.
ఆ పనిచేసింది థమన్ కాబట్టి… తను బాలయ్య వీరాభిమాని కాబట్టి… నందమూరి థమన్ అనిపించుకున్నాడు కాబట్టి… ఆ స్టేజీ మీద బాలయ్య నాలుగు తగిలించకుండా తమాయించుకున్నాడేమో… వేరే ఎవరైనా అయితే అక్కడే దబిడిదిబిడి అయిపోయి ఉండేది… (సరదాగా)…
విషయం ఏమిటంటే..? ఎన్టీయార్ ట్రస్టు థమన్ సారథ్యంలో ఓ లైవ్ కాన్సర్ట్ విజయవాడలో నిర్వహించింది కదా… యూఫోరియా పేరిట… తలసేమియా బాధితులకు సాయం చేయడం అనే ఓ మంచి కాజ్ కోసం నిర్వహించిన ఈ సినిమా సంగీత విభావరి కదా, ట్రస్టు సంకల్పం మంచిదే… పైగా ఆంధ్రా రాజకీయాలకు అడ్డా విజయవాడలో కదా… జనం విరివిగా తరలివచ్చారు…
Ads
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సహా బాలయ్య, ఆయన కుటుంబసభ్యులు, ప్రభుత్వ ముఖ్యులు హాజరయ్యారు… అట్టహాసంగా, ఆడంబరంగా… జిగేలుమంటున్న వెలుగులు, లేజర్ బీమ్స్… వేదిక వెనుక వైపు డిజిటల్ స్క్రీన్లు… కళ్లకు ఇబ్బందికరంగా అనిపించింది ప్రత్యక్ష ప్రసారం కూడా…
కార్యక్రమంలో చాలాసేపు సాకేత్, శ్రీకృష్ణలు పదే పదే హలో విజయవాడ, కమాన్ విజయవాడ అంటూ జనాన్ని ఉత్తేజపరచడానికే టైమ్ సరిపోలేదు… అదనంగా జైబాలయ్య నినాదాలు… అప్పుడప్పుడూ పవన్ కల్యాణ్ కీర్తనలు… అదేదో అధికార కూటమి విజయోత్సవ సభ అన్నట్టుగా సాగింది…
బాలయ్యకు ముందుగా చెప్పకుండానే… తనను ఆహ్వానిస్తూ ఓ పాట పాడేసి, వేదిక మీదకు రమ్మని పిలిచారు… తనతో ఓ సుగుణసుందరి పాట పాడించారు… ఫాఫం, అవస్థ పడ్డాడు బాలయ్య… బాలయ్య ప్రిపేర్ కాలేదు కదా, లేకపోతే మూణ్నాలుగు పాటలు దంచేవాడేమో…! తనను అక్కడే నిలబెట్టి సింగర్స్ మరో రెండు పాటలు పాడారు… (బాలయ్యకు పద్మభూషణ్ పురస్కార సందర్భంగా నిర్వహించిన కాన్సర్ట్ అన్నట్టుగా సాగింది చాలాసేపు)… (అఖండ పాటను దేవాంశ్‌కు అంకితమట… బాలయ్యే చెప్పినట్టు నందమూరి థమన్ అనిపించుకున్నాడుగా…)
వర్దమాన గాయకులు నజీరుద్దీన్, భరత్, వాగ్దేవిలతోపాటు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఆర్కెస్ట్రాను ఈ ప్రోగ్రామ్‌కు భలే వాడుకున్నారు… శివమణి డ్రమ్స్ మరో అదనపు ఆకర్షణ… సరే, థమన్ కదా, అన్నీ మాస్, బీట్ సాంగ్స్‌కే ప్రయారిటీ ఇచ్చి… ఇతర సంగీత దర్శకులు నిర్వహించే విభావరులకు పూర్తి భిన్నంగా నడిపించాడు… జనాన్ని ఎంటర్‌టెయిన్ చేయడమే లక్ష్యం కదా…
ఆ ధోరణి చూస్తే జస్ట్, పవన్ కల్యాణ్, బాలయ్య పాటలతోనే నడిపిస్తారేమో అనేట్టు కనిపించింది ఒక దశలో… మిగతా హీరోల పాటలు కూడా పాడించాడు థమన్ పాపం… బాలయ్యకు దీటుగా (??) థమన్ కూడా ఐదారు పాటలు పాడాడు… (కాస్త ఎత్తుగా సపరేట్ స్టేజీ తన కోసం వేసుకోవడం కూడా బాలేదు…) (ఈ కథనం రాసే సమయానికి ఇంకా పాడుతూనే ఉన్నాడు…)
(థమన్ ఎవరితో ఏ పాటలు పాడించినా సరే, తను పాడకుండా ఉండటం బెటర్ భవిష్యత్తులో కూడా… సిన్సియర్లీ… తను పాడిన పాటలు ప్లస్ కొన్ని ఎంపిక చేసిన పాటలు కూడా విసిగించాయి… డీఎస్పీ, అనిరుధ్, ఇళయరాజా తదితరులను కాపీ కొట్టాల్సిన అవసరం లేదు… సంగీత దర్శకుల కాన్సర్టులలో తప్పకుండా సదరు సంగీత దర్శకులు పాడాలనే నియమం ఏమీ లేదు థమన్ భయ్…)
Share this Article