్నాయి. అలా కాదు రూబుల్ రూపంలో చెల్లింపులు చేస్తే గ్యాస్ సరఫరా చేస్తాను అని రష్యా డిమాండ్ చేస్తుంటే, బహిరంగ మార్కెట్ లో రూబుల్ కొని చెల్లింపులు చేయడానికి EU దేశాలకి అహం అడ్డువస్తున్నది. మరోవైపు రూబుల్ ని కొంటే దాని విలువ పెరిగిపోతుంది డాలర్ తో పోలిస్తే… ఇక ఆంక్షలు విధించి లాభం ఏముంటుంది ?

విచిత్రమైన వ్యాఖ్యలు ! చెక్ రిపబ్లిక్ ఇంధన శాఖ మంత్రి జోజెఫ్ సికెల [Zojef Sikela ] మాట్లాడుతూ పుతిన్ మాకు గ్యాస్ సప్లై మీద కోత విధిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని వ్యాఖ్యానించాడు. పుతిన్ ఈ పని చేస్తాడు అని తెలిసీ మరి ఆంక్షలు విధించింది దేని కోసం ? అంటే మీరు ఆంక్షలు విధించవచ్చు దానికి ప్రతి చర్యగా పుతిన్ నిశ్శబ్దంగా ఉండాలి అనుకోవడం మూర్ఖత్వం కాకపోతే ఇంకేమిటి ? పైగా పుతిన్ డర్టీ గేమ్స్ ఆడుతూ తన అధికారాన్ని మిస్ యూజ్ చేస్తున్నాడని మరో వ్యాఖ్య నవ్వు తెప్పించేదిగా ఉంది తప్పితే పరిణితి చెందిన యూరోపు దేశ మంత్రిగా చేసిన వ్యాఖ్యలుగా లేవు… దీనర్ధం యూరోపు ఏం చేసినా రష్యా చూస్తూ ఉండాలి అనే అహంకారం స్పష్టంగా కనిపిస్తున్నది!

ఇప్పటికే 12 యూరోపు దేశాలకి రష్యా గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోవడమో లేదా పాక్షికంగా సరఫరా అవ్వడమో జరుగుతున్నది… దీని వలన పారిశ్రామికంగా తీవ్రంగా నష్టపోతున్నాం మేము అంటూ యూరోపియన్ యూనియన్ ఇంధన శాఖ కమిషనర్ కద్రి సిమ్సన్ [Kadri Simson ] వ్యాఖ్యానించాడు ఈ రోజు… ఏమాత్రం ముందస్తు ఆలోచన లేని పని చేసి, ఇప్పుడు ఇలా బాధని వెళ్లగక్కడం వీళ్ళకే చెల్లింది.

ఇంత జరిగినా, జరుగుతున్నా ఈ సంవత్సరాంతానికి రష్యాకి చెందిన క్రూడ్ ఆయిల్, బొగ్గు దిగుమతుల మీద పూర్తి స్థాయిలో నిషేధం విధించాలనే నిర్ణయం తీసుకుంది యూరోపియన్ యూనియన్. అంటే వచ్చే శీతాకాలం నాటికి తమ నిర్ణయాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నది EU. మరి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే బొగ్గు, క్రూడ్ ల మీద పూర్తి నిషేధం విధిస్తే పరిణామాలు ఇంకెలా ఉంటాయో ఆలోచించలేదేమో !

