మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా… అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ రేపు మా మిత్రపక్షాలతో మాట్లాడి చెబుతాం అన్నాడు సంక్షిప్తంగా… ఏర్పాటు చేయబోమని తోసిపుచ్చేలేదు… ఇదే ప్రశ్నను ఖర్గేకు వేసినప్పుడు… మా వ్యూహాలేమిటో ఇప్పుడే చెబితే మోడీ యాక్టివ్ అయిపోతాడు కదా అని మర్మగర్భంగా బదులిచ్చాడు…
అంటే, ఆల్రెడీ ఇండికూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రాథమిక సంకల్పంతో ఉంది… కాంగ్రెస్ పార్టీ మరో అహ్మద్ పటేల్ డీకే శివకుమార్ ఆల్రెడీ రంగంలోకి దిగి సంప్రదింపులు మొదలుపెట్టాడనీ సమాచారం… చంద్రబాబుతో అవసరమైతే ఏదైనా కాన్ఫిడెన్షియల్‌గా మాట్లాడటానికి రేవంత్ రెడ్డి ఉండనే ఉన్నాడు… ఆప్ కేజ్రీవాల్, టీెఎంసీ మమత ఎన్నికల వరకే ఇండికూటమి సభ్యులం అని మొదట్లో చెప్పినా, ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసే పక్షంలో కాంగ్రెస్‌తోనే ఉంటారు…
రఫ్‌గా చెప్పాలంటే… ప్రస్తుతం ఎన్డీయే కూటమి 290 వరకూ ఉంది (సాయంత్రం 7.20 గంటలకు…) ఇండి కూటమి 235… అంటే తేడా 55 సీట్లు… అంటే ఎన్టీయే కూటమిలో ఉన్న 30 మంది ఇండి కూటమి వైపు జంపితే చాలు, ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ నుంచి బాగా డౌన్ అయిపోతుంది… ఇండియా కూటమి ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకుంటుంది… ప్రభుత్వం ఏర్పాటు చేసే పక్షంలో చిన్నాచితకా పార్టీలు కొన్ని అదనంగా కలిసొస్తాయి కదా… (జేడీయూ, జనసేన, టీడీపీ కలిపి 30)…
Ads
ఎన్టీయే కూటమి ఇంటాక్ట్‌గా ఉంటుందా..? అదీ డౌట్… ఎందుకంటే… ప్రస్తుతం ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు అత్యంత చంచల స్వభావి… వెన్నుపోట్లకు వెరవని పోకడ… నిబద్ధతలు, నైతికతలు పెద్దగా పట్టించుకోడు… తనకిప్పుడు మంచి నంబర్ లభించింది… నితిశ్ కూడా అంతే, అధికారం కోసం అటూఇటూ గతంలో బాగా జంపిన బాపతే… ఇద్దరూ స్థిరమైన రాజకీయ ధోరణి ఉన్నవాళ్లు కాదు… తాజాగా లాలూ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తపరిచాడు…
ఆ ఇద్దరూ ఒకవేళ ఇండియా కూటమి వైపు మళ్లితే మొత్తం ముఖచిత్రం ఒకేసారి మారిపోతుంది… మోడీకి ప్రభుత్వం ఏర్పాటు కష్టసాధ్యమవుతుంది… సరే, రెండు సీట్ల నుంచీ ప్రస్థానం మొదలుపెట్టిన బీజేపీ ప్రతిపక్షంలోనూ కూర్చోగలదు, కానీ మోడీ నాయకత్వానికి ఇక చెల్లుచీటీ తప్పదు, పార్టీలో అంతర్గత సంక్షోభాలు ముసురుకుంటాయి… వాజ్‌పేయి కాబట్టి అప్పట్లో సంకీర్ణ రథాన్ని నడిపించాడు…
మోడీ అలా నడిపించగలడా..? తన హయాంలో పలువురు మిత్రులు దూరమయ్యారు… అందుకే అందరికీ సందేహాలు… ఒకవేళ ఎన్డీయే పక్షాలను కలిసికట్టుగా ఉంచుకోగలిగినా సరే, రాను రాను నితిశ్ నుంచి ఏమో గానీ చంద్రబాబు స్వారీ చేయడం ఖాయం… గతంలో వాజపేయి ప్రభుత్వం మీద అలా చేసిన చరిత్ర ఉన్నవాడే… ఏ క్షణమైనా కాడి కింద పడేయడానికి కూడా వెనుకాడడు…
మరి, చంద్రబాబు మీద ఆధారపడనక్కర్లేని ప్లాన్-బీ ఏమైనా బీజేపీ వద్ద ఉందా..? ఇప్పటికైతే లేదు… నితిశ్ మీద, చంద్రబాబు మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు… అఖిలేష్, మమత, స్టాలిన్‌లు అస్సలు బీజేపీతో కలిసిరారు… మరిక వేరే మార్గం ఏముంది..? అయితే చంద్రబాబు స్వారీని భరించాలి, లేదంటే మోడీ హిమాలయ గుహలకు… మరో నాయకుడెవరో బీజేపీ పగ్గాలు చేతబట్టి… ఎప్పుడు ఇండికూటమి ప్రభుత్వం కూలిపోతుందా అని వేచి ఉండటం..!!
Share this Article