.
Pardha Saradhi Potluri
……… ఎన్ని రోజులు అలా వదిలేస్తారు? F-35 B lightning II! బ్రిటీష్ రాయల్ నావీకి చెందిన F-35 B Lightning II ఫైటర్ జెట్ తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో గత పది రోజులుగా టర్మాక్ మీద నిలిచి ఉంది!
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం భారత రాడార్లు స్టెల్త్ ఫైటర్ జెట్ ని ట్రేస్ చేశాయని… కానీ F-35 B తనంత తానుగా సహాయం కోరింది.
హిందూ మహాసముద్రంలో భారత నావీ, రాయల్ బ్రిటీష్ నావీ రెండు రోజుల సంయుక్త విన్యాసాలు చేస్తున్నాయి. అంటే ఇండియన్ నావీ, బ్రిటీష్ నావీ కలిసి డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి ఇది మామూలే!
Ads
అయితే జూన్ 14 న రోజు వారీ డ్రిల్స్ లో భాగంగా హిందూ మహాసముద్రంలో ఉన్న రాయల్ నేవీకి చెందిన విమాన వాహక యుద్ధ నౌక HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ( HMS Prince of Wales ) నుండి టేక్ ఆఫ్ తీసుకున్న F-35B లైట్నింగ్ II హిందూ మహాసముద్రంలో డ్రిల్స్ నిర్వహిస్తుండగా కేరళ తీరానికి 100 నాటికల్ మైల్స్ దూరంలో ఆకస్మాత్తుగా లోపం తలెత్తడంతో, వెనక్కి తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడంతో, తిరువనంతపురం ATC ని సహాయం అడిగాడు పైలట్!
F-35 డిస్ట్రెస్ కాల్!
SQUAWK 7700 అనే CODE ని తిరువనంతపురం రాడార్ కి వచ్చింది! దీని అర్ధం అత్యవసర లాండింగ్ కోసం తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ లాండింగ్ కోసం అనుమతి ఇవ్వమని!
అయితే అప్పటికే జాయింట్ డ్రిల్స్ చేస్తుండడం వలన డిస్ట్రస్ కాల్ రాయల్ నేవీ ఫైటర్ జెట్ ది అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అర్ధమయ్యింది కాబట్టి తిరువనంతపురం పౌర విమానాలకి సంబంధించింది కాబట్టి కాసేపు పాసింజర్ విమానాలని ఆపి F-35B లాండింగ్ కి అనుమతి ఇచ్చారు అధికారులు!
సంయుక్త విన్యాసాలలో భాగంగా నావీ విమానాలకి అత్యవసర పరిస్థితి ఏర్పడితే దగ్గరలో ఉండే తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ ని వాడుకోవచ్చని ముందే నోటిఫై చేశారు కాబట్టి F-35B పైలట్ డిస్ట్రెస్ కోడ్ పంపించాడు!
అబద్ధపు ప్రచారం!
1. జూన్ 14 న డిస్ట్రెస్ కోడ్ పంపించినపుడు low fuel అని పైలట్ తిరువనంతపురం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి చెప్పాడు.
2. తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయ్యాక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్ ఫ్యూయల్ ని F-35B కి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది! ఫ్యూయల్ నింపాక రాయల్ నావీ పైలట్ తిరిగి వెళ్ళిపోవాలి కదా? కానీ అలా చేయలేదు సరికదా రేడియో లో HMS ప్రిన్స్ అఫ్ వేల్స్ తో మాట్లాడాడు కానీ విషయం ఏమిటో చెప్పడు.
3. టర్మాక్ ( tarmac అంటే రన్వే నుండి పార్కింగ్ లేదా అప్రాన్ కి వెళ్లే దారిని టర్మాక్ అంటారు. పాత రోజుల్లో రన్వే ని కాంక్రీట్ తో నిర్మించి దానికి అనుసంధానంగా టెర్మినల్ కి వెళ్లే దారిని తారు తో (tar) తో వేసేవారు కాబట్టి tarmac పేరుతో పిలిచేవాళ్ళు. అదే ఇప్పటికీ వాడుకలో ఉంది) మీద ఫైటర్ జెట్ నిలిపి ఉంచడం అదీ పాసెంజర్ ఎయిర్ ల్ పోర్ట్ ఎందుకు అని, ఒక హాంగర్ ఇస్తాము అక్కడ పార్క్ చేయమని పైలట్ ని అడిగితే ఒప్పుకోకుండా విమానం పక్కనే విశ్రమించాడు పైలట్.