ఇప్పటికే యూరోపియన్ యూనియన్ లో భిన్న స్వరాలు వినిపించడం మొదలయ్యాయి. అంటే EU దేశాలలో ప్రముఖ పాత్ర పోషించే జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించడానికి సుముఖంగా లేవు. ఎందుకంటే ఈ రెండు దేశాలతో పాటు రష్యా సరిహద్దుల దగ్గర ఉన్న దేశాలు కూడా గ్యాస్ సరఫరా కోసం పూర్తిగా రష్యా మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే గోధుమలు, గ్యాస్ లాంటి నిత్యావసరాల కొరత వల్ల ఇటు ఆహార రంగంతో పాటు ఆటోమొబైల్ రంగాల పురోగతి కుంటుపడుతున్నది కాబట్టి సమిష్టిగా EU తీసుకునే నిర్ణయాలని జర్మనీ, ఇటలీతో పాటు మరికొన్ని దేశాలు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే యూరోపియన్ యూనియన్ విచ్ఛిన్నం అయే రోజులు దగ్గర పడవచ్చు !

బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల వలన కాలుష్యం ఎక్కువగా ఉంటుంది అని యూరోపు దేశాలు బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలని మూసి వేశాయి… కానీ తాజా ఇంధన సంక్షోభం కారణంగా మళ్ళీ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలని పనిచేయించే పనిలో ఉన్నాయి EU దేశాలు! యుద్ధ ప్రాతిపదికన థర్మల్ విద్యుత్ స్టేషన్లని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాయి!

పక్కనే ఉన్న రష్యా నుండి చవకగా వచ్చే సహజ వాయువు మరియు క్రూడ్ ఆయిల్ ని వాడుకుంటూ ఇన్నాళ్ళూ ప్రపంచ దేశాలకి మరీ ముఖ్యంగా భారత దేశానికి పర్యావరణం, కాలుష్యం అంటూ నీతి బోధలు చేస్తూ వచ్చిన యూరోపియన్ దేశాలు ఇప్పుడు అలా నీతులు చెప్పగలవా ? బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు కాలుష్యాన్ని వెదజల్లతాయి అంటూ తమ అణు రియాక్టర్లని అమ్మడానికి చేసిన హంగామా ఇంతా అంతా కాదు.

గుడ్డిలో మెల్ల !….. రష్యా నల్ల సముద్రంలో మోహరించిన తన నావీని దూరంగా జరిపి ఉక్రెయిన్ గోధుమలు ఎగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. మరో వైపు జర్మనీ ఇటలీలు రష్యా మీద విధించిన ఆంక్షలని సడలించాలి అంటూ త్వరలో నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికే ఆ సూచనలు కనపడుతున్నాయి.

యూరోపులో ఇంధన సంక్షోభం వలన భారీగా ఇంధనం ధరలు పెరిగాయి మరో వైపు గోధుమల కొరత వలన ఆహార పదార్ధాల ధరలూ పెరిగిపోయాయి. వెరసి ఎప్పుడూ లేని విధంగా దిగుమతుల మీద ఎక్కువ మొత్తం విచ్చించాల్సి రావడం మీద డాలర్ తో యూరో ధర పడిపోయింది. ఇంకో మూడు నెలలు ఇదే విధంగా కొనసాగితే యూరో విలువ మరింత పడిపోయి డాలర్ కంటే తక్కువగా నమోదు అవ్వవచ్చు. పారిశ్రామిక మందగమనం కూడా యూరోపు పాలిట శాపంగా మారబోతున్నది అంటూ బ్లూమ్ బర్గ్ అంచనా వేస్తున్నది.. అయితే ఆర్ధిక మందగమనం భారత్ మీద ఉండకపోవచ్చు అనే మరో అంచనా కొంతలో కొంత ఊరట కలిగించేదే ! మూడు నెలలు ఆగితే రెడ్డి ఎవరో రాజు ఎవరో తేలిపోతుంది !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?
  • ఓ ప్రియురాలి పాదయాత్ర..! ప్రేమ + భక్తి + విశ్వాసం + వ్యక్తీకరణ…
  • సినిమాల క్లైమాక్స్ గొడవలు… ఎటూ తేలక, తేల్చలేక మథనాలు…
  • విలన్‌పై పగ తీరాలంటే విలన్ బిడ్డను పడేయాలా..? సినిమా నీతి అదే..!!
  • ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?
  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions