Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీచ్‌లో పల్లీబఠాణీ అమ్మిన తొలి సంపాదన అర్ధరూపాయి… ఆ తర్వాత..?!

November 26, 2024 by M S R

.

పదీపన్నెండేళ్లుగా మీడియా కొన్ని వేల స్ఫూర్తిదాయక కథనాలు రాసింది ఆమె జీవితం గురించి..! ఒక్కసారి ఆ కథేమిటో నెమరేసుకుందాం… ‘‘పట్రీసియా… ఆమెది చెన్నై… సంప్రదాయిక క్రిస్టియన్ కుటుంబం… పదిహేడేళ్ల వయస్సులోనే నారాయణ్ అనే ఓ బ్రాహ్మణ యువకుడిని పెళ్లి చేసుకుంది… కుటుంబాన్ని ఎదిరించింది… భర్తతో కలిసి నడిచింది…

తరువాత నారాయణ్ తాగుడుకు అలవాటు పడ్డాడు, ఏం తినాలో, ఎలా బతకాలో అర్థం కాని దురవస్థ… ఆత్మహత్య చేసుకుందామని సముద్రం వైపు నడుస్తూ, మెరీనా బీచ్‌లో పల్లీలు, బఠాణీలు అమ్మేవాళ్లను చూసి… ఇంతమంది ఈ చిన్నపనితో బతుకుతున్నారు, నేనెందుకు బతకలేను అనుకుని, ఇంటికి వాపస్ వచ్చేస్తుంది… మరుసటి రోజు నుంచి తనూ పల్లీబఠాణీలు అమ్మడం స్టార్ట్ చేస్తుంది…

Ads

తొలిరోజు ఆమె సంపాదన ఆఠాణా… యాభై పైసలు… నిరాశపడలేదు… ఆదాయం పెరిగింది, మొదట ఓ టీకొట్టు, తరువాత ఓ హోటల్… మరికొన్ని హోటళ్లు, కార్పొరేట్ ఆఫీసుల క్యాంటీన్లు… మెరీనా బీచ్‌లో ఎంబీఏ చదువుకున్నాను, అదే చదువు నేర్పింది అని నవ్వుతూ చెప్పే ఆమెకు ఇప్పుడు కోట్లల్లో ఆస్తులు…

2010లో ఫిక్కీ బెస్ట్ వుమన్ ఎంటర్‌ప్రెనూర్ అవార్డు ఇచ్చింది ఆమెకు… ప్రస్తుతం సాందీఫా చెయిన్ ఆఫ్ హోటల్స్ నడిపిస్తోంది… నిజంగా ఓ ఇన్‌స్పైరింగ్ స్టోరీ… చప్పట్లు కొట్టి అభినందించాల్సిన కథ… ఈ కథ చదివి పదిమంది సక్సెస్ సాధించినా ఆమె బతుకు సార్థకమయ్యే కథ… అయితే..? ఎప్పుడూ నాణేనికి మరో పార్శ్వం ఉంటుంది… ఇది వెలుగైతే అది చీకటి…

patricia

నిజానికి ఇన్నికథలు రాశారు గానీ… ఆమె బీచ్‌లో పల్లీబఠాణీలు అమ్మలేదు… ఇంట్లోనే పచ్చళ్లు, జామ్‌లు తయారు చేసి అమ్మేది… తరువాత బీచ్‌లో ఓ కియోస్క్ పెట్టడానికి పర్మిషన్ కోసం ఏడాదిపాటు తిరిగింది… పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అలా తిప్పింది ఆమెను…

కియోస్క్ ఓపెన్ చేశాక చాయ్, కాఫీ, సమోసాలతో వ్యాపారం స్టార్ట్ చేసింది… ఆమెకు వ్యాపారంలో కిటుకులు ఏమిటో అర్థమయ్యాయి… క్రమేపీ వ్యాపారం పెంచుతూ పోయింది… ఆమె వ్యాపారం స్టార్ట్ చేసింది 1982 లో… ఇక్కడ కొన్ని ప్రశ్నలు…

