Prabhakar Jaini…… మనం నాగరీకులమని, మనకు మాత్రమే సున్నితమైన, మధురమైన భావాలుంటాయని, మనకు గొప్ప భాష ఉందనీ, సంస్కృతి ఉందని మనం అతిశయంతో ఉంటాం. అది కొంత వరకు మాత్రమే నిజం!
ఆ తల్లి తన బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకు రావాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె వెళ్ళి, ఒంటరిగా అడవిలోని ఒక చెట్టు కింద కూర్చుంటుంది. ఆ కాబోయే తల్లి మనసులో తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ పాట
Ads
బిడ్డ కడుపులో పడగానే, ఆ తల్లి తన బిడ్డ పాటను, ప్రసవం చేసే మంత్రసానికీ, ఊళ్ళోని పెద్ద ముత్తైదువలకు నేర్పిస్తుంది. బిడ్డ పుట్టగానే, వాళ్ళంతా ఆ పాటనే పాడుతూ ఆ బిడ్డను ఈ లోకంలోకి ఆహ్వానిస్తారు. అలా ఆ బిడ్డ పెరిగి పెద్దవుతున్న ప్రతీ సందర్భంలోనూ ఆ పాట పాడతారు. బిడ్డ కింద పడి ఏడుస్తున్నప్పడూ, వయసుకు వచ్చినప్పుడూ, పెళ్ళి చేసుకున్నప్పుడు, ఏదైనా వీరోచిత కార్యం చేసినప్పుడూ అదే పాట పాడుతారు. ఏదైనా తప్పు చేసినా, అందరి సమక్షంలో ఆ పాట వినిపించి, తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తారు.
అలా వారి జాతిలో ఆ బిడ్డకు ఆ పాట ప్రత్యేకం. చివరకు కాలం చేసినప్పుడు కూడా, ఆ పాటతోనే వీడ్కోలు పలుకుతారు. అలా తన తల్లి మదిలో రూపుదిద్దుకున్న, ఆ పాటనే జీవితాంతం పాడుకుంటూ ఆ బిడ్డ జీవనం సాగిస్తాడు. ఆ పాటే అతని మనుగడకు సాక్ష్యం. ఆ పాటే అతనికి గుర్తింపు. జీవితాంతం తల్లి తన కోసం పాడిన పాటను స్మరించుకుంటూ జీవించడంలోని మాధుర్యం వెలకట్ట లేనిది.
మనం కూడా మన జీవితంలో ఒక పాటను ఆలంబనగా చేసుకుంటే, మనం దారి తప్పినప్పుడు, ఆ పాట విషాదరాగంలో వినిపిస్తుంది. మంచి చేస్తే ఆనందభైరవిలో ఆనందభాష్పాలు కారుస్తుంది. మన గొంతుక బాగుండకపోవచ్చు. మనకు సంగీతం తెలియక పోవచ్చు. కానీ, మన కోసం మనం ఒక పాటను తప్పక ఎంచుకోవాలి… డాక్టర్ ప్రభాకర్ జైనీ, నవలా రచయిత, సినీ దర్శకుడు.
Share this Article