4.బహుశా F-35B రహస్యాలు తెలుసుకుంటారు అనే భయం వలన కావచ్చు హాంగర్ లో పార్క్ చేయడానికి ఒప్పుకోలేదు పైలట్.
5. రెండో రోజున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంజినీర్లు సహాయం చేయడానికి ముందుకు వచ్చినా పైలట్ ఒప్పుకోలేదు.
6.సింగపూర్ నుండి లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ ఇంజినీర్లు తిరువనంతపురం వచ్చి పరిశీలించి వెళ్లారు కానీ సమస్య ఏమిటో కనుక్కోలేక పోయారు!
7.రాయల్ నావీకి చెందిన కారియర్ స్ట్రైక్స్ గ్రూప్ ఇంజినీర్లు వచ్చి పరిశీలించినా సమస్య ఎక్కడ ఉందో కనుక్కోలేక పోయారు. చేసేది లేక వెనక్కి వెళ్లిపోయారు. Carrier Strikes Group అంటే విమాన వాహక యుద్ధ నౌక దానికి రక్షణ గా ఉండే ఫ్రీగేట్స్, కార్వేట్టి, డిస్ట్రాయర్స్ ని మొత్తం కలిపి కారియర్ స్ట్రైక్స్ గ్రూపు అంటారు. ఈ మొత్తానికి కలిపి మెయింటనెన్స్ కోసం ఇంజినీర్లు క్యారియర్ లో ప్రయాణిస్తారు.
****************
ఇంధనం నింపాక F-35B ని గాల్లోకి లేపడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు పైలట్ జూన్ 14 న.
అంటే సమస్య ఇంధనం తక్కువగా ఉండడం వలన రాలేదు.
హైడ్రాలిక్ సిస్టంలో లోపం వలన ఫైటర్ జెట్ ఎగరలేకపోతున్నది అన్నమాట!
అసలు F-35B డిజైన్ అనేది చాలా కాంప్లెక్స్ టెక్నాలజీతో చేశారు.
F-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటూ వస్తున్నది. ఈ ప్రోగ్రామ్ జీవిత కాలపు ఖర్చు 2 ట్రిలియన్ డాలర్లుగా ఉండవచ్చని అంచనా వేశారు. ఇంత ఖర్చుని భరించాలి అంటే ప్రోగ్రామ్ పూర్తవకుండానే ఫైటర్ జెట్స్ ని అమ్మకానికి పెట్టింది LockHeed Martin సంస్థ! ముందు ఫైటర్ జెట్స్ ని అమ్ముతూ మరో వైపు దాని R&D ని కొనసాగిస్తే ఖర్చులకి డబ్బు సమకూరుతుంది అనే ఉద్దేశ్యంతోనే అమ్మకానికి పెట్టింది!
IOC ( Initial Operation Certificate ) ని ఇవ్వాలంటే ప్రాధమికంగా ఎలాంటి లోపాలు లేకపోతేనే ఫెడరల్ ఏవియేషన్ పరీక్షలు జరిపి ఇస్తుంది. అలాంటిది IOC జారీ చేసేటప్పుడు లోపాలు బయటపడలేదా? లేక లాక్ హీడ్ మార్టిన్ మేనేజ్ చేసిందా?
IOC జారీ అయిన రెండేళ్లకి మళ్ళీ పరీక్షలు జరిపి FOC ( Final Operation Certificate ) ఇస్తారు. FOC జారీ చేసిన తరువాతే ఫైటర్ జెట్ ని అమ్మడానికి అనుమతి ఇస్తారు! మరి అమెరికన్ ఎయిర్ ఫోర్స్, నావీలు FOC ని ఆధారం చేసుకునే లాక్ హీడ్ మార్టిన్ నుండి F-35 లని గుడ్డిగా కొన్నాయా? ఏదో స్కామ్ జరిగి ఉంటుంది… లేకపోతే లోపాలు ఉన్నా ఎలా కొంటారు? (మిగతాది తరువాయి కథనంలో… పార్ట్-2)
Share this Article