  • ఆమె నిజంగానే పల్లీబఠాణీలు అమ్మడంతో స్టార్ట్ చేసిందనో… పచ్చళ్లతో వ్యాపారం మొదలుపెట్టిందనో అనుకుందాం… ఆరోజు నుంచి ఈరోజు దాకా అదే బీచులో పల్లీబఠాణీలు అమ్మేవాళ్లు వందల్లో ఉన్నారు… ఆమెకన్నా తెలివైనవాళ్లు, ఆమెకన్నా కష్టపడేవాళ్లు… కానీ ఆమె మాత్రమే ఎందుకు సక్సెసైంది..? ఈరోజుకూ ఇంటి నుంచి పచ్చళ్లు సప్లయ్ చేసేవాళ్లు బోలెడు మంది, మరి ఈమే ఎందుకు సక్సెసైంది..?
  • ఆమె జీవితమంతా వెలుగేమీ కాదు… ఆమె ప్రేమవివాహం ఓ డిజాస్టర్… బాధ్యత లేని ఆ భర్త ఆమెకు నరకం చూపించాడు… ఆమెను కొట్టి మరీ డబ్బు లాక్కుపోయేవాడు, నెలల తరబడీ ఇంటి మొహం చూసేవాడు కాదు… తిరిగీ తిరిగీ తాగీ తాగీ ఓరోజు హరీమన్నాడు… అదొక ఫెయిల్యూర్ స్టోరీ… తెలిసీతెలియని వయస్సులో తీసుకున్న అతి పెద్ద చెత్తా నిర్ణయం అని ఆమే చెప్పుకుంది…
  • బిడ్డ ప్రేమపెళ్లి యవ్వారం చూశాక మళ్లీ ఆమెను తల్లిదండ్రులే చేరదీశారు, సాయం చేశారు… తల్లి ఏరోజుకారోజు ఆమెను మోటివేట్ చేస్తూ బతుకుపై ఆశను నింపింది… తండ్రి స్నేహితుడే ఓ కియోస్క్ చూపించి, మెరీనా బీచ్ సజెస్ట్ చేశాడు…
  • బాగా కుదురుకునే దశలో కూతురు, అల్లుడు ఒకేసారి ఓ ప్రమాదంలో మరణించారు… ఆ దుఖాన్ని మరిచిపోవడానికి, మరింత పని కల్పించుకోవడం కోసం హోటళ్లను విస్తరించుకుంటూ పోయింది…
  • సో… చీకట్లు కమ్మేసినప్పుడు నిరాశలో కూరుకుపోకుండా… నిలబడి బతుకుతో పోరాడాలి అని చెప్పే కోణంలో ఈమె కథ గుడ్… కానీ ఆమెకు కొన్ని పర్సనల్, ఫ్యామిలీ అంశాల్లో దురదృష్టం తీవ్ర నష్టం కలిగించింది… వ్యాపారంలో మాత్రం అదృష్టం కరుణించింది… అంటే డెస్టినీ…
  • ఎస్, ఆమె బతుకులో వెలుగూనీడల్ని నిర్దేశించింది అదే… ప్రతి సక్సెస్ స్టోరీలో అంతర్లీనంగా కొన్ని ఫెయిల్యూర్లు కూడా ఉంటయ్… రీసెంటుగా మళ్లీ సోషల్ మీడియాలో ఆమె విజయగాథ సర్క్యులేట్ అవుతుంటే… నిజంగానే బీచులో పల్లీబఠాణీల అమ్మకం నుంచి వందల కోట్ల ఆస్తుల దాకా ఎదగడం కరెక్టేనా అని వెనక్కి తవ్వుకుంటూ పోతే తెలిసిన వివరాలు ఇవీ…!

patricia1

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎందుకు మంత్రి సీతక్క ఈ ఫోటో వైరల్ అయ్యిందో తెలుసా..?!
  • ఎందుకీ ఆందోళనలు..? వలసదారులపై ఎందుకు బ్రిటిషర్ల ఆగ్రహం..!?
  • పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడాల్సిందేననీ ట్రంపే చెప్పాడా ఏం..?!
  • హఠాత్తుగా ఎందుకో గానీ హైదరాబాద్ మెట్రో నష్టాల పాట..!!
  • నిజ జీవిత తలపై రాజశేఖర్ ‘తలంబ్రాలు’… షీరోయిక్ పాత్ర…
  • సీతాఫలం తినడం ఓ కళ..! చెంచాతో తింటే దాన్ని అవమానించినట్టే..!!
  • కేటీఆర్ మగ రాజకీయ భాష… ఆడతనమంటే చేతగానితనమట…
  • BB9Telugu..! ఫాఫం కింగ్ నాగార్జునకే అగ్నిపరీక్ష… నో బజ్, నో వ్యూయర్స్…
  • ఫాఫం మిరయ్… ఆ నిర్మాతలు ఎవరో గానీ… థియేటర్ వెళ్లే పనిలేదు..!!
  • టార్గెట్ సాక్షి ఎడిటర్..! జగన్ సన్నిహితగణంపై పాలకుల ప్రత్యేక దృష్టి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions