.
తెలుగులో ఉన్నవే నాలుగు టీవీ వినోద చానెళ్లు… జెమిని టీవీని వదిలేయండి… అదెవడూ పెద్దగా చూడటం లేదు… ఇక మిగతావి మూడు… ఈటీవీ, మాటీవీ, జీతెలుగు…
మరీ పాడుతా తీయగా, ఢీ, జబర్దస్త్ వంటి కామెడీ, డాన్స్, మ్యూజిక్ స్పెసిఫిక్ షోలను వదిలేస్తే ఇక చాలా షోలు ఒకే మూసలో సాగుతున్నాయి… వాళ్ల టీవీ సీరియళ్ల నటీనటులను తీసుకురావడం… వాళ్లతో చాట్ షో, కిట్టీ పార్టీల్లాంటి గేమ్స్ ఎట్సెట్రా…
Ads
సీరియళ్ల నడుమ పోటీలు పెట్టడం, జోకులు తదితరాలు మరీ ఎక్కువైపోయాయి… ప్రతిదీ ఇలాగే తయారైంది… మాటీవీ అయితే పాత బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ప్లస్ సీరియళ్ల యాక్టర్స్‌తో రియాలిటీ షోలు నడిపించేస్తున్నది…
జీతెలుగు సీరియళ్ల నటీనటులతో… అలాగే ఈటీవీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోల ఆర్టిస్టులతో… చివరకు పండుగలు, పబ్బాలు, విశేష దినాల సందర్భాలు వచ్చినప్పుడు కూడా తమ ఆస్థాన కళాకారుల్నే తీసుకుని అప్పటికప్పుడు షోలు వండేస్తున్నారు…
సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ కూడా సీరియల్స్ నడుమ పోటీకి తెరతీసింది… స్టార్ మాపరివారం అలాంటిదే… శ్రీముఖి హోస్ట్ చేస్తుంది… సుమ హోస్ట్ చేసే సుమ అడ్డా అయితే చిత్రవిచిత్రంగా మారిపోతోంది…
వీలైనంతవరకూ సినిమా ప్రమోషన్లు, సీరియల్స్ ప్రమోషన్లు… లేదంటే సీరియల్స్ నటీనటులతో ఎప్పుడూ కనిపించే ఆ సోది గేమ్ షో… ఫుల్లు మొనాటనీ వచ్చేసి, రేటింగ్స్ కూడా ఉండటం లేదు… ఐనా అనంతంగా అది సాగుతూనే ఉంటుంది…
చివరకు మాస్టర్ చెఫ్ షోను కూడా ఓ టైపు సుమ అడ్డా చేసేసింది సుమ… పేరు చెఫ్ మంత్ర… ఆహా ఓటీటీలో… బిగ్‌బాస్ ప్లస్ సీరియల్స్ ఆర్టిస్టులతో, కమెడియన్లతో ఆ షోను ప్రాజెక్టు కే పేరిట కంపు చేసేశారు ఆల్రెడీ… ప్రతి షోలనూ కనిపించి పిచ్చి కూతలు, తిక్క చేష్టలతో విసిగిస్తున్న దీపిక ఈ షోలోనూ అడుగుపెట్టింది…
జీతెలుగు కూడా ఇప్పుడు సూపర్ సీరియల్ చాంపియన్ షిప్ అని స్టార్ట్ చేసింది… రవి హోస్ట్… పెద్ద ఆసక్తికరంగా ఏమీ అనిపించడం లేదు… రవిలోని పాత స్పాంటేనిటీ, జోవియల్ నేచర్ ఏమయ్యాయో మరి… ఇస్మార్ట్ జోడీకి కూడా టీవీల్లోని రెగ్యులర్ ఆర్టిస్టులే…
ఈటీవీ పటాస్, స్టాండప్ కామెడీ వంటి షోలలో కొత్తవాళ్లను తీసుకొచ్చేవాళ్లు, అవకాశాలిచ్చేవాళ్లు… వాళ్లలో చాలామంది రెగ్యులర్ ఆర్టిస్టులు, కమెడియన్లుగా పలు ప్రోగ్రాముల్లో ఉపాధి కూడా పొందుతున్నారు… ఎంతసేపూ ఈ పాత ఆస్థాన కళాకారులే గాకుండా కొత్త వాళ్లతో కొత్త రియాలిటీ షోలు కాస్త కొత్త జానర్లు, ధోరణుల్లో ప్లాన్ చేస్తేనే ఆయా చానెళ్లకు రేటింగులు…
ఐనా, క్రియేటివిటీ చచ్చిపోయిన టీమ్స్ లీడ్ చేస్తున్నప్పుడు ఏం ఆశించగలం..?! గమనించారో లేదో… ఓటీటీలకు అలవాటైన జనం టీవీలను చూడటం మానేస్తున్నారు వేగంగా… రాబోయే రోజుల్లో టీవీక్షణం ఇంకా తగ్గబోతోంది… ఈ పాత, విసుగెత్తించే షోల పుణ్యమాని..!!
Share this Article